అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థులు వరుసగా మృతి చెందుతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే మూడో విద్యార్థి మృతి చెందడం కలవరానికి గురిచేస్తోంది. తాజాగా అమెరికాలోని సిన్సినాటిలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు. ఆయన గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియలేదు.
వివేక్ సైనీ
ఇటీవలే వివేక్ సైనీ(25 ) అనే భారత విద్యార్థిని నిరాశ్రయుడై ఓ వ్యక్తి దుకాణంలో కొట్టి చంపాడు. సైనీ ఇటీవలే అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఓ దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో దాడికి కొన్ని రోజుల ముందు నుంచి మాదకద్రవ్యాలకు బానిసైన జూలియన్ ఫాల్క్‌నర్ అనే నిరాశ్రయునికి సైనీ సహాయం చేశాడు. అయినప్పటికీ సైనీని ఫాల్క్‌నర్ హత్య చేశాడు.
నీల్ ఆచార్య
ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య గత వారం రోజుల క్రితం శవమై కనిపించాడు. జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజ్ ఆఫ్ పర్డ్యూ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు ఆచార్య. కాగా గత ఆదివారం ఆచార్య కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరుసటి రోజే ఆచార్య చనిపోయి ఉండటాన్ని గుర్తించారు.
ఆదిత్య అద్లాఖా
గత ఏడాది నవంబర్‌లో ఆదిత్య అద్లాఖా(26)అనే భారతీయ విద్యార్థిని దారుణంగా హత్యకు గురయ్యాడు. సిన్సినాటి యూనివర్శిటీలో ఆదిత్య అద్లాఖా పీహెచ్‌డీ విద్యార్థి. ఒహియోలోని కారులో ఆయన్ని దుండగులు కాల్చి చంపారు. మరో కేసులో ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న అకుల్ ధావన్(18) అనే భారత సంతతి విద్యార్థి కూడా మృతి చెందాడు.
ఇదీ చదవండి: Jordan Attack: అంతటి అమెరికా సైన్యమే పొరబడింది! ఫలితంగా ముగ్గురు మృతి
Comments
Please login to add a commentAdd a comment