టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంకను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌లో శ్రీలంక ఆటగాళ్లు గుణతిలక, చమీరా, దిల్షాన్ మధుశంక దూరమయ్యారు. అదే విధంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన పేసర్ ప్రమోదు మధుషాన్ కూడా ఈ టోర్నీలో ఆడేది అనుమానంగా మారింది.
ఇక ఇప్పటికే మధుశంక స్థానాన్ని పేసర్ ఫేర్నాండోతో భర్తీ చేసిన శ్రీలంక క్రికెట్.. తాజాగా గుణతిలక, చమీరా రిప్లేస్‌మెంట్స్‌ను కూడా శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. గుణతిలక స్థానంలో స్టాండ్‌బై జాబితాలో ఉన్న యువ బ్యాటర్ ఆషెన్ బండార, చమీరా స్థానంలో కసున్ రజితాను శ్రీలంక క్రికెట్ ఎంపిక చేసింది.
అదే విధంగా వీరిద్దరి భర్తీని టీ20 ప్రపంచకప్-2022 టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. కాగా కసున్ రజితా చివర సారిగా 2019లో శ్రీలంక జట్టు తరపున టీ20ల్లో ఆడాడు. ఇక గురువారం(ఆక్టోబర్ 20) నెదర్లాండ్స్‌తో జరిగిన క్వాలిఫియర్ మ్యాచ్‌లో విజయం సాధించిన శ్రీలంక.. సూపర్-12 అర్హత సాధించింది.
చదవండి: T20 WC 2022: నమీబియాకు షాకిచ్చిన యూఏఈ.. సూపర్-12కు నెదర్లాండ్స్
Comments
Please login to add a commentAdd a comment