గుణతిలక (PC: SLC)
ICC Mens T20 World Cup 2022- Danushka Gunathilaka: అత్యాచార కేసులో అరెస్టైన లంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు శ్రీలంక బోర్డు షాకిచ్చిది. ఇకపై ఏ ఫార్మాట్‌లో కూడా క్రికెట్ ఆడే అవకాశం లేకుండా అతడిపై నిషేధం విధించింది. లంక బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కాగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆడేందుకు గుణతిలక ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవంబరు 2న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో సిడ్నీ పోలీసులు 31 ఏళ్ల గుణతిలకను ఆదివారం అరెస్టు చేశారు. లైంగిక దాడి కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.
బెయిల్ నిరాకరణ
ఈ ఘటన నేపథ్యంలో సోమవారం అతడిని సిడ్నీ కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం గుణతిలకకు బెయిల్ నిరాకరించింది. ఈ క్రమంలో లంక బోర్డు సైతం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అతడిపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. అత్యాచార ఆరోపణలతో అరెస్టైన అతడు దోషిగా తేలితే మరింత కఠినచర్యలు ఉంటాయని పేర్కొంది. దర్యాప్తులో భాగంగా ఆస్ట్రేలియా పోలీసులు, న్యాయ వ్యవస్థకు పూర్తిగా సహకరిస్తామని, కావాల్సిన సమాచారం అందిస్తామని వెల్లడించింది.
వివాదాస్పద క్రికెటర్
బ్యాటింగ్ ఆల్‌రౌండర్ గుణతిలకకు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. అనుచిత ప్రవర్తన, సమాచారం ఇవ్వకుండా ట్రెయినింగ్ సెషన్‌కు గైర్హాజరు కావడంతో 2017లో 6 వన్డేల సస్పెన్షన్ వేటు పడింది. 2018లో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆరు నెలలు నిషేధం ఎదుర్కొన్నాడు. కరోనా నేపథ్యంలో.. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్ నుంచి వచ్చి ఏడాది పాటు సస్పెండ్ అయ్యాడు. అయితే, తర్వాత నిషేధాన్ని ఆరు నెలలకు తగ్గించారు.
చదవండి: ఆసీస్‌కు అవమానం! టాప్ రన్ స్కోరర్లు, అత్యధిక వికెట్ల వీరులు! కోహ్లి తర్వాత సూర్య మాత్రం కాదు!
T20 WC 2022: టీమిండియాదే వరల్డ్‌కప్.. రోహిత్ సాధ్యం చేస్తాడు.. అలా జరుగుతుందంతే..!
Comments
Please login to add a commentAdd a comment