rape attempted
-
ఉజ్జయిని కేసు: నిందితుడు తప్పించుకునే ప్రయత్నం
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని బాలిక రేప్ కేసులో నిందితుడు భరత్ సోనిని ఇదివరకే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆధారాలు సేకరించేందుకు సంఘటన స్థలానికి నిందితుడిని తీసుకుని వెళ్లగా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడని అప్రమత్తమై పోలీసులు అతడిని పట్టుకున్నట్లు ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు. సచిన్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో బాలిక దుస్తులతోపాటు ఇతర ఆధారాలను సేకరించే క్రమంలో నిందితుడిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లగా అదే అదనుగా భావించి నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడని ఈ ప్రయత్నంలో అతడి సిమెంట్ రోడ్డుపై పడిపోవాడంతో మోకాళ్ళకు, కాళ్లకు గాయాలు కూడా అయ్యాయన్నారు. సర్జరీ తర్వాత ప్రస్తుతం బాలిక ఆరోగ్యం కుదుటపడినా కూడా ఆమె ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉందని తెలిపారు. ఉజ్జయిని ఘోరానికి సంబంధించిన దృశ్యాలు బయటకు రాగానే అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అక్కడి ఆటో డ్రైవర్లను విచారించి భరత్ సోనీని నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన పదిహేనేళ్ల బాలిక దుస్తులు లేకుండా రక్తం కార్చుకుంటూ దయనీయ స్థితిలో ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరిగిన వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. కనిపించిన వారందరినీ సాయమడుగుతూ చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుట స్పృహ తప్పి పడిపోగా ఆశ్రమవాసులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. #WATCH | Ujjain minor rape case: Ujjain SP Sachin Sharma says, "There is an accused in the rape case. There is another auto driver against whom a case will be registered for not informing the police about the incident. When we were taking (the accused) for recreation of the crime… pic.twitter.com/6x3AggXxqq — ANI (@ANI) September 28, 2023 ఇది కూడా చదవండి: బస్సులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి -
సినీ నటిపై రేప్.. ఇంటర్వ్యూ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లి ఆపై..
ఇంటర్వ్యూ పేరుతో 24 ఏళ్ల భోజ్‌పురి సినీ నటిపై ఆమె స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను ఆమెకు ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా స్నేహితుడు అయ్యాడని తెలుస్తోంది. ఈ ఘటన గురుగ్రామ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలికి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉందని పోలీసులు తెలుపుతున్నారు. అక్కడ ఆమె తన వీడియోలను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుందని కూడా చెప్పారు. పోలీసులతో ఆమె ఇలా చెప్పింది. (ఇదీ చదవండి: విజయ్‌సేతుపతితో మోస్ట్ కాంట్రవర్సీ హీరోయిన్ రోమాన్స్) 'కొన్ని రోజుల క్రితం నాకు భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తానని ఇన్స్టాగ్రామ్ ద్వారా మహేష్ పాండే అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. జూన్ 29న, అతను ఇంటర్వ్యూ పేరుతో గురుగ్రామ్‌లోని ఉద్యోగ్ విహార్ ప్రాంతంలోని హోటల్‌కి నన్ను పిలిచాడు. నేను హోటల్‌కు చేరుకున్నప్పుడు, మహేష్ నన్ను తీసుకెళ్లిన గదిని ఇప్పటికే బుక్ చేశాడు. ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత అతను మద్యం తాగడం ప్రారంభించాడు. దీంతో నేను నేను బయల్దేరుతానని వెళ్లిపోతుండగా.. అతను నాపై బలవంతంగా అత్యాచారం చేశాడు.' అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ అత్యాచార విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని ఆ నటి తెలిపింది. ఆ ఘటన తర్వాత అతని స్నేహితులు కొందరు తనకు ఫోన్ చేసి, తన ప్రైవేట్ వీడియోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తానని బెదిరించారని ఆమె చెప్పింది. దీంతో గురుగ్రామ్‌లోని చకర్పూర్ ప్రాంతంలో నివసించే మహేష్ పాండేపై పోలీసులు కేస్ నమోదు చేశారు. (ఇదీ చదవండి: చిరంజీవి, విజయ్ విషయంలో చాలా బాధపడ్డాను: రష్మిక మందన్న) -
మహిళపై అత్యాచారం.. భారతీయ విద్యార్థికి యూకేలో ఆరేళ్ల జైలు శిక్ష
మద్యం మత్తులో ఉన్న ఓ మహిళను అత్యాచారం చేసిన కేసులో భారతీయ మూలాలున్న యువకునికి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది యూకే కోర్టు. గత ఏడాది నైట్ క్లబ్లో పరిచయమైన ఓ మహిళపై ఈ దారుణానికి పాల్పడ్డాడని కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. #INCOURT l A man has been jailed for raping at a woman at a halls of residence in #Cardiff. CCTV showed Preet Vikal carrying the victim in his arms and later across his shoulders out of the city centre. 1/2 pic.twitter.com/wfYrIggd7o — South Wales Police Cardiff (@SWPCardiff) June 16, 2023 ప్రీత్ వికాల్(20) యూకేలో ఇంజినీరింగ్ చదవడానికి వెళ్లిన భారతీయ యువకుడు. గత ఏడాది నైట్‌క్లబ్‌లో తప్పతాగి సృహలో లేని మహిళను ప్రీత్ చేతులపై ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మహిళను తన నివాసానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె ఫొటోలను తన స్నేహితులకు షేర్ చేశాడు. ఇవే ఈ కేసులో పోలీసులకు కీలకంగా మారాయి. ఈ ఆధారాలతో ప్రీత్ వికాల్ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఆధారాలను గమనించిన న్యాయస్థానం ప్రీత్‌ను దోషిగా గుర్తించి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదీ చదవండి:చైనా కంపెనీ వింత నిబంధన: అఫైర్లు వద్దు.. విడాకుల మాటే ఎత్తొద్దు...! -
యువతి పట్ల మృగంలా వ్యవహరించిన కేసు.. క్రికెటర్‌కు ఊరట
లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకకు ఊరట లభించింది. గుణతిలకపై నమోదైన నాలుగు కేసుల్లో మూడింటిని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్ట్ (సిడ్నీ) కొట్టివేసింది. గుణతిలకపై మరో కేసు విచారణలో ఉన్నట్లు కోర్టు పేర్కొంది. విచారణలో ఉన్న కేసు ఏంటంటే.. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడే క్రమంలో మృగంలా ప్రవర్తించాడని, పలు మార్లు రక్షణ కూడా లేకుండా బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడన్న కేసులో గుణతిలక ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నాడు. పోలీసుల ఫ్యాక్ట్స్ షీట్ ప్రకారం.. లైంగిక దాడికి పాల్పడే క్రమంలో గుణతిలక బాధితురాలి పట్ల పైశాచికంగా వ్యవహరించాడని, ఆమె తిరగబడే సరికి సహనం కోల్పోయిన అతను.. గొంతు నులిమి, ఊపిరి ఆడనీయకుండా చేశాడని, అలాగే తలను గోడకేసి పలు మార్లు గట్టిగా బాదాడని తెలుస్తోంది. దోషిగా తేలితే 14 ఏళ్ల జైలు శిక్ష.. ఈ కేసులో దోషిగా తేలితే గుణతిలకకు 14 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడే అవకాశముంది. మరోవైపు గుణతిలకపై ఇదివరకే శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) సస్పెన్షన్ వేటు వేసింది. ఏ రకమైన క్రికెట్ (స్థాయి, ఫార్మాట్, లీగ్) ఆడకుండా ఎస్ఎల్సీ నిషేధం విధించింది. కాగా, గతేడాది టీ20 వరల్డ్‌కప్-2022 ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన గుణతిలక.. సిడ్నీలో ఓ యువతిపై బలవతంగా అత్యాచారిని పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన గుణతిలక బెయిల్ కూడా దొరక్క నానా ఇబ్బందుల పడ్డాడు. చదవండి: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే? -
ఘోర కలి: కాలేజ్ స్టూడెంట్‌పై దారుణ హత్యాచారం
క్రైమ్: ఒంటరిగా ఇంట్లో ఉన్న ఓ కాలేజ్ స్టూడెంట్‌పై ఓ మానవమృగం దారుణానికి తెగపడింది. ఆ దారుణంతో ఘోరం జరిగిపోయింది. యువతి అక్కడికక్కడే కన్నుమూసింది. ఈ కేసులో తొలుత పక్కింట్లో ఉండే ఓ వృద్ధుడిపై అంతా అనుమానం వ్యక్తం చేశారు. అయితే.. ఆ ఘోరానికి పాల్పడింది వృద్ధుడు కాదని.. స్థానికంగా ఉండే మరో యువకుడని పోలీసులు నిర్ధారించారు. ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్‌లో జరిగిన ఘోర హత్యాచార ఘటన.. స్థానికంగా అలజడి సృష్టించింది. ఇంట్లో వాళ్లంతా బయటకు వెళ్లిన సమయంలో ఆమెపై దారుణం జరిగింది. తిరిగొచ్చి చూసేసరికి యువతి రక్తపుస్రావంతో నగ్నంగా బెడ్‌పై స్పృహ లేకుండా పడి ఉంది. అది గమనించిన ఆమె సోదరి స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. యువతిపై అత్యాచారం జరిగిందని, ఆ ప్రయత్నంలోనే రక్తస్రావంతో ఆమె కన్నుమూసిందని వైద్యుల నివేదికలో తేలింది. ఈ క్రమంలో.. పొరుగింట్లో ఉండే ఓ వృద్ధుడిపై అంతా అనుమానం వ్యక్తం చేశారు. తరచూ యువతులను ఏడిపించి.. అసభ్యంగా కామెంట్లు చేసే ఆ పెద్దాయనే ఆ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావించారంతా. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు కూడా. అయితే.. యువతి ఫోన్ డేటా ఆధారంగా రాజ్ గౌతమ్ అనే యువకుడిని సైతం పోలీసులు ప్రశ్నించగా.. నేరం ఒప్పుకున్నాడు. ఈ కేసులో ప్రేమ కోణం వెలుగు చూసింది. రాజ్ గౌతమ్ స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు కూడా. బాధితురాలితో రెండేళ్లుగా అతనికి పరిచయం ఉంది. ఆమె తన ఛాతీపై అతని పేరు పచ్చబొట్టు వేయించుకుంది. వీళ్ల ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియదు. అయితే.. గురువారం ఇంట్లో ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకుని వెళ్లాడు. ఆపై ఆమెను శారీరకంగా కలిసేందుకు యత్నించాడు. కానీ, ఆమె ప్రతిఘటించింది. దీంతో బలవంతం చేశాడు. అయితే.. నేరానికి ముందు నిందితుడు గౌతమ్ ఎనర్జీ పిల్స్(అఫ్రొడిసియాక్ మాత్రలు) తీసుకోవడం.. దారుణానికి కారణమైంది. గింజుకున్న యువతి స్పృహ కోల్పోయినా.. వదలకుండా ఘాతుకానికి పాల్పడడంతో ఆమె అధిక రక్తస్రావం అయ్యి మరణించింది. ఘటన తర్వాత భయంతో అక్కడి నుంచి నిందితుడు పారిపోయినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో ప్రవేశపెట్టి, రిమాండ్‌కు తరలించారు. బాధిత కుటుంబం నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. -
ఆరేళ్ళ బాలికపై లైంగిక దాడి కేసులో ఆదిలాబాద్ కోర్టు సంచలన తీర్పు
-
విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి
-
కీచక టీచర్ వికృతక్రీడ.. పదో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని పెదగొల్లగూడెం ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఆమె పాలిట కీచకుడయ్యాడు. ఓ టీచర్.. విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, ఆందోళన చెందిన బాధితురాలు జరిగిన విషయాన్ని తన పేరెంట్స్‌కు చెప్పింది. వివరాల ప్రకారం.. పెదగొల్లగూడెంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో పిచ్చయ్యా అనే గణితం టీచర్.. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా, చాలా రోజులుగా పిచ్చయ్య.. విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థిని పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు.. సదరు కీచక టీచర్‌పై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనపై స్థానికులు స్పందించి.. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
11 మంది జీవిత ఖైదీలు విడుదల... షాక్‌లో బాధితులు
సాక్షి అహ్మదాబాద్: గుజరాత్ అల్లర్ల సమయంలో ఒక కుటుంబంపై దాడి చేసి ఏడుగురుని హతమార్చి, ఒక మహిళపై సాముహిక అత్యాచారం చేసిన 11 మంది జీవిత ఖైదీలను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయం తెలిసిన బాధిత కుటుంబం ఆశ్చర్యపోయింది. ఈ మేరకు బాధిత కుటుంబం బిల్కిస్ బానో, ఆమె భర్త రసూల్ ఈ విషయమై మాట్లాడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. ఈ ఘోర సంఘటన జరిగి దాదాపు 20 ఏళ్లు అయ్యిందని తాను తన భార్య, ఐదుగురు కుమారులకు ఇప్పటి వరకు ఉండేందుకు ఇల్లు కూడా లేదని చెప్పాడు. గుజరాత్ ప్రభుత్వం తన రిమిషన్ పాలసీ ప్రకారం 11 మంది జీవిత ఖైదీలు విడుదల చేసేందుకు అనుమతివ్వడంతో వారు గోద్రా సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం దేన్ని పరిగణలోని తీసుకుని వారిని విడుదల చేసిందనేది తమకు తెలియదని రసూల్ చెబుతున్నాడు. ఆ ఘటనలో తన కుమార్తెతో సహా చనిపోయిన వారి కోసం ప్రార్థనలు చేయడం తప్ప తాను ఇంకేమీ చేయలేనని ఆవేదనగా చెప్పాడు రసూల్. అసలేం జరిగిందంటే మార్చి 3, 2002న గోద్రా అనంతరం అల్లర్ల సమయంలో దాహుద్ జిల్లాలోని లిమ్ఖేడా తాలూకాలోని రంధిక్పూర్ గ్రామంలో బిల్కిస్ బానో కుంటుంబంపై ఒక గుంపు దాడి చేసింది. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్ పై సాముహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆ కుటుంబంలోని ఏడుగురిని పొట్టనబెట్టుకుంది ఆ దుండగుల గుంపు. దీంతో ముంబైలోని ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోర్టు జనవరి 21, 2008న ఆ నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఐతే నిందితుల్లో ఒకరు విచారణ సమయంలో మరణించారు. ఆ తర్వాత బాంబే హైకోర్టు మే 3, 2017న సీబీఐ కోర్టు శిక్షను సమర్థించింది. అలాగే ఇదే కేసుకి సంబంధించి ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేసిన ఐదుగురు పోలీసులు, ఇద్దరు డాక్టర్లకు కూడా బాంబే హైకోర్టు శిక్ష విధించింది. అంతేకాదు 2019 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు బిల్కిస్ కుటుంబానికి దాదాపు రూ. 50 లక్షల పరిహారం, ఉద్యోగం, వసతి కల్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బిల్కిస్ భర్త రసూల్ సుప్రీం కోర్టు రూ. 50 లక్షలు పరిహారం ఇచ్చిందని వాటితోనే కొడుకుని చదివించుకుంటున్నట్లు తెలిపాడు. కానీ ఉద్యోగం ఇల్లు ఇప్పించలేదని రసూల్ చెబుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి నిందితులు... జస్వంత్‌భాయ్ నాయ్, గోవింద్‌భాయ్ నాయ్, శైలేష్ భట్, రాధేశ్యామ్ షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్‌భాయ్ వోహానియా, ప్రదీప్ మోర్ధియా, బకాభాయ్ వోహానియా, రాజుభాయ్ సోనీ, మితేష్ భట్, రమేశ్ చందనా అనే 11 మంది ఖైదీలను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆ నిందితులు మాట్లాడుతూ...తాము దోషులుగా నిర్థారింపబడి సుమారు 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాము. విడుదల చేయమని సుప్రీం కోర్టుని ఆశ్రయించాం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ ప్రభుత్వ మమ్మలని విడుదల చేసింది. ప్రస్తుతం మేము మా కుటుంబాలను కలుసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని ఆనందంగా చెబుతున్నారు. (చదవండి: బస్సుని ఢీ కొట్టిన ఆయిల్ ట్యాంకర్... 20 మంది సజీవ దహనం) -
దారుణం.. చిన్నారిపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని కుప్పంలో దారుణం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై టీడీపీ కార్యకర్త శ్రీధర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, టీడీపీ కార్యకర్త శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు ర్యాలీ తలపెట్టాయి. సూపర్ మార్కెట్ వీధి నుంచి ర్యాలీ కొనసాగుతుండగా.. ఈ ర్యాలీలో మహిళలు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: విశాఖలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి -
లిఫ్ట్ పేరుతో టీచర్‌పై లైంగిక దాడి.. వీడియోలు తీసి ఆ తర్వాత..
దేశంలో ప్రతీరోజు ఎక్కడో ఒక చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ముస్లిం వ్యక్తి.. టీచర్‌పై లైంగిక దాడి చేసి వీడియోలు తీసి అనంతరం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. షహజాన్‌పూర్‌లో లిఫ్ట్ పేరుతో అమీర్ అనే వ్యక్తి గవర్నమెంట్ టీచర్(28) బైకుపై ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమెకు మత్తుమందు వాసన చూపించి స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత అమీర్.. టీచర్‌పై అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. ఇదిలా ఉండగా.. తమ కుమారుడిని కాపాడుకునేందు టీచర్‌ను మతం మారాలని, తనను పెళ్లి చేసుకోవాలని అమీర్ కుటుంబ సభ్యులు టీచర్‌ను బెదిరింపులకు గురిచేశారు. దీంతో.. సదరు మహిళ జరిగిన విషయాన్ని పోలీసులు తెలిపి అమీర్‌పై ఫిర్యాదు చేసింది. నిందితుడు అమీర్‌తో సహా ఐదుగురిపై ఉత్తరప్రదేశ్‌లో తీసుకువచ్చిన మత మార్పిడి నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. కాగా, ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఇది కూడా చదవండి: నరకం చూపించారు, బర్త్‌డే రోజే చంపేశారు: మోడల్ తల్లి -
భర్తను చంపి పిల్లల ఎదుటే మహిళపై లైంగిక దాడి.. ఆ తర్వాత..
జైపూర్: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిని శిక్షించినప్పటికీ కొందరు మృగాల్లో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా సభ్య సమాజం తలదించుకునే ఓ అమానవీయ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాజస్థాన్లోనిధోల్పుర్లో ఓ దళిత మహిళ.. తన భర్త, పిల్లలతో కలిసి పొలం నుండి ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో కొందరు దుండగులు వారిని అడ్డగించి.. సదరు మహిళ భర్తను తుపాకీతో కాల్చి చంపారు. ఆ తర్వాత బాధితురాలిని, ఆమె పిల్లలను తుపాకీతో బెదిరించి.. ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారీ అయ్యారు. దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలు.. చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు. వారంతో బాధిత మహిళ గ్రామానికే చెందిన వారని వెల్లడించారు. నిందితులను లాలూ ఠాకూర్, ధన్ సింగ్ ఠాకూర్, విపిన్ ఠాకూర్, లోకేంద్ర సింగ్ ఠాకూర్, మోహిత్ ఠాకూర్, సచిన్ ఠాకూర్‌లుగా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్పడం గమనార్హం. -
ఇంట్లో చొరబడి యువతులపై లైంగిక దాడికి యత్నం
దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం పరిధిలోని రాజానుకుంట వద్ద అద్దిగానహళ్లి గ్రామంలో జూన్ 8వ తేదీ తెల్లవారుజామున ఒక కార్పెంటర్ ఇంట్లోకి నలుగురు దొంగలు చొరబడ్డారు. ఇంట్లో వారిని బెదిరించి రూ.10వేల నగదు, కొంత బంగారం దోచుకున్నారు. (చదవండి: విమానాలకు రన్‌వేగా..) కామంతో కళ్లుమూసుకుపోయిన చోరులు ఇంట్లో ఉన్న యువతులపై లైంగిక దాడికి ప్రయత్నించారు. అయితే వారు గట్టిగా కేకలు వేయడడంతో పరారయ్యారు. విచారణ జరిపిన పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7 లక్షల విలువైన 151 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. (చదవండి: ఫల్గుణి నాయర్: స్వీయ నిర్మిత మహిళా బిలినీయర్) -
బంగ్లాదేశ్‌లో నిర్భయ తరహా ఘటన
ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఓ 22 ఏళ్ల మహిళపై కదిలే బస్సులో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సావర్ ప్రాంతంలో అశులియా పశువుల మార్కెట్ దగ్గరలో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అశులియా పోలీస్ ఇన్స్పెక్టర్ జియాల్ ఇస్లాం వివరాల ప్రకారం..బాధితురాలు మణిక్‌గంజ్‌లోని తన సోదరి ఇంటి నుంచి నారాయణగంజ్‌లో ఉన్న ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో ఆమె శుక్రవారం రాత్రి 8 గంటలకు మరో బస్సు కోసం నబినగర్ బస్ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ ఆ మహిళకు ఇంతకుముందు పరిచయం ఉన్న నజ్ముల్ అనే వ్యక్తి కలిసాడు. ఇద్దరు కలిసి బస్సు కోసం ఎదురు చూస్తుండగా..అక్కడకి వచ్చిన బస్సులో ఎక్కారు. అయితే నిందితులు బస్సులో ఉన్న ప్రయాణికులను వారి గమ్యస్థానాలు రాకముందే దించేశారు. అదే సమయంలో నజ్ముల్, బాధితురాలని అడ్డుకుని తిరిగి నబినగర్ తీసుకెళ్లారు. అక్కడ ఆరుగురు దుండగులు బస్సులో ఆమెపై అత్యాచారం చేశారు. ఆ సమయంలో నజ్ముల్ అరుపులు విని పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వచ్చి వాహనాన్ని ఆపి వారిని రక్షించారు. బస్సును అదుపులోకి తీసుకుని నిందుతులను అరెస్ట్ చేశారు. కోర్టు వారిని ప్రశ్నించడానికి నాలుగు రోజుల రిమాండ్ విధించింది. కాగా ఆరుగురు నిందితులను ఆర్యన్(18), షాజు(20), సుమోన్ మియా(24), మోనోవర్(24), షోహాగ్(25), సైఫుల్ ఇస్లాం(40) గా గుర్తించినట్లు పోలీసుల తెలిపారు. వీరంతా తురాగ్ ప్రాంతంలోని కమర్‌పారా నివాసితులుగా పేర్కొన్నారు. (చదవండి: పార్టీ పేరుతో రచ్చ..150 మంది అరెస్ట్) -
మహిళపై 12మంది గ్యాంగ్ రేప్
సాక్షి, నిజామాబాద్ : ఓ మహిళపై 12 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో సోమవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. క్షతగాత్రురాలిని ఆమె సోదరి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించింది. పని నిమిత్తం సోమవారం రాత్రి ఆమె రైల్వే స్టేషన్ సమీపంలోకి వెళ్లింది. ఒంటరిగా ఉన్న సదరు మహిళను చూసిన విక్కీ అనే యువకుడు మాట కలిపాడు. డబ్బులు అవసరం ఉందని చెప్పడంతో తాను ఇస్తానని నమ్మబలికి.. కలెక్టరేట్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. రెవెన్యూ భవన్‌కు సంబంధించిన ఖాళీ గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ లోపు విక్కీ స్నేహితులు 11 మంది అక్కడకు చేరుకుని ఒకరి తర్వాత మరొకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడాన్ని గమనించిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. అర్ధరాత్రి వేళ అచేతనంగా కనిపించిన బాధితురాలిని పెట్రోలింగ్ సిబ్బంది ప్రశ్నించగా.. జరిగిన దారుణం గురించి తెలిపింది. బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ çఘాతుకానికి పాల్పడింది నగరంలోని హమాల్వాడీకి చెందిన యువకులని.. విక్కీ పెయింటర్‌గా పని చేస్తాడని వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపారు. అయితే, పెట్రోలింగ్ సిబ్బంది సమాచారం మేరకు 8 మంది అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని చెప్పారు. -
ఐఏఎస్ అధికారిపై అత్యాచార ఆరోపణలు
రాయ్‌పూర్ : ఉన్నతమైన పదవిలో ఉండి పలువురికి ఆదర్శంగా మెలగాల్సిన జిల్లా కలెక్టరే వక్రబుద్ది చూపించాడని ఓ మహిళ ఆరోపించడం ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపింది. సాక్షాత్తూ కలెక్టరేట్లోనే ఐఏఎస్ అధికారి తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపించడం పెను దుమారం రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్తను డిస్మిస్ చేస్తానని బెదిరించి తనపై జంజ్‌గిర్-చంపా జిల్లా మాజీ కలెక్టర్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ జనక్ ప్రసాద్ పాథక్ అత్యాచారానికి పాల్పడ్డాడని 33 ఏళ్ల మహిళ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నాళ్లుగా తనకు అశ్లీల సందేశాలు పంపిస్తూ లైంగింగా వేధిస్తున్నాడని, మే 15న తనపై కలెక్టరేట్లోనే అత్యాచారం చేశాడని జిల్లా ఎస్పీ పారుల్ మాధూర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. పాథక్ తనకు పంపిన ఫోన్ సందేశాలు, ఫొటోలకు పోలీసులకు ఆమె అందజేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ పారుల్ తెలిపారు. నిందితుడిపై ఐపీసీ 376, 506, 509 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అత్యాచార ఆరోపణలు రావడంతో సదరు కలెక్టర్ జనక్ ప్రసాద్‌ను ఛత్తీస్గడ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టరుగా మే 26న ప్రభుత్వం బదిలీ చేసింది. తనపై వచ్చిన అత్యాచార ఆరోపణలపై స్పందించేందుకు కలెక్టర్ అందుబాటులోకి రాలేదు. అయితే ఇప్పటివరకు కలెక్టర్‌ని అరెస్ట్ చేయకపోవడంతో పెద్ద ఎత్తున మహిళా సంఘాలు నిరసనలు చేపట్టాయి. -
ఆరేళ్ల చిన్నారిపై బాలుడి లైంగికదాడి
రెంజల్ (బోధన్): ఆరేళ్ల చిన్నారిపై పదిహేనేళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన బాలుడు ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి జరిపాడు. సాయంత్రం కూలి పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లి బాలిక స్పృహలో లేకపోవడంతో ఆందోళనకు గురైంది. కొద్దిసేపటికి స్పృహలోకొచ్చిన బాలిక జరిగిన విషయం తల్లికి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
సహాయం కోసం పోలీస్ స్టేషన్‌కెళ్తే.. కాటేశాడు
గుర్గావ్: సహాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళను లైంగికంగా వేధించడమే కాకుండా, వీడియో తీసి బెదిరిస్తున్న పోలీస్ అధికారిని శనివారం గురుగావ్‌లో అరెస్ట్ చేశారు. ఈ సంఘటన చూస్తే కంచే చేను మేసిందన్న సామెత గుర్తుకు వస్తుంది. వివరాలు.. జింద్ జిల్లాలోని ఉద్దానాలో నివసించే మహిళకు 2017లో వివాహమైంది. అనంతరం కొన్ని నెలలకు వైవాహిక బంధంలో విభేదాలు రావడంతో భర్తపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేసన్‌కు వచ్చింది. అదే స్టేషనలో స్టేషన్ హౌన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న దల్బీర్ సింగ్‌తో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో ఇద్దరిది ఒకే జిల్లా కావడంతో కేసు విషయంలో దల్బీర్ సింగ్ బాధితురాలితో తరుచూ మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు గుర్గావ్కి వెళ్లడం కోసం బస్టాండ్‌లో ఎదురు చూస్తున్న బాధితురాలిని తాను డ్రాప్ చేస్తానని నమ్మబలికి కారులో ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారం చేశాడు. మరుసటి రోజుకి తేరుకున్న బాధితురాలు దల్బీర్‌ను నిలదీయడంతో ఆమెను తన క్వార్టర్స్‌కి పిలిపించుకొని సముదాయిస్తూ, మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చాడు. దీంతో అపస్మారక స్థితికి వెళ్లిన ఆమెపై మరోమారు అత్యాచారం చేసి వీడియో తీసాడు. ఆ తర్వాత వీడియో బహిర్గతం చేస్తానని బ్లాక్ మెయిల్‌కి దిగి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో కుమిలి పోయిన బాధితురాలు జరిగిన దారుణాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిస్సహాయురాలై చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన ఒక పోలీసు ఆమెను కాపాడి జరిగిందంతా తెలుసుకుని దల్బీర్‌కు వ్యతిరేకంగా శుక్రవారం ఫిర్యాదు చేయించాడు. దీంతో అంతర్గత విచారణకు ఆదేశించిన పోలీసు ఉన్నతాధికారులు నేరం రుజువవడంతో దల్బీర్‌ను అరెస్ట్ చేశారు. కాగా దల్బీర్ సింగ్ వచ్చే ఏడాది రిటైర్ కానుండడం గమనార్హం. -
ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన యువకుడు
-
పాతబస్తీలో దారుణం.. ఏడేళ్ల బాలికపై అత్యచారం
-
విద్యార్థినిపై ఏడాదికాలంగా అత్యాచారం
సాక్షి, ప్రకాశం: మహిళలపై లైంగిక అకృత్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై తొమ్మిది మంది యువకులు ఏడాది కాలంగా లైగికంగా హింసిస్తూ, పలుమార్లు అత్యాచారం జరిపారు. ఈ దుర్మార్గంపై బాధితురాలు ఆదివారం గిద్దలూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, పరారీలో ఉన్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని మార్కాపురం డీఎస్పీ ఎన్వీ రామాంజనేయులు విలేకరులకు తెలిపారు. -
షాకింగ్ : మహిళా పోలీసుపై నాలుగేళ్లుగా..
చండీగఢ్ : హరియాణకు చెందిన మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై స్వయంగా ఓ హెడ్ కానిస్టేబుల్, ఆయన సోదరుడు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారని పోలీసులు తెలిపారు. తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు నిందితులు బ్లాక్‌మెయిల్‌కు గురిచేస్తున్నారని బాధితురాలు పేర్కొన్నారు. పల్వాల్ మహిళా పోలీస స్టేషన్లో లైంగిక దాడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పల్వాల్ ఎస్పీ వసీం అక్రం తెలిపారు. కాగా పోలీస్ స్టేషన్లోనే మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై లైంగిక దాడి జరిగిందన్న మీడియా కథనాలను ఆయన తోసిపుచ్చారు. ప్రధాన నిందితుడు జోగీందర్ అలియాస్ మింటూతో పల్వాల్ జిల్లా అల్వార్‌పూర్‌లో 2014లో తనకు తొలిసారి పరిచయమయ్యారని బాధితురాలు వెల్లడించారు.ఫరీదాబాద్, జింద్, పల్వాల్లో పనిచేస్తుండగా జోగీందర్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చారు. జూన్ 2017లో నిందితుడు తన సోదరుడు ఫరీదాబాద్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన సోదరుడిని పరిచయం చేయగా అతడు కూడా తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ జోగీందర్ తనపై లైంగిక దాడి చేయడంతో పాటు డబ్బు కోసం వేధించాడని ఆరోపించారు. కాగా విచారణలో నిందితుడు జోగీందర్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారని తేలింది. మరోవైపు బాధితురాలు కూడా వివాహితని పోలీసులు చెప్పారు. -
పూజల నెపంతో బాలికపై అత్యాచారయత్నం
బెంగళూరు: పూజల పేరుతో ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఓ దొంగ స్వామికి స్థానికులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. కుమారస్వామి లేఔట్ పోలీసుల కథనం ప్రకారం... స్థానికంగా నివాసముంటున్న ఓ బాలిక (11) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆ బాలిక తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో చూపించినా ఫలితం లేకుండా పోయింది. కాశీ నగర్లో నివాస ముంటున్న ధనుష్ కోటి అనే వ్యక్తి నాటు వైద్యం, ప్రత్యేక పూజల ద్వారా పలు వ్యాధులు నయం చేస్తాడని తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు బుధవారం అక్కడికి వెళ్లారు. ఓం శక్తి పూజలు చేస్తే వ్యాధి నయం అవుతుందని ధనుష్ కోటి వారిని నమ్మించాడు. పూజ చేయిస్తానంటూ ఆ బాలికను మరో గదిలోకి పిలుచుకొని వెళ్లాడు. అనంతరం ఆ బాలికపై అత్యాచారం చేయబోగా... ఆమె తప్పించుకొని గదిలో నుంచి వచ్చేసింది. కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్న వారు ధనుష్ కోటికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ధనుష్ కోటిని అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులకు ఆసుపత్రికి తరలించారు. -
యువతిపై టీడీపీ కార్యకర్త అత్యాచారయత్నం
గుంటూరు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరపురంలో దారుణం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ వార్డు సభ్యుడు సంకటి శ్రీనివాస్‌రెడ్డి ఓ యువతిపై అత్యాచారానికి యత్నించాడు. దాంతో అతడి నుంచి బాధితురాలు ఎలాగోలా తప్పించుకుని తల్లితండ్రులను ఆశ్రయించి, జరగిన ఘటనపై వివరించింది. దాంతో ఆ యువతి తల్లితండ్రులు ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.