న్యూజిలాండ్‌పై చారిత్రక సిరీస్ క్లీన్‌స్వీప్‌నకు శ్రీలంక జట్టు ఐదు వికెట్ల దూరంలో నిలిచింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే తొలి టెస్టు నెగ్గి జోరు మీదున్న శ్రీలంక... రెండో టెస్టులోనూ విజయానికి చేరువైంది. శనివారం మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 22/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్... లంక లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ధాటికి విలవిలలాడి 39.5 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటైంది.
శ్రీలంకపై న్యూజిలాండ్‌కు ఇదే అత్యల్ప స్కోరు. మిషెల్ సాన్‌ట్నర్ (51 బంతుల్లో 29; 4 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా... రచిన్ రవీంద్ర (10), డారిల్ మిషెల్ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టామ్ లాథమ్ (2), డ్వేన్ కాన్వే (9), కేన్ విలియమ్సన్ (7), ఎజాజ్ పటేల్ (8), టామ్ బ్లండెల్ (1), గ్లెన్ ఫిలిప్స్ (0) విఫలమయ్యారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 6, నిషాన్ మూడు వికెట్లు పడగొట్టారు.
లంక సారథి ధనంజయ ఐదు క్యాచ్‌లు అందుకోవడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 514 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న శ్రీలంక... న్యూజిలాండ్‌ను ఫాలోఆన్ ఆడించగా.. శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 41 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆత్మరక్షణ ధోరణిలో ఆడి దెబ్బతిన్న న్యూజిలాండ్... రెండో ఇన్నింగ్స్‌లో ఎదురుదాడికి దిగింది.
డ్వేన్ కాన్వే (62 బంతుల్లో 61; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధసెంచరీ సాధించగా.. కేన్ విలియమ్సన్ (58 బంతుల్లో 46; 4 ఫోర్లు), బ్లండెల్ (50 బంతుల్లో 47 బ్యాటింగ్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (41 బంతుల్లో 32 బ్యాటింగ్; 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో నిషాన్ మూడు వికెట్లు తీశాడు. అంతకుముందు శ్రీలంక 602/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా... చేతిలో 5 వికెట్లు ఉన్న న్యూజిలాండ్ జట్టు... ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే ఇంకా 315 పరుగులు చేయాల్సి ఉంది. వెలుతురులేమి కారణంగా మూడోరోజు ఆట నిర్ణీత సమయం కంటే ముందే ముగిసింది. మొత్తంగా న్యూజిలాండ్ శనివారం ఇక్క రోజే రోజు 13 వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్‌లోనే 9 వికెట్లు నెలకూలాయి.
చదవండి: IND vs BAN: బంగ్లాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడికి చోటు
Comments
Please login to add a commentAdd a comment