సహాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కెళ్తే.. కాటేశాడు | Gurgaon SHO Arrested for Raping Woman | Sakshi
Sakshi News home page

సహాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కెళ్తే.. కాటేశాడు

Published Sun, Aug 11 2019 5:58 PM | Last Updated on Sun, Aug 11 2019 6:10 PM

Gurgaon SHO Arrested for Raping Woman - Sakshi

గుర్‌గావ్‌: సహాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళను లైంగికంగా వేధించడమే కాకుండా, వీడియో తీసి బెదిరిస్తున్న పోలీస్‌ అధికారిని శనివారం గురుగావ్‌లో అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన చూస్తే కంచే చేను మేసిందన్న సామెత గుర్తుకు వస్తుంది. వివరాలు.. జింద్‌ జిల్లాలోని ఉద్దానాలో నివసించే మహిళకు 2017లో వివాహమైంది. అనంతరం కొన్ని నెలలకు వైవాహిక బంధంలో విభేదాలు రావడంతో భర్తపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేసన్‌కు వచ్చింది. అదే స్టేషనలో స్టేషన్‌ హౌన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న దల్బీర్‌ సింగ్‌తో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో ఇద్దరిది ఒకే జిల్లా కావడంతో కేసు విషయంలో దల్బీర్‌ సింగ్‌ బాధితురాలితో తరుచూ మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు గుర్‌గావ్‌కి వెళ్లడం కోసం బస్టాండ్‌లో ఎదురు చూస్తున్న బాధితురాలిని తాను డ్రాప్‌ చేస్తానని నమ్మబలికి కారులో ఎక్కించుకున్నాడు.

అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారం చేశాడు. మరుసటి రోజుకి తేరుకున్న బాధితురాలు దల్బీర్‌ను నిలదీయడంతో ఆమెను తన క్వార్టర్స్‌కి పిలిపించుకొని సముదాయిస్తూ, మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చాడు. దీంతో అపస్మారక స్థితికి వెళ్లిన ఆమెపై మరోమారు అత్యాచారం చేసి వీడియో తీసాడు. ఆ తర్వాత వీడియో బహిర్గతం చేస్తానని బ్లాక్‌ మెయిల్‌కి దిగి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో కుమిలి పోయిన బాధితురాలు జరిగిన దారుణాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిస్సహాయురాలై చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన ఒక పోలీసు ఆమెను కాపాడి జరిగిందంతా తెలుసుకుని దల్బీర్‌కు వ్యతిరేకంగా శుక్రవారం ఫిర్యాదు చేయించాడు. దీంతో అంతర్గత విచారణకు ఆదేశించిన పోలీసు ఉన్నతాధికారులు నేరం రుజువవడంతో దల్బీర్‌ను అరెస్ట్‌ చేశారు. కాగా దల్బీర్‌ సింగ్‌ వచ్చే ఏడాది రిటైర్‌ కానుండడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement