Danushka Gunathilaka
-
శ్రీలంక క్రికెటర్‌పై నిషేధం ఎత్తివేత.. జట్టులోకి రీ ఎంట్రీ!
శ్రీలంక స్టార్ క్రికెట్ దనుష్క గుణతిలకపై ఆదేశ క్రికెట్ బోర్డు నిషేధాన్ని ఎత్తివేసింది. అత్యాచార వేధింపుల కేసులో గుణతిలక నిర్దోషిగా తేలడంతో శ్రీలంక క్రికెట్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన జరిగిన టీ20 వరల్డ్ కప్ ఆడిన శ్రీలంక జట్టులో గుణతిలక సభ్యునిగా ఉన్నాడు. అయితే ఈ టోర్నీలో గుణతిలక కేవలం నమీబియాతో జరిగిన మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అదే సమయంలో ఆస్ట్రేలియాలో గుణతిలకపై అత్యాచార వేధింపుల కేసు నమోదు అయింది. తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని ఓ 29 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు అతడని జట్టు నుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ జిల్లా కోర్టులో కేసు నడుస్తోంది. అయితే తాజాగా అతడిపై చేసిన ఆరోపణలన్నింటినీ న్యూ సౌత్ వేల్స్ కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలోనే శ్రీలంక క్రికెట్ అతడిపై బ్యాన్‌ను ఎత్తివేసింది. ఈ మేరకు.. ఆస్ట్రేలియాలో దనుష్క గుణతిలకపై వేసిన నేరారోపణలను దర్యాప్తు చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు స్వతంత్ర విచారణ కమిటీ.. గుణతిలకపై విధించిన నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయాలని సిఫార్సు చేసింది. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ అతడిని నిర్దోషిగా తేల్చింది. దీంతో ఇప్పుడు అతడు మళ్లీ జట్టులోకి తిరిగి రావచ్చు అని శ్రీలంక క్రికెట్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి: Ind Vs Aus T20I: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. వైజాగ్‌లో ఈసారి వేరే లెవల్! -
యువతి పట్ల మృగంలా వ్యవహరించిన కేసు.. క్రికెటర్‌కు ఊరట
లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకకు ఊరట లభించింది. గుణతిలకపై నమోదైన నాలుగు కేసుల్లో మూడింటిని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్ట్ (సిడ్నీ) కొట్టివేసింది. గుణతిలకపై మరో కేసు విచారణలో ఉన్నట్లు కోర్టు పేర్కొంది. విచారణలో ఉన్న కేసు ఏంటంటే.. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడే క్రమంలో మృగంలా ప్రవర్తించాడని, పలు మార్లు రక్షణ కూడా లేకుండా బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడన్న కేసులో గుణతిలక ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నాడు. పోలీసుల ఫ్యాక్ట్స్ షీట్ ప్రకారం.. లైంగిక దాడికి పాల్పడే క్రమంలో గుణతిలక బాధితురాలి పట్ల పైశాచికంగా వ్యవహరించాడని, ఆమె తిరగబడే సరికి సహనం కోల్పోయిన అతను.. గొంతు నులిమి, ఊపిరి ఆడనీయకుండా చేశాడని, అలాగే తలను గోడకేసి పలు మార్లు గట్టిగా బాదాడని తెలుస్తోంది. దోషిగా తేలితే 14 ఏళ్ల జైలు శిక్ష.. ఈ కేసులో దోషిగా తేలితే గుణతిలకకు 14 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడే అవకాశముంది. మరోవైపు గుణతిలకపై ఇదివరకే శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) సస్పెన్షన్ వేటు వేసింది. ఏ రకమైన క్రికెట్ (స్థాయి, ఫార్మాట్, లీగ్) ఆడకుండా ఎస్ఎల్సీ నిషేధం విధించింది. కాగా, గతేడాది టీ20 వరల్డ్‌కప్-2022 ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన గుణతిలక.. సిడ్నీలో ఓ యువతిపై బలవతంగా అత్యాచారిని పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన గుణతిలక బెయిల్ కూడా దొరక్క నానా ఇబ్బందుల పడ్డాడు. చదవండి: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే? -
లంక క్రికెటర్ గుణతిలకకు బెయిల్
శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు కాస్త ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గుణతిలకకు బెయిల్ మంజూరు అయింది. అయితే సోషల్ మీడియాకు మాత్రం దూరంగా ఉండాలని కోర్టు హెచ్చరించింది. ఇక టి20 ప్రపంచకప్ సమయంలో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు చేయడం సంచలం కలిగించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుణతిలక ఉన్న హోటల్‌కు వచ్చి అరెస్టు చేశారు. అప్పటినుంచి గుణతిలక కేసులో విచారణ జరుగుతుంది. అయితే స్థానిక కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో గుణతిలక అక్కడి సుప్రీంను ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు విచారణ చేపట్టి గుణతిలకకు కొన్ని కండీషన్స్‌పై బెయిల్ మంజూరు చేసింది. కేసు పూర్తయ్యేంత వరకు దేశం విడిచి వెళ్లరాదని.. 150,000 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానతో పాటు పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుంది. రెండురోజులకోసారి పోలిస్ రిపోర్టింగ్ ఇవ్వాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు గుణతిలకపై నిఘా ఉంటుందని.. తనపై కేసు పెట్టిన మహిళతో ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోకూడదని తెలిపింది. ఇక ఈ కేసు మళ్లీ జనవరి 12న విచారణకు వచ్చే అవకాశముంది. ఇక టి20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలో లంక పోరాటం ముగియడంతో స్వదేశానికి వెళ్లిపోయింది. అయితే గుణతిలకను మాత్రం ఆస్ట్రేలియాలోనే వదిలేసింది. లైంగిక ఆరోపణలపై గుణతిలక అరెస్టైన వెంటనే అతన్ని అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇక గుణతిలక లంక తరపున 47 వన్డేలు, 46 టి20లు, ఎనిమిది టెస్టులు ఆడాడు. చదవండి: ఆసీస్‌లో లంక క్రికెటర్ గుణతిలక అరెస్ట్ మృగంలా ప్రవర్తించిన శ్రీలంక క్రికెటర్, రక్షణ కూడా లేకుండా అమానుషంగా -
మృగంలా ప్రవర్తించిన శ్రీలంక క్రికెటర్, రక్షణ కూడా లేకుండా అమానుషంగా
టీ20 వరల్డ్‌కప్-2022 ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లి, అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టై బెయిల్ కూడా దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుణతిలకకు.. సిడ్నీ పోలీసులు కోర్టుకు అందించిన నివేదిక కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడే క్రమంలో గుణతిలక మృగంలా ప్రవర్తించాడని, పలు మార్లు రక్షణ కూడా లేకుండా బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. బాధితురాలు తిరగబడే సరికి సహనం కోల్పోయిన గుణతిలక.. గొంతు నులిమి, ఊపిరి ఆడనీయకుండా చేశాడని, అలాగే తలను గోడకేసి పలు మార్లు గట్టిగా బాదాడని కోర్టుకు వివరించారు. బాధితురాలు అందించిన సమాచారం మేరకే తాము నివేదికను తయారు చేసి కోర్టులో సమర్పించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో గుణతిలక దోషిగా తేలితే 14 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడే అవకాశముందని అన్నారు. ఇదిలా ఉంటే, 31 గుణతిలకపై శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఇదివరకే సస్పెన్షన్ వేటు వేసింది. ఏ రకమైన క్రికెట్ (స్థాయి, ఫార్మాట్, లీగ్) ఆడకుండా నిషేధం విధించింది. కాగా, టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంక సూపర్ 12 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. -
T20 world cup 2022: గుణతిలకకు బెయిల్ తిరస్కరణ
సిడ్నీ: ఆస్ట్రేలియాలో రేప్ కేసులో అరెస్టయిన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు స్థానిక కోర్టులో చుక్కెదురైంది. అతనికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అత్యాచారం కేసులో నిందితుడైన 31 ఏళ్ల క్రికెటర్‌పై శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) సస్పెన్షన్ వేటు వేసింది. ఏ రకమైన క్రికెట్ (స్థాయి, ఫార్మాట్, లీగ్) ఆడకుండా నిషేధం విధించింది. తీవ్రమైన క్రిమినల్ నేరానికి పాల్పడిన అతనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని శ్రీలంక క్రీడాశాఖ ఆదేశించింది. ఆస్ట్రేలియా అధికారులకు సహకరిస్తామని ఎస్ఎల్సీ వర్గాలు తెలిపాయి. డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టు మెజిస్ట్రేట్ రాబర్ట్ విలియమ్స్ ముందు వర్చువల్ (వీడియో కాల్) పద్ధతిలో గుణతిలకను ప్రవేశపెట్టారు. అతని తరఫున లాయర్ ఆనంద అమరనాథ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా మెజిస్ట్రేట్ తిరస్కరించారు. దీనిపై స్పందించిన లాయర్ ఆనంద అతిత్వరలోనే సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తామన్నారు. టి20 ప్రపంచకప్ ‘సూపర్ 12’లో నిష్క్రమించిన శ్రీలంక జట్టు స్వదేశానికి బయల్దేరే ముందు గుణతిలకను అరెస్టు చేయడంతో అతను మినహా మొత్తం జట్టు లంకకు పయనమైంది. -
ఆస్ట్రేలియాలో అరెస్టైన లంక క్రికెటర్‌కు ఎదురుదెబ్బలు! కొత్తేం కాదు
ICC Mens T20 World Cup 2022- Danushka Gunathilaka: అత్యాచార కేసులో అరెస్టైన లంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు శ్రీలంక బోర్డు షాకిచ్చిది. ఇకపై ఏ ఫార్మాట్లో కూడా క్రికెట్ ఆడే అవకాశం లేకుండా అతడిపై నిషేధం విధించింది. లంక బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆడేందుకు గుణతిలక ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవంబరు 2న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో సిడ్నీ పోలీసులు 31 ఏళ్ల గుణతిలకను ఆదివారం అరెస్టు చేశారు. లైంగిక దాడి కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. బెయిల్ నిరాకరణ ఈ ఘటన నేపథ్యంలో సోమవారం అతడిని సిడ్నీ కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం గుణతిలకకు బెయిల్ నిరాకరించింది. ఈ క్రమంలో లంక బోర్డు సైతం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అతడిపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. అత్యాచార ఆరోపణలతో అరెస్టైన అతడు దోషిగా తేలితే మరింత కఠినచర్యలు ఉంటాయని పేర్కొంది. దర్యాప్తులో భాగంగా ఆస్ట్రేలియా పోలీసులు, న్యాయ వ్యవస్థకు పూర్తిగా సహకరిస్తామని, కావాల్సిన సమాచారం అందిస్తామని వెల్లడించింది. వివాదాస్పద క్రికెటర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ గుణతిలకకు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. అనుచిత ప్రవర్తన, సమాచారం ఇవ్వకుండా ట్రెయినింగ్ సెషన్‌కు గైర్హాజరు కావడంతో 2017లో 6 వన్డేల సస్పెన్షన్ వేటు పడింది. 2018లో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆరు నెలలు నిషేధం ఎదుర్కొన్నాడు. కరోనా నేపథ్యంలో.. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్ నుంచి వచ్చి ఏడాది పాటు సస్పెండ్ అయ్యాడు. అయితే, తర్వాత నిషేధాన్ని ఆరు నెలలకు తగ్గించారు. చదవండి: ఆసీస్‌కు అవమానం! టాప్ రన్ స్కోరర్లు, అత్యధిక వికెట్ల వీరులు! కోహ్లి తర్వాత సూర్య మాత్రం కాదు! T20 WC 2022: టీమిండియాదే వరల్డ్‌కప్.. రోహిత్ సాధ్యం చేస్తాడు.. అలా జరుగుతుందంతే..! -
ఆసీస్‌లో లంక క్రికెటర్ గుణతిలక అరెస్ట్
సిడ్నీ: టి20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక కటకటాల పాలయ్యాడు. ఈ నెల 2న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో సిడ్నీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 31 ఏళ్ల గుణతిలకపై అత్యాచారం కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు సిడ్నీ పోలీసులు వెల్లడించారు. దీంతో సూపర్–12లో నిష్క్రమించిన శ్రీలంక జట్టు గుణతిలక లేకుండానే ఆదివారం స్వదేశానికి పయనమైంది. ఆన్లైన్ డేటింగ్ ద్వారా పరిచయమైన 29 ఏళ్ల మహిళను రోజ్ బేలోని ఇంట్లో కలిసిన లంక క్రికెటర్ ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్ పోటీల్లో ఒక్క నమీబియాతో ఆడిన గుణతిలక గాయం కారణంగా ఇతర మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 8 టెస్టులు, 47 వన్డేలు, 46 టి20లు ఆడిన గుణతిలక వివాదాస్పద క్రికెటర్‌గా ముద్రపడ్డాడు. 2017లో అనుచిత ప్రవర్తన, ట్రెయినింగ్ సెషన్‌కు చెప్పాపెట్టకుండా గైర్హాజరు కావడంతో 6 వన్డేల సస్పెన్షన్ వేటు వేశారు. 2018లో కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించడంతో ఆరు నెలలు నిషేధం విధించారు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్ బయటకు రావడంతో ఏడాది పాటు సస్పెండ్ చేసి చివరకు ఆరు నెలలకు తగ్గించారు. -
T20 WC 2022: అత్యాచారం కేసులో కీలక జట్టు సభ్యుడు అరెస్ట్
టీ20 వరల్డ్‌కప్-2022లో పాల్గొన్న ఓ కీలక జట్టు సభ్యుడు అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే జట్టును వీడిన శ్రీలంక ఓపెనింగ్ బ్యాటర్ ధనుష్క గుణతిలకపై సిడ్నీకు చెందిన యువతి ఆత్యాచార ఆరోపణలు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సిడ్నీ పోలీసులు స్వదేశానికి పయనమయ్యేందుకు రెడీగా ఉన్న గుణతిలను ఇవాళ ఉదయం ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. దీంతో శ్రీలంక జట్లు గుణతిలక లేకుండానే స్వదేశానికి బయల్దేరింది. Sri Lanka cricketer Danushka Gunathilaka has been arrested in Sydney yesterday for rape. Sri Lanka team left home without him this morning. Gunathilaka was injured three weeks ago and replaced by Ashen Bandara. But team management kept him with the squad without sending him home. — Rex Clementine (@RexClementine) November 6, 2022 టోర్నీ ఓపెనర్‌లో శ్రీలంక.. నమీబియా చేతిలో ఓడిన మ్యాచ్‌లో సభ్యుడిగా ఉన్న గుణతిలక, ఆ మ్యాచ్‌లో గాయం కావడంతో జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే, రీప్లేస్మెంట్ ఆటగాడు జట్టులో చేరే వరకు అతన్ని ఆస్ట్రేలియాలోనే ఉండాల్సిందిగా లంక క్రికెట్ బోర్డు అదేశించడంతో గుణతిలక అక్కడే ఉండిపోయాడు. ఈ మధ్యలోనే అతను స్థానిక యువతి ఆత్యాచారం చేసినట్లు సిడ్నీ పోలీసులు తెలిపారు. శ్రీలంక తరఫున 100కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన గుణతిలక.. గతంలో కూడా ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. స్వదేశంలో ఓ నార్వే అమ్మాయి గుణతిలకతో పాటు అతని స్నేహితుడిపై అత్యాచార ఆరోపణలు చేసింది. అయితే గుణతిలక ఆ కేసులో నుంచి బయటపడ్డాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కీలక సభ్యుడిగా ఉన్న గుణతిలక తరుచూ గాయాల బారిన పడుతూ జట్టుకు దూరమవుతున్నాడు. అతనికి పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మంచి రికార్డు ఉంది. వన్డేల్లో 2 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు, టీ20ల్లో 3 హాఫ్ సెంచరీలతో ప్రామిసింగ్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. -
T20 WC 2022: చమీరా ఔట్.. మూడేళ్ల తర్వాత శ్రీలంక పేసర్ రీఎంట్రీ
టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంకను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో శ్రీలంక ఆటగాళ్లు గుణతిలక, చమీరా, దిల్షాన్ మధుశంక దూరమయ్యారు. అదే విధంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన పేసర్ ప్రమోదు మధుషాన్ కూడా ఈ టోర్నీలో ఆడేది అనుమానంగా మారింది. ఇక ఇప్పటికే మధుశంక స్థానాన్ని పేసర్ ఫేర్నాండోతో భర్తీ చేసిన శ్రీలంక క్రికెట్.. తాజాగా గుణతిలక, చమీరా రిప్లేస్మెంట్స్ను కూడా శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. గుణతిలక స్థానంలో స్టాండ్‌బై జాబితాలో ఉన్న యువ బ్యాటర్ ఆషెన్ బండార, చమీరా స్థానంలో కసున్ రజితాను శ్రీలంక క్రికెట్ ఎంపిక చేసింది. అదే విధంగా వీరిద్దరి భర్తీని టీ20 ప్రపంచకప్-2022 టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. కాగా కసున్ రజితా చివర సారిగా 2019లో శ్రీలంక జట్టు తరపున టీ20ల్లో ఆడాడు. ఇక గురువారం(ఆక్టోబర్ 20) నెదర్లాండ్స్‌తో జరిగిన క్వాలిఫియర్ మ్యాచ్‌లో విజయం సాధించిన శ్రీలంక.. సూపర్-12 అర్హత సాధించింది. చదవండి: T20 WC 2022: నమీబియాకు షాకిచ్చిన యూఏఈ.. సూపర్-12కు నెదర్లాండ్స్ -
'ఆడింది చాలు పెవిలియన్ వెళ్లు'.. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం
ఆసియా కప్ టోర్నీ ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా సాగుతుందని మనం అనుకునేలోపే ఒక ఆసక్తికర ఘటన జరిగింది. శనివారం సూపర్-4లో భాగంగా అఫ్గానిస్తాన్, శ్రీలంక మధ్య మ్యాచ్‌లో రషీద్ ఖాన్, దనుష్క గుణతిలకల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 17 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 145 పరుగులతో ఆడుతోంది. గుణతిలక, రాజపక్సలు సమన్వయంతో ఆడుతూ లంకను విజయపథంవైపు నడిపిస్తున్నారు. అప్పటికే 3 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చిన రషీద్ ఖాన్ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఇక 17వ ఓవర్ రషీద్ ఖాన్ వేశాడు. వేసిన తొలి బంతినే దనుష్క బౌండరీగా మలిచాడు. అంతే ఆవేశంతో ఊగిపోయిన రషీద్.. దనుష్కపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు. తానేం తక్కువ తిన్నానా అన్నట్లుగా దనుష్క గుణతిలక కూడా రషీద్‌కు కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకోగా.. బానుక రాజపక్స వచ్చి వారిద్దరిని విడదీసి రషీద్‌కు సర్దిచెప్పాడు. అంతటితో వివాదం సద్దుమణిగింది. అయితే ఇదే ఓవర్ నాలుగో బంతికి గుణతిలక క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక పెవిలియన్ వెళ్లు అంటూ రషీద్ తన చేతితో గుణతిలకకు సంజ్ఞ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టులో బ్యాటర్స్ అంతా సమిష్టిగా రాణించడంతో విజయాన్ని అందుకుంది. బానుక రాజపక్స (14 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిగిలిన వారిలో నిసాంక (35; 3 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ (19 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), గుణతిలక (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు సాధించింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (45 బంతుల్లో 84; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), ఇబ్రహీమ్ జద్రాన్ (40; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. SL vs AFG - Rashid Khan pic.twitter.com/EbNMcojZo9 — MohiCric (@MohitKu38157375) September 3, 2022 చదవండి: భారత్-పాక్ మ్యాచ్; నోటి దాకా వచ్చినా.. 'బూతు పదం' కావడంతో AFG Vs SL Super-4: టి20 క్రికెట్లో అఫ్గానిస్తాన్ చెత్త రికార్డు.. ఏడేళ్లలో నాలుగోసారి -
ఆ ముగ్గురు ఆటగాళ్లపై నిషేధం ఎత్తివేత.. మళ్లీ క్రికెట్ ఆడొచ్చు
శ్రీలంక స్టార్ క్రికెటర్లు కుశాల్ మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, దనుష్క గుణతిలకలపై ఏడాదిపాటు విధించిన నిషేధాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఎత్తివేసింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డ్ మీడియా సమావేశంలో ద్రువీకరించింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు దేశీయ క్రికెట్‌తో, జాతీయ జట్టు ఎంపికకు కూడా అందుబాటులో ఉంటారని బోర్డ్ పేర్కొంది. కాగా గత ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక ఆటగాళ్లు డిక్వెల్లా, గుణతిలక, మెండిస్ బయో బబుల్‌ను ఉల్లంఘించి బయట తిరుగుతూ కనిపించారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకున్న శ్రీలంక క్రికెట్ క్రమశిక్షణా కమిటీ ఈ ముగ్గురు ఆటగాళ్లపై ఏడాది పాటు నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. "ముగ్గురు ఆటగాళ్ల వినతి మేరకు బోర్డు వాళ్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ సమయంలో ముగ్గురు ఆటగాళ్లకు కౌన్సెలింగ్ ఒక డాక్టర్‌తో కౌన్సిలింగ్ ఇప్పించాం. డాక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం అని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. చదవండి: SA vs IND: రిషభ్ పంత్కి భారీ షాక్! -
శ్రీలంక జట్టుకు మరో షాక్.. గుడ్ బై చెప్పిన క్రికెటర్
శ్రీలంక క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఆటగాడు ధనుష్క గుణతిలక టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సంప్రదాయ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్ లేఖను శ్రీలంక క్రికెట్ బోర్డుకు సమర్పించినట్లు న్యూస్‌వైర్ వెల్లడించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువగా దృష్టి సారించేందుకే తాను నిర్ణయం తీసుకున్నట్లు 30 ఏళ్ల ధనుష్క తన లేఖలో పేర్కొన్నట్లు తెలిపింది. కాగా గుణతిలక రెండేళ్ల క్రితం శ్రీలంక తరఫున చివరిసారిగా టెస్టు క్రికెట్ ఆడాడు. మొత్తంగా 8 టెస్టుల్లో భాగమయ్యాడు. ఇక గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా బయో బబుల్(కోవిడ్) నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ.. గుణతిలక నిషేధం ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉండగా శ్రీలంక బోర్డు ఇటీవల ఫిట్‌నెస్‌కు సంబంధించి నూతన మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటి ప్రకారం.. ప్రతి ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ధిష్ట సమయంలో పరుగు పూర్తి కాకపోతే వేతనాల్లో కోత పెట్టేందుకు నిర్ణయించారు. ఈ నిబంధనల నేపథ్యంలో స్టార్ ప్లేయర్ భనుక రాజపక్స అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు గుణతిలక సైతం టెస్టులకు మాత్రమే గుడ్ బై చెప్పినప్పటికీ.. నిషేధం తొలగిన తర్వాత ఫిట్నెస్ పరీక్షలో నెగ్గితేనే జట్టులో చోటు దక్కించుకోగలడు. ఏదేమైనా వారాల వ్యవధిలో లంక క్రికెట్ జట్టులో యువ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. చదవండి: Ind Vs Sa 2nd Test: నువ్వు తోపు అనుకోకు.. అలా చేశావో నిన్ను మించినోడు లేడని చెప్పాను.. అంతే.. ఇక ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలే! This never ends! No matter what. ❤️🏏 pic.twitter.com/hsHZ3btLCN — Danushka Gunathilaka (@danushka_70) September 28, 2021 -
సిగరెట్ల కోసం వెళ్లారు.. సస్పెండయ్యారు
డర్హమ్: ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటు వేసింది. బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించి, రోడ్లపై సిగరెట్లు కాలుస్తూ కెమెరా కంటికి చిక్కిన లంక స్టార్ ఆటగాళ్లు కుశాల్ మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, దనుష్క గుణతిలకలను తక్షణమే స్వదేశానికి పయనమవ్వాలని లంక బోర్డు ఆదేశించింది. లంక తుది జట్టులో రెగ్యులర్ సభ్యులైన ఈ ముగ్గురు ఆటగాళ్లు.. ఇంగ్లండ్‌తో చివరి టీ20 అనంతరం బయో బబుల్ నిబంధనల్ని అతిక్రమించి హోటల్ పరిధి దాటి వెలుపలికి వచ్చారు. అంతటితో ఆటగకుండా రోడ్లపై సిగరెట్లు కాలుస్తూ.. తమ దేశ అభిమాని కంట బడ్డారు. Familiar faces in Durham tonight, enjoying their tour! Obviously not here to play cricket, this video was taken at 23.28 Sunday. Disappointing performance by these cricket players but not forgetting to enjoy their night at Durham. RIP #SrilankaCricket #KusalMendis #ENGvSL pic.twitter.com/eR15CWHMQx — Nazeer Nisthar (@NazeerNisthar) June 28, 2021 వీరి నిర్వాకాన్ని ఆ అభిమాని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో లంక క్రికెట్ బోర్డు అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ అంశాన్ని శ్రీలంక క్రికెట్ చీఫ్ షమ్మి సిల్వా సీరియస్‌గా పరిగణించి, విచారణకు ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు అనంతరం ఈ ముగ్గరు క్రికెటర్లు బయో బబుల్ నిబంధనలను ఉల్లఘించారని రుజువు కావడంతో వారిపై తక్షణ వేటు వేశారు. ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేల కోసం లంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను ఆతిధ్య జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేయగా, జూన్ 29 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. చదవండి: కోహ్లీని తప్పిస్తే టీమిండియా ఐసీసీ టోఫ్రీ గెలుస్తుందా..? -
పాపం ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు
కార్డిఫ్: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ బౌలర్ సామ్ కరన్ అద్భుత రనౌట్‌తో మెరిశాడు. ఫుట్‌బాల్ టెక్నిక్‌ను ఉపయోగిస్తూ లంక బ్యాట్స్‌మన్ దనుష్క గుణతిలకను వెనక్కి పంపడం వైరల్‌గా మారింది. టాస్ గెలిచిన శ్రీలంక ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, దనుష్క గుణతిలకలు ఆరంభించారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సామ్ కరన్ వేసిన మూడో బంతిని ఫెర్నాండో షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు తగిలి పిచ్‌పైనే ఉండిపోయింది. సింగిల్‌కు అవకాశం ఉండడంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న గుణతిలక ఫెర్నాండోకు కాల్ ఇచ్చాడు. అయితే అప్పటికే కరన్ అక్కడే ఉండడంతో రెప్పపాటులో ఫుట్‌బాల్ టెక్నిక్‌ను ఉపయోగించి తన కాలితో బంతిని వేగంగా వికెట్ల వైపు తన్నాడు. అంతే.. గుణతిలక క్రీజులోకి చేరుకోకుముందే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో ఇది ఊహించని గుణతిలక భారంగా పెవిలియన్‌కు చేరాడు. సామ్ కరన్ రనౌట్ వీడియో ఈసీబీ తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ఇట్స్ కమింగ్ హోమ్.. సామ్ బ్యాక్ ఆన్ ది నెట్ అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (39; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ (2/18), ఆదిల్ రషీద్ (2/24) రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం రావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 18 ఓవర్లలో 103 పరుగులుగా నిర్ణయించారు. ఇంగ్లండ్ 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలి చింది. సామ్ బిల్లింగ్స్ (24; 2 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లివింగ్‌స్టోన్ (26 బంతుల్లో 29 నాటౌట్; సిక్స్), సామ్ కరన్ (8 బంతుల్లో 16 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించి ఇంగ్లండ్ విజయాన్ని ఖాయం చేశారు. చివరిదైన మూడో టి20 మ్యాచ్ నేడు జరుగుతుంది. చదవండి: ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఇంగ్లండ్‌దే టి20 సిరీస్ Great. Let's win this @englandcricket ....@daniel86cricket bro r u watching ur team s worst performance vs ENG — RahulVaidya_fanclub (@vaidyaFan_rahul) June 24, 2021 -
శ్రీలంక క్రికెటర్‌పై 6 మ్యాచ్‌ల నిషేదం!
కొలంబో : శ్రీలంక ఓపెనర్ ధనుష్క గుణతిలకపై ఆ దేశ క్రికెట్ బోర్డు 6 అంతర్జాతీయ మ్యాచ్‌ల ఆడకుండా నిషేదం విధించింది. ఇటీవల ఈ క్రికెటర్ శ్రీలంక బోర్డు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ సందర్భంగా అతని చర్యలను సీరియస్‌గా పరిగణించింది. ఆ టెస్టు సంబంధించిన ఫీజుల, బోనస్‌లను ఇవ్వలేదని ప్రకటించింది. మొత్తం ఆరు మ్యాచ్‌ల నిషేధంలో తాజా ఉల్లంఘన కారణంగా మూడు మ్యాచ్‌లు వేటు వేయగా.. అక్టోబర్ 18, 2017లో ప్లేయర్ కాంట్రాక్టును ఉల్లంఘించిన ఏడాదిలోపే మరోసారి నిబంధనలు అతిక్రమించాడని మరో మూడు మ్యాచ్‌లు సస్పెన్షన్ విధించింది. గుణతిలక బస చేసిన హోటల్ గదిలో అతడి స్నేహితుడొకరు ఓ నార్వే మహిళపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన శ్రీలంక క్రికెట్ బోర్డు గుణతిలకపై దర్యాప్తునకు ఆదేశించింది. శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రవర్తనా నియమావళిని పదేపదే ఉల్లంఘించడంతో కఠిన చర్యలు తీసుకుంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో గుణతిలక చక్కటి ప్రదర్శన చేశాడు. చదవండి: క్రికెటర్ గదిలో అత్యాచారం! -
క్రికెటర్ గదిలో అత్యాచారం!
కొలంబో: శ్రీలంక ఓపెనర్ ధనుష్క గుణతిలకాపై ఆ దేశ క్రికెట్ బోర్డు అంతర్జాతీయంగా మ్యాచ్‌లు ఆడకుండా సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్ సందర్భంగా గుణతిలక బస చేసిన హోటల్ గదిలో అతడి స్నేహితుడొకరు ఓ నార్వే మహిళపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు రావడమే ఇందుకు కారణం. ఆదివారం గుణతిలక స్నేహితుడు ఇద్దరు నార్వే మహిళల్ని గదికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అందులో ఒక మహిళ తనపై అతను అత్యాచారం జరిపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుణతిలక స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీలంక బోర్డు ప్రాథమిక విచారణ అనంతరం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాడన్న కారణంతో గుణతికలపై వేటు వేసింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో గుణతిలక చక్కటి ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. దీని ఆధారంగా గుణతిలకాను మళ్లీ జట్టులోకి తీసుకోవడంపై బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ఆ ఆరోపణలు నిజమైతే అతని భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది.