ఇంటర్వ్యూ పేరుతో 24 ఏళ్ల భోజ్‌పురి సినీ నటిపై ఆమె స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను ఆమెకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్నేహితుడు అయ్యాడని తెలుస్తోంది. ఈ ఘటన గురుగ్రామ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలికి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉందని పోలీసులు తెలుపుతున్నారు. అక్కడ ఆమె తన వీడియోలను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుందని కూడా చెప్పారు. పోలీసులతో ఆమె ఇలా చెప్పింది.
(ఇదీ చదవండి: విజయ్‌సేతుపతితో మోస్ట్ కాంట్రవర్సీ హీరోయిన్ రోమాన్స్)
'కొన్ని రోజుల క్రితం నాకు భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తానని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మహేష్ పాండే అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. జూన్ 29న, అతను ఇంటర్వ్యూ పేరుతో గురుగ్రామ్‌లోని ఉద్యోగ్ విహార్ ప్రాంతంలోని హోటల్‌కి నన్ను పిలిచాడు. నేను హోటల్‌కు చేరుకున్నప్పుడు, మహేష్ నన్ను తీసుకెళ్లిన గదిని ఇప్పటికే బుక్ చేశాడు. ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత అతను మద్యం తాగడం ప్రారంభించాడు. దీంతో నేను నేను బయల్దేరుతానని వెళ్లిపోతుండగా.. అతను నాపై బలవంతంగా అత్యాచారం చేశాడు.' అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ అత్యాచార విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని ఆ నటి తెలిపింది. ఆ ఘటన తర్వాత అతని స్నేహితులు కొందరు తనకు ఫోన్ చేసి, తన ప్రైవేట్ వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించారని ఆమె చెప్పింది. దీంతో గురుగ్రామ్‌లోని చకర్‌పూర్ ప్రాంతంలో నివసించే మహేష్ పాండేపై పోలీసులు కేస్ నమోదు చేశారు.
(ఇదీ చదవండి: చిరంజీవి, విజయ్ విషయంలో చాలా బాధపడ్డాను: రష్మిక మందన్న)
Comments
Please login to add a commentAdd a comment