
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం నాగ్‌పూర్ టెస్ట్ తొలిరోజు ఆటలో డాన్స్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. శ్రీలంక ఆటగాడు అవుటవ్వగానే ఆనందం తట్టుకోలేకపోయిన కోహ్లీ బాంగ్రా చిందులేశాడు.
విషయం ఏంటంటే... 60వ ఓవర్‌లో రవీంద్ర జడేజా విసిరిన చివరి బంతి లంక బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్వెల్లా బ్యాట్‌కి తగిలిన బంతి అమాంతం గాల్లోకి లేవగా.. దానిని ఇషాంత్ ఒడిసి పట్టుకున్నాడు. పెవిలియన్ వెళ్తున్న డిక్వెల్లాను చూస్తూ కోహ్లి భాంగ్రా స్టెప్పులేశాడు. భారత్ తో జరిగిన తొలి టెస్టు ఆఖరి రోజు కావాలనే సమయం వృథా చేశానని శ్రీలంక ఆటగాడు నిరోషాన్ డిక్వెల్లా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. భారత్ గెలవాల్సిన తొలి టెస్ట్ డ్రాగా ముగియటంలో అది కూడా ఓ కారణమే.
ఇది కూడా చదవండి... లంక తొండాట.. కోహ్లి ఫైర్
ఈ నేపథ్యంలో కోహ్లీ అతను అవుట్ కాగానే పెవిలియన్ వెళ్తున్న సెలబ్రేట్ చేసుకుని ఉంటాడని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment