US: అమ్మాయి అనుకుని చాటింగ్‌.. భారత విద్యార్థికి 12 ఏళ్ల జైలు | Indian Student In Us Gets 12 Years Jail For Trying To Lure Minor For Sex | Sakshi
Sakshi News home page

US: అమ్మాయి అనుకుని చాటింగ్‌.. భారత విద్యార్థికి 12 ఏళ్ల జైలు

Published Fri, Jul 26 2024 7:25 PM | Last Updated on Fri, Jul 26 2024 9:46 PM

Indian Student In Us Gets 12 Years Jail For Trying To Lure Minor For Sex

న్యూయార్క్‌: ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లి బుద్ధి వక్రీకరించి 12 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యాడు ఓ భారత విద్యార్థి. స్టూడెంట్‌ వీసా మీద అమెరికా వెళ్లిన ఉపేంద్ర  ఆడూరు(32) భారత విద్యార్థి సోషల్‌ మీడియాలో 13 ఏళ్ల బాలిక అనుకుని ఓ వ్యక్తితో చాటింగ్‌ మొదలుపెట్టాడు. 

తన లైంగిక వాంఛ తీర్చుకునేందుకు మభ్యపెట్టే విధంగా సందేశాలు పంపాడు. అంతటితో ఆగకుండా ఆ ఖాతాకు అశ్లీల చిత్రాల మెసేజ్‌లు కూడా పెట్టాడు. ఏకంగా ఓ రోజు టైమ్‌ ఫిక్స్‌ చేసుకుని ఆ బాలికను కలవడానికి వెళ్లాడు. ఇక్కడే అతడికి ఎదురైంది పెద్ద ట్విస్టు. ఉపేంద్ర అనుకున్నట్లు ఆ ఖాతా 13 ఏళ్ల బాలికది కాదు.

మైనర్ల మీద లైంగికనేరాలకు పాల్పడే వారిని వలపన్ని పట్టుకునేందుకు ఓ ప్రైవేట్‌ డిటెక్టివ్‌ క్రియేట్‌ చేసిన నకిలీ ఖాతా. ఉపేంద్ర బాలికను కలిసేందుకు మీటింగ్‌ స్పాట్‌కు వెళ్లగానే పోలీసులు పట్టుకున్నారు. అతడి ఫోన్‌ లాక్కుని అందులోని అశ్లీల వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారమంతా 2022 సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 6 మధ్యలో జరిగింది. ఈ కేసులో ఉపేంద్రకు 12 ఏళ్ల జైలు శిక్షతో పాటు రిలీజ్‌ అయిన తర్వాత మరో 10 ఏళ్లు పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని కోర్టు తీర్పిచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement