అమెరికాలో రోడ్డు ప్రమాదం..హైదరాబాదీల సజీవదహనం | Hyderabadis Died In A Car Accident In America | Sakshi

అమెరికాలో రోడ్డు ప్రమాదం..హైదరాబాదీల సజీవదహనం

Sep 4 2024 7:23 AM | Updated on Sep 4 2024 11:45 AM

Hyderabadis Died In A Car Accident In America

టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు. గత వారం జరిగిన ఈ ప్రమాద ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్‌ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్‌ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్‌ ఉన్నట్లు  అధికారులు తెలిపారు. 

కార్‌ పూలింగ్‌ ద్వారా ఈ నలుగురు బెన్‌టోన్‌విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారు. తర్వాత రోడ్డుపై వీరి వాహనాన్ని వేరే వాహనాలు వెనుకనుంచి అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. డల్లాస్‌లో బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్‌ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేశ్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూఖ్‌ ఈ కారులో ఎక్కారు. ప్రమాదం కారణంగా వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement