మహిళపై అత్యాచారం.. భారతీయ విద్యార్థికి యూకేలో ఆరేళ్ల జైలు శిక్ష Indian Student In UK Carries Drunk Woman To His Flat Rapes Her Gets 6 yrs In Jail | Sakshi
Sakshi News home page

మహిళపై అత్యాచారం.. భారతీయ విద్యార్థికి యూకేలో ఆరేళ్ల జైలు శిక్ష

Published Sun, Jun 18 2023 4:11 PM

Indian Student In UK Carries Drunk Woman To His Flat Rapes Her Gets 6 yrs In Jail - Sakshi

మద్యం మత్తులో ఉన్న ఓ మహిళను అత్యాచారం చేసిన కేసులో భారతీయ మూలాలున్న యువకునికి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది యూకే కోర్టు. గత ఏడాది నైట్‌ క్లబ్‌లో పరిచయమైన ఓ మహిళపై ఈ దారుణానికి పాల్పడ్డాడని కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

ప్రీత్ వికాల్(20) యూకేలో ఇంజినీరింగ్ చదవడానికి వెళ్లిన భారతీయ యువకుడు. గత ఏడాది నైట్‌క్లబ్‌లో తప్పతాగి సృహలో లేని మహిళను ప్రీత్ చేతులపై ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మహిళను తన నివాసానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె ఫొటోలను తన స్నేహితులకు షేర్ చేశాడు. ఇవే ఈ కేసులో పోలీసులకు కీలకంగా మారాయి. ఈ ఆధారాలతో ప్రీత్ వికాల్ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఆధారాలను గమనించిన న్యాయస్థానం ప్రీత్‌ను దోషిగా గుర్తించి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది.

ఇదీ చదవండి:చైనా కంపెనీ వింత నిబంధన: అఫైర్లు వద్దు.. విడాకుల మాటే ఎత్తొద్దు...!

Advertisement
 
Advertisement
 
Advertisement