టీ20 వరల్డ్‌కప్-2022 ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లి, అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టై బెయిల్ కూడా దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుణతిలకకు.. సిడ్నీ పోలీసులు కోర్టుకు అందించిన నివేదిక కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడే క్రమంలో గుణతిలక మృగంలా ప్రవర్తించాడని, పలు మార్లు రక్షణ కూడా లేకుండా బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. బాధితురాలు తిరగబడే సరికి సహనం కోల్పోయిన గుణతిలక.. గొంతు నులిమి, ఊపిరి ఆడనీయకుండా చేశాడని, అలాగే తలను గోడకేసి పలు మార్లు గట్టిగా బాదాడని కోర్టుకు వివరించారు. బాధితురాలు అందించిన సమాచారం మేరకే తాము నివేదికను తయారు చేసి కోర్టులో సమర్పించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో గుణతిలక దోషిగా తేలితే 14 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడే అవకాశముందని అన్నారు.
ఇదిలా ఉంటే, 31 గుణతిలకపై శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) ఇదివరకే సస్పెన్షన్ వేటు వేసింది. ఏ రకమైన క్రికెట్ (స్థాయి, ఫార్మాట్, లీగ్) ఆడకుండా నిషేధం విధించింది. కాగా, టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంక సూపర్ 12 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment