LPL 2024: డిక్వెల్లా మెరుపు అర్దశతకం.. ఉడాన ఆల్‌రౌండర్‌ షో | LPL 2024: Dickwella Pepper Jaffna In Nail Biting Thriller | Sakshi
Sakshi News home page

LPL 2024: డిక్వెల్లా మెరుపు అర్దశతకం.. ఉడాన ఆల్‌రౌండర్‌ షో

Published Thu, Jul 4 2024 9:19 AM | Last Updated on Thu, Jul 4 2024 9:19 AM

LPL 2024: Dickwella Pepper Jaffna In Nail Biting Thriller

లంక ప్రీమియర్‌ లీగ్‌ 2024లో భాగంగా నిన్న (జులై 3) రాత్రి జరిగిన మ్యాచ్‌లో గాలే మార్వెల్స్‌, కొలొంబో స్ట్రయికర్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో స్ట్రయికర్స్‌పై మార్వెల్స్‌ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన మార్వెల్స్‌ నిర్ణీత ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఛేదనలో స్ట్రయికర్స్‌ చివరి వరకు పోరాడి (172/9) ఓటమిపాలైంది.

డిక్వెల్లా, ఉడాన మెరుపు అర్దశతకాలు
నిరోషన్‌ డిక్వెల్లా (18 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇసురు ఉడాన (34 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్దశతకాలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన మార్వెల్స్‌ ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. స్ట్రయికర్స్‌ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ (4-0-21-4), బినుర ఫెర్నాండో (4-0-22-3) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

బంతితోనూ రాణించిన ఉడాన
180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్ట్రయికర్స్‌.. ఉడాన (2/34), తీక్షణ (2/20), అరచ్చిగే (2/21) చెలరేగడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (172/9) నిలిచిపోయింది. స్ట్రయికర్స్‌ ఇన్నింగ్స్‌లో దనిత్‌ వెల్లలగే (45) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement