లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకకు ఊరట లభించింది. గుణతిలకపై నమోదైన నాలుగు కేసుల్లో మూడింటిని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్ట్ (సిడ్నీ) కొట్టివేసింది. గుణతిలకపై మరో కేసు విచారణలో ఉన్నట్లు కోర్టు పేర్కొంది.
విచారణలో ఉన్న కేసు ఏంటంటే..
బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడే క్రమంలో మృగంలా ప్రవర్తించాడని, పలు మార్లు రక్షణ కూడా లేకుండా బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడన్న కేసులో గుణతిలక ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నాడు. పోలీసుల ఫ్యాక్ట్స్ షీట్ ప్రకారం.. లైంగిక దాడికి పాల్పడే క్రమంలో గుణతిలక బాధితురాలి పట్ల పైశాచికంగా వ్యవహరించాడని, ఆమె తిరగబడే సరికి సహనం కోల్పోయిన అతను.. గొంతు నులిమి, ఊపిరి ఆడనీయకుండా చేశాడని, అలాగే తలను గోడకేసి పలు మార్లు గట్టిగా బాదాడని తెలుస్తోంది.
దోషిగా తేలితే 14 ఏళ్ల జైలు శిక్ష..
ఈ కేసులో దోషిగా తేలితే గుణతిలకకు 14 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడే అవకాశముంది. మరోవైపు గుణతిలకపై ఇదివరకే శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) సస్పెన్షన్ వేటు వేసింది. ఏ రకమైన క్రికెట్ (స్థాయి, ఫార్మాట్, లీగ్) ఆడకుండా ఎస్‌ఎల్‌సీ నిషేధం విధించింది.
కాగా, గతేడాది టీ20 వరల్డ్‌కప్-2022 ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన గుణతిలక.. సిడ్నీలో ఓ యువతిపై బలవతంగా అత్యాచారిని పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన గుణతిలక బెయిల్ కూడా దొరక్క నానా ఇబ్బందుల పడ్డాడు.
చదవండి: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే?
Comments
Please login to add a commentAdd a comment