శ్రీలంక స్టార్ క్రికెట్ దనుష్క గుణతిలకపై ఆదేశ క్రికెట్ బోర్డు నిషేధాన్ని ఎత్తివేసింది. అత్యాచార వేధింపుల కేసులో గుణతిలక నిర్దోషిగా తేలడంతో శ్రీలంక క్రికెట్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన జరిగిన టీ20 వరల్డ్ కప్ ఆడిన శ్రీలంక జట్టులో గుణతిలక సభ్యునిగా ఉన్నాడు. అయితే ఈ టోర్నీలో గుణతిలక కేవలం నమీబియాతో జరిగిన మ్యాచ్ మాత్రమే ఆడాడు.
ఆ తర్వాత గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అదే సమయంలో ఆస్ట్రేలియాలో గుణతిలకపై అత్యాచార వేధింపుల కేసు నమోదు అయింది. తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని ఓ 29 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు అతడని జట్టు నుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ జిల్లా కోర్టులో కేసు నడుస్తోంది. అయితే తాజాగా అతడిపై చేసిన ఆరోపణలన్నింటినీ న్యూ సౌత్ వేల్స్ కొట్టిపారేసింది.
ఈ నేపథ్యంలోనే శ్రీలంక క్రికెట్ అతడిపై బ్యాన్‌ను ఎత్తివేసింది. ఈ మేరకు.. ఆస్ట్రేలియాలో దనుష్క గుణతిలకపై వేసిన నేరారోపణలను దర్యాప్తు చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు స్వతంత్ర విచారణ కమిటీ.. గుణతిలకపై విధించిన నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయాలని సిఫార్సు చేసింది. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ అతడిని నిర్దోషిగా తేల్చింది. దీంతో ఇప్పుడు అతడు మళ్లీ జట్టులోకి తిరిగి రావచ్చు అని శ్రీలంక క్రికెట్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
చదవండి: Ind Vs Aus T20I: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. వైజాగ్‌లో ఈసారి వేరే లెవల్!
Comments
Please login to add a commentAdd a comment