Dickwella
-
LPL 2024: శ్రీలంక స్టార్ క్రికెటర్‌పై వేటు..
శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లాపై సస్పెన్షన్ వేటు పడింది. లంక ప్రీమియర్ లీగ్-2024(ఎల్పీఎల్) సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో విఫలమైనందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) అతడిపై వేటు వేసింది.లీగ్‌లో గాలె మార్వెల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డిక్వెల్లాపై శుక్రవారం నుంచే నిషేధం అమల్లోకి వచ్చినట్లు ఎస్ఎల్సీ పేర్కొంది. డోపింగ్ పరీక్షల్లో అతడు కొకైన్ తీసుకున్నట్లు తెలినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కాగా డిక్‌వాలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదేమి తొలిసారి కాదు. అంతకుముందు 2021లో ఇంగ్లండ్ పర్యటనలో బయో-బబుల్ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు డిక్‌వాలా ఏడాది నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. ఇక డిక్వెల్లా జాతీయ జట్టు తరఫున 54 టెస్టులు, 55 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. -
LPL 2024: డిక్వెల్లా మెరుపు అర్దశతకం.. ఉడాన ఆల్‌రౌండర్ షో
లంక ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా నిన్న (జులై 3) రాత్రి జరిగిన మ్యాచ్‌లో గాలే మార్వెల్స్, కొలొంబో స్ట్రయికర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో స్ట్రయికర్స్పై మార్వెల్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మార్వెల్స్ నిర్ణీత ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో స్ట్రయికర్స్ చివరి వరకు పోరాడి (172/9) ఓటమిపాలైంది.డిక్వెల్లా, ఉడాన మెరుపు అర్దశతకాలునిరోషన్ డిక్వెల్లా (18 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇసురు ఉడాన (34 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్దశతకాలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన మార్వెల్స్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. స్ట్రయికర్స్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ (4-0-21-4), బినుర ఫెర్నాండో (4-0-22-3) అద్భుతంగా బౌలింగ్ చేశారు.బంతితోనూ రాణించిన ఉడాన180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్ట్రయికర్స్.. ఉడాన (2/34), తీక్షణ (2/20), అరచ్చిగే (2/21) చెలరేగడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (172/9) నిలిచిపోయింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో దనిత్ వెల్లలగే (45) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. -
తుస్సుమన్న బాబర్ ఆజమ్.. తిప్పేసిన అనామక బౌలర్
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ నిన్న (జులై 30) ప్రారంభమైంది. కొలొంబో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్, కొలొంబో స్ట్రయికర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్.. తౌహిద్ హ్రిదోయ్ (39 బంతుల్లో 54; 4 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. A few moments from the opening ceremony earlier this evening.#LPL2023 #LiveTheAction pic.twitter.com/QlczC1FX4Y — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 నిషాన్ మధుష్క (12), గుర్భాజ్ (21), అసలంక (12), ప్రియమల్ పెరీర (22) రెండంకెల స్కోర్లు చేసినప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఆఖర్లో దునిత్ వెల్లలగే (25 నాటౌట్), కెప్టెన్ తిసార పెరీరా (14 నాటౌట్) వేగంగా పరుగులు సాధించడంతో జాఫ్నా కింగ్స్ ఓ మోస్తరు స్కోర్‌ను ప్రత్యర్ధి ముందు ఉంచగలిగింది. కొలొంబో బౌలర్లలో నసీం షా, మతీష పతిరణ, చమిక కరుణరత్నే, సందకన్ తలో వికెట్ పడగొట్టారు. As promised, a spectacular opening ceremony and one to remember for a long time! Here are a few clicks. #LPL2023 #LiveTheAction pic.twitter.com/sY3FsYdQ6k — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 The young star from Bangladesh took on a powerful bowling attack like a boss, and constructed a spirited half century! #LPL2023 #LiveTheAction pic.twitter.com/kHiAwvwTWF — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 తిప్పేసిన అనామక బౌలర్.. 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కొలొంబో.. జాఫ్నా బౌలర్, అనామక కుర్రాడు విజయకాంత్ వియాస్కాంత్ (4-0-17-2) మాయాజాలం ధాటికి 19.4 ఓవర్లలో 152 పరుగులకు కుప్పకూలింది. విజయకాంత్‌తో పాటు హర్దుస్ విల్జోయెన్ (3/31), దిల్షన్ మధుషంక (2/18), తిసార పెరీరా (1/29) రాణించడంతో కొలొంబో టీమ్ ఓ మోస్తరు స్కోర్‌ను కూడా ఛేదించలేకపోయింది. Jaffna Kings stars shine bright with the ball! #LPL2023 #LiveTheAction pic.twitter.com/mxfUmeGa0T — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 తుస్సుమన్న బాబర్ ఆజమ్.. జాఫ్నాతో పోలిస్తే చాలా రెట్టు పటిష్టమైన కొలొంబో స్ట్రయికర్స్ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. కెప్టెన్ నిరోషన్ డిక్వెల్లా (34 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్) ఒక్కడు అర్ధసెంచరీతో రాణించాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి తుస్సుమన్నాడు. తిసార పెరీరా బౌలింగ్‌లో బౌండరీ బాదిన అనంతరం బాబర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత వచ్చిన నిస్సంక (1), ఫెర్నాండో (17), మహ్మద్ నవాజ్ (3), యశోధ లంక (11), నసీం షా (0), పతిరణ (8) నిరాశపరచగా.. తమిక కరుణరత్నే (23) పర్వాలేదనిపించాడు. Dickwella came back with a bang this season and showcased his batting prowess! He was a one-man army!#LPL2023 #LiveTheAction pic.twitter.com/rcfL5IeJir — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 -
లంక క్రికెటర్‌తో పవాద్ ఆలం వైరం.. ఇలా కూడా గొడవ పడొచ్చా!
శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లా, పాక్ క్రికెటర్ పవాద్ ఆలం మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది. గొడవ సీరియస్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. సరదాగా గొడవ పడిన ఈ ఇద్దరి చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిరోషన్ డిక్వెల్లా పవాద్ ఆలంను ఉద్దేశించి ఏదో అనగా.. దానికి పవాద్ కూడా కౌంటర్ ఇచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన లంక కెప్టెన్ కరుణరత్నే, పాక్ పేసర్ హారిస్ రౌఫ్‌లు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందా అని చూడడానికి వచ్చారు. గొడవ కాదని కేవలం ఫన్నీగా జరుగుతున్న సంభాషణ అని తెలుసుకొని వాళ్లు కూడా ఈ గొడవలో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోనూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ట్విటర్లో షేర్ చేసింది. ఇక పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి ఓవరాల్‌గా 323 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కెప్టెన్ కరుణరత్నే (27), ధనంజయ (30) నిలకడగా ఆడుతున్నారు. తొలి టెస్టులో పాక్ 342 పరుగుల లక్ష్య చేధనను సులువుగా చేధించడంతో ఈసారి మాత్రం అవకాశం ఇవ్వకూడదని లంక భావిస్తోంది. అందుకే పాక్‌కు భారీ టార్గెట్ ఇచ్చే యోచనలో ఉన్నారు. Buddies off the field 🤝#SLvPAK #SpiritofCricket pic.twitter.com/YuwsG50EPf — Pakistan Cricket (@TheRealPCB) July 26, 2022 చదవండి: ICC Men's Cricket Committee: ఐసీసీలో వివిఎస్ లక్ష్మణ్‌కు కీలక పదవి -
ఆ ముగ్గురు ఆటగాళ్లపై నిషేధం ఎత్తివేత.. మళ్లీ క్రికెట్ ఆడొచ్చు
శ్రీలంక స్టార్ క్రికెటర్లు కుశాల్ మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, దనుష్క గుణతిలకలపై ఏడాదిపాటు విధించిన నిషేధాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఎత్తివేసింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డ్ మీడియా సమావేశంలో ద్రువీకరించింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు దేశీయ క్రికెట్‌తో, జాతీయ జట్టు ఎంపికకు కూడా అందుబాటులో ఉంటారని బోర్డ్ పేర్కొంది. కాగా గత ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక ఆటగాళ్లు డిక్వెల్లా, గుణతిలక, మెండిస్ బయో బబుల్‌ను ఉల్లంఘించి బయట తిరుగుతూ కనిపించారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకున్న శ్రీలంక క్రికెట్ క్రమశిక్షణా కమిటీ ఈ ముగ్గురు ఆటగాళ్లపై ఏడాది పాటు నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. "ముగ్గురు ఆటగాళ్ల వినతి మేరకు బోర్డు వాళ్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ సమయంలో ముగ్గురు ఆటగాళ్లకు కౌన్సెలింగ్ ఒక డాక్టర్‌తో కౌన్సిలింగ్ ఇప్పించాం. డాక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం అని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. చదవండి: SA vs IND: రిషభ్ పంత్కి భారీ షాక్! -
సిగరెట్ల కోసం వెళ్లారు.. సస్పెండయ్యారు
డర్హమ్: ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటు వేసింది. బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించి, రోడ్లపై సిగరెట్లు కాలుస్తూ కెమెరా కంటికి చిక్కిన లంక స్టార్ ఆటగాళ్లు కుశాల్ మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, దనుష్క గుణతిలకలను తక్షణమే స్వదేశానికి పయనమవ్వాలని లంక బోర్డు ఆదేశించింది. లంక తుది జట్టులో రెగ్యులర్ సభ్యులైన ఈ ముగ్గురు ఆటగాళ్లు.. ఇంగ్లండ్‌తో చివరి టీ20 అనంతరం బయో బబుల్ నిబంధనల్ని అతిక్రమించి హోటల్ పరిధి దాటి వెలుపలికి వచ్చారు. అంతటితో ఆటగకుండా రోడ్లపై సిగరెట్లు కాలుస్తూ.. తమ దేశ అభిమాని కంట బడ్డారు. Familiar faces in Durham tonight, enjoying their tour! Obviously not here to play cricket, this video was taken at 23.28 Sunday. Disappointing performance by these cricket players but not forgetting to enjoy their night at Durham. RIP #SrilankaCricket #KusalMendis #ENGvSL pic.twitter.com/eR15CWHMQx — Nazeer Nisthar (@NazeerNisthar) June 28, 2021 వీరి నిర్వాకాన్ని ఆ అభిమాని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో లంక క్రికెట్ బోర్డు అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ అంశాన్ని శ్రీలంక క్రికెట్ చీఫ్ షమ్మి సిల్వా సీరియస్‌గా పరిగణించి, విచారణకు ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు అనంతరం ఈ ముగ్గరు క్రికెటర్లు బయో బబుల్ నిబంధనలను ఉల్లఘించారని రుజువు కావడంతో వారిపై తక్షణ వేటు వేశారు. ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేల కోసం లంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను ఆతిధ్య జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేయగా, జూన్ 29 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. చదవండి: కోహ్లీని తప్పిస్తే టీమిండియా ఐసీసీ టోఫ్రీ గెలుస్తుందా..? -
భాంగ్రా డాన్స్ చేసిన కోహ్లి
-
వైరల్ : కోహ్లి భాంగ్రా.. ఎందుకంత ఆనందం?
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం నాగ్‌పూర్ టెస్ట్ తొలిరోజు ఆటలో డాన్స్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. శ్రీలంక ఆటగాడు అవుటవ్వగానే ఆనందం తట్టుకోలేకపోయిన కోహ్లీ బాంగ్రా చిందులేశాడు. విషయం ఏంటంటే... 60వ ఓవర్లో రవీంద్ర జడేజా విసిరిన చివరి బంతి లంక బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్వెల్లా బ్యాట్‌కి తగిలిన బంతి అమాంతం గాల్లోకి లేవగా.. దానిని ఇషాంత్ ఒడిసి పట్టుకున్నాడు. పెవిలియన్ వెళ్తున్న డిక్వెల్లాను చూస్తూ కోహ్లి భాంగ్రా స్టెప్పులేశాడు. భారత్ తో జరిగిన తొలి టెస్టు ఆఖరి రోజు కావాలనే సమయం వృథా చేశానని శ్రీలంక ఆటగాడు నిరోషాన్ డిక్వెల్లా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. భారత్ గెలవాల్సిన తొలి టెస్ట్ డ్రాగా ముగియటంలో అది కూడా ఓ కారణమే. ఇది కూడా చదవండి... లంక తొండాట.. కోహ్లి ఫైర్ ఈ నేపథ్యంలో కోహ్లీ అతను అవుట్ కాగానే పెవిలియన్ వెళ్తున్న సెలబ్రేట్ చేసుకుని ఉంటాడని కామెంట్లు చేస్తున్నారు. -
కావాలనే టైమ్ వృథా చేశా: డిక్వెల్లా
కోల్ కతా:భారత్ తో జరిగిన తొలి టెస్టు ఆఖరి రోజు కావాలనే సమయం వృథా చేశానని శ్రీలంక ఆటగాడు నిరోషాన్ డిక్వెల్లా స్పష్టం చేశాడు. దానిలో భాగంగానే కొన్ని ఎత్తుగడలు అవలంభిచానని తెలిపాడు. ‘ఓ వైపు వికెట్లు పడుతున్నాయి. భారత్‌లో ముగ్గురు అత్యుత్తమ పేసర్లు ఉన్నారు. వికెట్‌ను కాపాడుకోవడం కంటే పేస్ బౌలింగ్‌లో ఎదురు దాడి చేయడమే బెస్ట్ డిఫెన్స్ అనిపించింది. షమీ ఓవర్లో స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ బాదాను. నిబంధనలకు విరుద్ధంగా లెగ్ సైడ్ లో స్క్వేర్ వెనుక ముగ్గురు ఫీల్డర్లు ఉన్న విషయం గుర్తించి అంపైర్ నిగెల్ లాంగ్‌కు చెప్పాను. దీంతో నోబాల్ ప్రకటించారు. వెంటనే కోహ్లి నా దగ్గరకు వచ్చి అది అంపైర్ల పని, నీపని నువ్వు చూసుకో అన్నాడు. అప్పుడే డ్రామా మొదలైంద’ని డిక్వెలా తెలిపాడు. ఆ క్రమంలోనే టైం వేస్ట్ చేయడానికి ఇదే సరైన అవకాశం అనిపించిందన్నాడు. దాంతోనే సమయం వృథా చేసేందుకు పదే పదే యత్నించినట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే భారత పేసర షమీతో బౌలింగ్ రన్నప్ విషయంలో గొడవైందన్నాడు. తాను సమయం తీసుకోవడం వేగంగా బంతులు వేయాలనుకునే భారత క్రికెట్ జట్టుకు నచ్చలేదన్నాడు.కాగా, తమ కెప్టెన్ మాత్రం కామ్ గా ఉండిమని చెప్పడంతో తాను ఎటువంటి వాగ్వాదానికి దిగలేదన్నాడు. -
మ్యాచ్ డ్రా కోసం లంక తొండాట.! కోహ్లి ఫైర్
కోల్‌కతా: భారత్- శ్రీలంకతో మధ్య జరిగిన తొలి టెస్టులో లంక ఆటగాళ్లు క్రీడాస్పూర్తిని మరిచారు. చివరి రోజు ఆటలో ఓటమి తప్పదని భావించిన లంక బ్యాట్స్‌మెన్స్ డ్రా కోసం డ్రామా ప్లే చేశారు. భారత బౌలర్ల పదునైన బంతులను ఎదుర్కోలేక తొండాట ఆడారు. ఒక వైపు టపటపా వికెట్లు పడుతుండటంతో చేసేదేమి లేక ఓటమి నుంచి గట్టెక్కేందుకు క్రీజులో టైంపాస్ చేయడం మెదలుపెట్టారు. దీంతో విసుగెత్తిన భారత బౌలర్లు, కెప్టెన్ కోహ్లి లంక బ్యాట్స్‌మెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మైదానంలో వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు అంపైర్లు జోక్యంతో సద్దుమణిగింది. ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్ 352/8 స్కోరు వద్ద డిక్లేర్ ఇచ్చి లంకను బ్యాటింగ్ ఆహ్వానించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక భారత్ బౌలర్ల దాటికి ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. షమీ వేసిన ఇన్నింగ్స్ 18 ఓవర్లో క్రీజులో ఉన్న నిరోషన్ డిక్వెల్లా, చండీమల్‌లు పదేపదే బౌలర్‌ను బంతులు వేయకుండా అడ్డుచెప్పాడు. దీంతో షమీ కోపాద్రిక్తుడయ్యాడు. చివరికి బ్యాడ్‌లైట్‌తో అంపైర్లు మ్యాచ్ త్వరగా ముగించారు. దీంతో లంక బతికి బట్టగట్టింది. కీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించిన లంక బ్యాట్స్‌మెన్ తీరుపై అభిమానులు, క్రికెట్ విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
డ్రా కోసం లంక బ్యాట్స్‌మెన్స్ డ్రామా
-
మా వ్యూహం ఫలించింది: శ్రీలంక క్రికెటర్
కొలంబో: భారత్ తో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో కుప్పకూలిన శ్రీలంక జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో ఎలా ఆడాలనే దానిపై పూర్తిస్థాయి కసరత్తులు చేసిందట. ఫాలో ఆన్ ఆడటానికి ముందు వచ్చిన బ్రేక్ లో లంక ఆటగాళ్లు ప్రణాళిక బద్ధంగా బరిలోకి దిగి రాణించడానికి వ్యూహాలు రచించిందట. శనివారం 50/2 తో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన లంకేయులు.. అశ్విన్(5/69) ధాటికి 183 పరుగుల వద్ద తలవంచారు. అదే సమయంలో తొలి ఇన్నింగ్స్ లోటు 439 పరుగుల్ని ఎలా పూడ్చాలనే దానిపై తాము సుదీర్ఘంగా చర్చించినట్లు శ్రీలంక వికెట్ కీపర్ డిక్ వెల్లా వెల్లడించాడు. 'మా రెండో ఇన్నింగ్స్ వ్యూహం ఫలించింది. ఫాలో ఆన్ లో ఎలా ఆడాలో ప్రణాళికలు సిద్దం చేసుకుని బరిలోకి దిగాం. ప్రధానంగా అశ్విన్, జడేజాలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై కసరత్తు చేశాం. ఆ ఇద్దర్ని ఎదుర్కొనే క్రమంలో స్వీప్ షాట్ ఆడాలని నిర్ణయించుకున్నాం. క్రీజ్ లో దిగాక అది చేసి చూపించాం. ఇక్కడ కోచ్ నుంచి సలహాలు తీసుకున్నాం. దాంతో రెండో ఇన్నింగ్స్ లో మారింది. ఇది స్పిన్నింగ్ వికెట్.. అందుచేత ఎక్కువగా స్వీప్ షాట్లు ఆడాం. అది పచ్చికతో ఉన్న పిచ్ ఎదురైతే స్వీప్ షాట్లను ఆడేవాళ్లం కాదు'అని డిక్ వెల్లా పేర్కొన్నాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో కుశాల్ మెండిస్, కరుణరత్నేల జోడి 191 పరుగుల భాగస్వామ్యంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ మెండిస్ చేసే క్రమంలో ఎక్కువగా స్వీప్ షాట్లతో అలరించాడు. అశ్విన్, జడేజాల బౌలింగ్ లో స్వీప్ షాట్లతో ఆకట్టుకున్నాడు. -
మరో పరాభవం తప్పదనుకున్నాం.. కానీ!
రికార్డు ఛేదనపై లంక క్రికెటర్ గుణరత్నే హర్షం కొలంబో: అంచనాలకు అందని రీతిలో సంచలన ఆటతీరును ప్రదర్శించి శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 3–2తో దక్కించుకున్న జింబాబ్వే చేతిలో ఆ జట్టు మరో పరాభవాన్ని తప్పించుకుని చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. జింబాబ్వేకు వన్డే సిరీస్ ను కోల్పోయిన లంకేయులు ఏకైక టెస్టులో 388 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. జట్టు కష్ట సమయంలో క్రీజులోకొచ్చిన గుణరత్నే(151 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు)తో కలిసి డిక్వెల్లా(118 బంతుల్లో 81; 6 ఫోర్లు) ఇన్నింగ్స్ ను నిర్మించి విజయానికి బాటలు వేశాడు. ఈ విజయంపై మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో గుణరత్నే హర్షం వ్యక్తం చేశాడు. '203 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయాం. విజయానికి మరో 185 పరుగులు కావాలి. వన్డే సిరీస్ లాగ మరో పరాభవం తప్పదనిపించింది. అయితే భారీ ఇన్నింగ్స్ లు అలవాటు లేకున్నా డిక్ వెల్లా నాకు స్ఫూర్తిగా నిలిచాడు. డిక్ వెల్లా ప్లాన్ వల్లే గెలుస్తామనుకున్న జింబాబ్వేకు దిమ్మతిరిగింది. తరచుగా డిక్వెల్లా తన వద్దకు వచ్చి మాట్లాడమన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో చెప్పడానికి సలహాలు ఇవ్వమంటూనే పరుగులు చేసేందుకు అవకాశం ఇవ్వమన్నాడు. లక్ష్యాన్ని త్వరగా చేరుకునే క్రమంలో జింబాబ్వేపై డిక్ వెల్లా ఒత్తిడి పెంచాడు. 121 పరుగుల కీలక భాగస్వామ్యం అనంతరం డిక్ వెల్లా ఔటయ్యాక దిల్ రువాన్ పెరీరాతో జట్టును విజయతీరాలకు చేర్చడం మరిచిపోలేని అనుభూతి అని' గుణరత్నే వెల్లడించాడు. ఆసియాలో ఇతే అత్యుత్తమ ఛేదన కావడంతో పాటు ఓవరాల్ గా టెస్టుల్లో ఐదో అత్యుతమ ఛేదనను లంక తమ ఖాతాలో వేసుకుంది. గతంలో 2006లో దక్షిణాఫ్రికాపై 352 పరుగుల ఛేదనే ఇప్పటిదాకా లంక రికార్డు ఛేదనగా ఉండేది. మరోవైపు 11 వికెట్లు తీసిన లంక స్పిన్నర్ హెరాత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. -
స్టంపింగ్ చేయనందుకు భారీ జరిమానా
గాలె:ఒక వికెట్ కీపర్ స్టంపింగ్ చేయడంలో విఫలమైతే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనల్ని ఉల్లంఘించినట్లా?, కచ్చితంగా కాదు. కాకపోతే కావాలనే స్టంపింగ్ చేయకపోతే అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమే. ఇలా ప్రవర్తించిన శ్రీలంక వికెట్ కీపర్ డిక్వెల్లాకు భారీ జరిమానా పడింది. అతను మ్యాచ్ ఫీజులో 30 శాతాన్ని కోల్పోయాడు. అసలేం జరిగిందంటే.. శుక్రవారం జింబాబ్వే-శ్రీలంకల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో లంక స్పిన్నర్ ధనంజయ బౌలింగ్ లో జింబాబ్వే ఆటగాడు సోలామాన్ క్రీజ్ బయటకి వెళ్లి షాడ్ ఆడబోయాడు. అయితే ఆ బంతిని వైడ్ గా సంధించే ప్రయత్నం చేయడంతో అప్పటికే ముందుకు వెళ్లి ఉన్న సోలామన్ రివర్స్ స్వీప్ కు యత్నించి విఫలమయ్యాడు. అప్పటికే బంతి డిక్ వెల్లా చేతుల్లో పడ్డా అతను స్పందించిన తీరు ఆశ్చర్యపరిచింది. కొన్నిసెకన్లు పాటు అలానే ఉండిపోయి బ్యాట్స్‌మన్ సురక్షితంగా క్రీజ్‌లోకి వచ్చిన తరువాత తాపీగా స్టంపింగ్ చేశాడు. ఆపై అవుట్ కు అప్లై కూడా చేశాడు. అయితే అది నాటౌట్ గా రిప్లేలో తేలింది. ఇక్కడ డిక్ వెల్లా ఉద్దేశపూర్వంగానే స్టంపింగ్ చేయలేదని నిర్ధారణకు వచ్చిన ఐసీసీ లెవల్-1 నిబంధనల ప్రకారం అతనికి 30 శాతం ఫీజు కోత విధించింది. -
డిక్ వెల్లా హాఫ్ సెంచరీ
కార్డిఫ్: చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో జరుగుతున్న అమీతుమీ మ్యాచ్ లో శ్రీలంక ఓపెనర్ డిక్ వెల్లా హాఫ్ సెంచరీ సాధించాడు. 52 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో అర్థ శతకాన్ని పూర్తి చేశాడు. శ్రీలంక కష్టాల్లో పడ్డ సమయంలో డిక్ వెల్లా బాధ్యతాయుతంగా ఆడాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన లంకేయులు ఓపెనర్ గుణ తిలకా(13) వికెట్ ను ఆదిలోనే కోల్పోయారు. ఆ తరుణంలో డిక్ వెల్లా అత్యంత జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించాడు. కుశాల్ మెండిస్ తో ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డాడు. అయితే జట్టు స్కోరు 82 పరుగుల వద్ద మెండిస్(27) అవుట్ కావడంతో పాటు, ఆపై వెంటనే చండిమల్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు. దాంతో 83 పరుగులకు మూడు వికెట్లను కోల్పయారు లంకేయులు. అయితే డిక్ వెల్లా ఆత్మవిశ్వాసంతో ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. -
డిక్ వెల్లా పై రెండు మ్యాచ్‌ల నిషేధం
గీలాంగ్:ఆస్ట్రేలియాతో ఆదివారం ఇక్కడ జరిగిన రెండో ట్వంటీ 20 లో అంపైర్ల నిర్ణయాన్ని తప్పుబట్టిన శ్రీలంక ఆటగాడు నిరోషాన్ డిక్ వెల్లా రెండు మ్యాచ్‌లు నిషేధానికి గురయ్యాడు. తను అవుటైనట్లు రిప్లేలో స్పష్టంగా కనిపించినప్పటికీ ఆ నిర్ణయంతో డిక్ వెల్లా ఏకీభవించలేదు. అంపైర్ల నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెవిలియన్ చేరాడు. ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు రావడంతో అతనిపై చర్యలు తీసుకోనున్నట్లు ఐసీసీ తాజా ప్రకటనలో తెలిపింది. అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లను విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన నాల్గో వన్డేలో కూడా డిక్ వెల్ నిబంధనల్ని ఉల్లంఘించాడు. ఐసీసీ తాజా నిబంధలన ప్రకారం రెండేళ్ల కాలంలో ఒక క్రికెటర్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి నాలుగు డీమెరిట్ పాయింట్లకు పైగా తన ఖాతాలో వేసుకుంటే రెండు మ్యాచ్‌లు నిషేధం ఎదుర్కోక తప్పదు. ఈ తాజా చర్యతో డిక్ వెల్ ఖాతాలో ఐదు డీమెరిట్ పాయింట్లు వచ్చి చేరాయి. దాంతో ఆస్ట్రేలియాతో బుధవారం జరిగే మూడో ట్వంటీ 20 మ్యాచ్ కు డిక్ వెల్ దూరం కానుండగా, ఆ తరువాత మార్చి 25వ తేదీన బంగ్లాదేశ్ తో జరిగే తొలి వన్డేలో డిక్ వెల్ పాల్గొనే అవకాశం లేదు.