శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్‌వెల్లాపై సస్పెన్షన్ వేటు పడింది. లంక ప్రీమియర్ లీగ్-2024(ఎల్‌పీఎల్) సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో విఫలమైనందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) అతడిపై వేటు వేసింది.
లీగ్‌లో గాలె మార్వెల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డిక్‌వెల్లాపై శుక్రవారం నుంచే నిషేధం అమల్లోకి వచ్చినట్లు ఎస్‌ఎల్‌సీ పేర్కొంది. డోపింగ్ పరీక్షల్లో అతడు కొకైన్ తీసుకున్నట్లు తెలినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
కాగా డిక్‌వాలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదేమి తొలిసారి కాదు. అంతకుముందు 2021లో ఇంగ్లండ్ పర్యటనలో బయో-బబుల్ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు డిక్‌వాలా ఏడాది నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. ఇక డిక్‌వెల్లా జాతీయ జట్టు తరఫున 54 టెస్టులు, 55 వన్డేలు, 28 టీ20లు ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment