కొందరికీ షాపింగ్ అంటే మహా ఇష్టం. చూసిందల్లా కొంటుంటారు. పాపం బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకుని కొందామన్నా సాధ్యం కాదు కొందరికీ. ఎంతలా కంట్రోల్‌గా ఉందామన్న ఆ వస్తువు కొనేదాక నిద్రపట్టని వాళ్ల గురించిn కూడా విన్నాం. కానీ నిద్రలో షాపింగ్ చేసే వ్యాధి గురించి విన్నారా? ఔను..! ఈ వ్యక్తులు నిద్రలోనే తెలియకుండానే షాపింగ్ చేస్తుంటారు. మెలుకవ వచ్చాక గానీ అసలు విషయం తెలియదంట. వామ్మో.. ఇదేం వ్యాది!. ఇలాంటివి కూడా ఉంటాయా అనుకోకండి. అలాంటి అరుదైన వ్యాధితోనే బాధపడుతోంది ఓ మహిళ.
యూకేకి చెందిన 42 ఏళ్ల కెల్లీ నైప్స్ పారాసోమ్నియా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీన్ని అరుదైన పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్‌గా పిలుస్తారు. ఈ డిజార్డర్ కారణంగా ఆమె నిద్రలోనే ఆన్‌లైన్ షాపింగ్ చేసేస్తుందట. ఏకంగా పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు దగ్గర నుంచి ఫ్రిడ్జ్ వంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కొనుగోలు చేసేస్తుంది. వాటి బిల్లను కూడా క్రెడిట్ కార్డులతో చెల్లించేస్తుందట. మేలుకువ వచ్చాక మొబైల్ చూసుకుంటే గానీ తెలియదంట. తన అకౌంట్‌లో డబ్బు కట్ అయ్యాక గానీ అసలు విషయం తెలుసుకులేకతున్నాని చెబుతుంది. ఇలా నిద్రలో తనకు తెలియకుండానే షాపింగ్ చేసి లక్షల్లో డబ్బుల పోగొట్టుకున్నానని చెబుతోంది.
దీంతో ఆమెకు ప్రతి రాత్రి భయానకంగా మారిపోయింది. "తన జీవితంలో ప్రతి రాత్రి ఓ పీడకల మాదిరిగా అయిపోతోందని బాధపడుతోంది. తన క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలన్నీఫోన్‌లోనే సేవ్ అయ్యి ఉంటాయట. ఐతే ఈ మాయదారి జబ్బు కారణంగా తన బ్యాంక్ వివరాన్ని సైబర్ నేరాగాళ్లకు చెప్పేయడం కూడా జరిగిందంట. దీంతో వాళ్లు ఆమె ఖాతా నుంచి సుమారు రూ. 20 వేలకు పైగా తస్కరించారట కూడా. అయితే ఈలోగా తాను తన బ్యాంక్ లావాదేవీలను లాక్ చేసేయడంతో కొద్ది మొత్తంలోనే డబ్బును కోల్పోయానని అంటోంది." కెల్లీ.
ఇక సమస్య నుంచి బయటపడేందుకు ముక్కుకి శ్వాస సంబధ సమస్యల నిమిత్తం అమర్చుకునే పరికరాన్ని ధరించి పడుకుంటుంది. ఈ డివైజ్ ముక్కు నుంచి హెడ్ వరకు కదలకుండా అటాచ్ అయ్యేలా డివైజ్ ఉంటుంది. కాబట్టి నిద్రలోనే తనకు తెలయకుండా చేసే విచిత్రమైన పనుల నుంచి ఉపశమనం పొందొచ్చనేది కెల్లీ ఆశ. అయితే కెల్లీ సమస్య నుంచి బయటపడలేదు సరికదా..!ఈ పరికరాన్ని కూడా నిద్రలో తనకు తెలియకుండానే తీసేస్తుందంట. ఈ సమస్య కారణంగా తాను అప్పులు పాలవ్వుతున్నానని కెల్లీ ఆవేదనగా చెప్పుకొచ్చింది. అయితే దీనికి చికిత్స లేదు. తనకు తానుగా బయటపడాలని సంకల్పించుకుంటేనే సాధ్యమని చెబుతున్నారు వైద్య నిపుణులు.
పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్ అంటే..
ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి నిద్రలోనే నడవడం /మాట్లాడటం / తినడం/ ఏమైన ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి ఏ మాత్రం పూర్తి అవగాహనతో చేయరు. ఆ టైంలో వారికి మెదడు పాక్షికంగా మేల్కొని ఉంటుంది. ఎవరైనా ఆ వ్యక్తులను గమనించి గట్టిగా అదిలిస్తే తిరిగి స్ప్రుహలోకి వస్తారు.
ఇలాంటివన్నీ రాత్రి మొదటి జామునే జరుగుతాయట. చిన్నారుల్లోనూ, కొందరూ పెద్దల్లోనూ నిద్రలోనే నడవడం/మాట్లాడటం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. అయితే ఈ డిజార్డర్ తీవ్రంగా ఉంటేనే ఇలా సమస్యలు ఫేస్ చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు.
(చదవండి: అనారోగ్యంలోనూ... నీట్ టాపర్‌గా!)
Comments
Please login to add a commentAdd a comment