కార్డిఫ్: చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో జరుగుతున్న అమీతుమీ మ్యాచ్ లో శ్రీలంక ఓపెనర్ డిక్ వెల్లా హాఫ్ సెంచరీ సాధించాడు. 52 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో అర్థ శతకాన్ని పూర్తి చేశాడు. శ్రీలంక కష్టాల్లో పడ్డ సమయంలో డిక్ వెల్లా బాధ్యతాయుతంగా ఆడాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన లంకేయులు ఓపెనర్ గుణ తిలకా(13) వికెట్ ను ఆదిలోనే కోల్పోయారు. ఆ తరుణంలో డిక్ వెల్లా అత్యంత జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించాడు.
కుశాల్ మెండిస్ తో ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డాడు. అయితే జట్టు స్కోరు 82 పరుగుల వద్ద మెండిస్(27) అవుట్ కావడంతో పాటు, ఆపై వెంటనే చండిమల్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు. దాంతో 83 పరుగులకు మూడు వికెట్లను కోల్పయారు లంకేయులు. అయితే డిక్ వెల్లా ఆత్మవిశ్వాసంతో ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు.