శ్రీలంక స్టార్ క్రికెటర్లు కుశాల్ మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, దనుష్క గుణతిలకలపై ఏడాదిపాటు విధించిన నిషేధాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఎత్తివేసింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డ్ మీడియా సమావేశంలో ద్రువీకరించింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు దేశీయ క్రికెట్‌తో, జాతీయ జట్టు ఎంపికకు కూడా అందుబాటులో ఉంటారని బోర్డ్ పేర్కొంది. కాగా గత ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక ఆటగాళ్లు డిక్వెల్లా, గుణతిలక, మెండిస్ బయో బబుల్‌ను ఉల్లంఘించి బయట తిరుగుతూ కనిపించారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకున్న శ్రీలంక క్రికెట్ క్రమశిక్షణా కమిటీ ఈ ముగ్గురు ఆటగాళ్లపై ఏడాది పాటు నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. "ముగ్గురు ఆటగాళ్ల వినతి మేరకు బోర్డు వాళ్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ సమయంలో ముగ్గురు ఆటగాళ్లకు కౌన్సెలింగ్ ఒక డాక్టర్‌తో కౌన్సిలింగ్ ఇప్పించాం. డాక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం అని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment