పూజల నెపంతో బాలికపై అత్యాచారయత్నం | Rape attempted to 11 years old girl at Bangalore | Sakshi
Sakshi News home page

పూజల నెపంతో బాలికపై అత్యాచారయత్నం

Published Thu, Jul 31 2014 8:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM

Rape attempted  to 11 years old girl at Bangalore

బెంగళూరు: పూజల పేరుతో ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఓ దొంగ స్వామికి స్థానికులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. కుమారస్వామి లేఔట్ పోలీసుల కథనం ప్రకారం... స్థానికంగా నివాసముంటున్న ఓ బాలిక (11) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆ బాలిక తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో చూపించినా ఫలితం లేకుండా పోయింది. కాశీ నగర్లో నివాస ముంటున్న ధనుష్ కోటి అనే వ్యక్తి నాటు వైద్యం, ప్రత్యేక పూజల ద్వారా పలు వ్యాధులు నయం చేస్తాడని తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు బుధవారం అక్కడికి వెళ్లారు.

ఓం శక్తి పూజలు చేస్తే వ్యాధి నయం అవుతుందని ధనుష్ కోటి వారిని నమ్మించాడు. పూజ చేయిస్తానంటూ ఆ బాలికను మరో గదిలోకి పిలుచుకొని వెళ్లాడు. అనంతరం ఆ బాలికపై అత్యాచారం చేయబోగా... ఆమె తప్పించుకొని గదిలో నుంచి వచ్చేసింది. కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్న వారు ధనుష్ కోటికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ధనుష్ కోటిని అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం  పోలీసులకు ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement