Cincinnati
-
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. నెల రోజుల వ్యవధిలో అమెరికాలో చోటుచేసుకున్న నాలుగో ఘటన ఇది. ఓహియో రాష్ట్రం సిన్సినాటిలో లిండ్నెర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుకుంటున్న శ్రేయస్ రెడ్డి బెనిగెరి అనే తెలుగు విద్యార్థి చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారని, అతడి మరణం వెనక ఎటువంటి కుట్ర లేదని భావిస్తున్నట్లు న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం గురువారం తెలిపింది. శ్రేయస్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని, సాధ్యమైనంత మేర వారికి సాయం అందజేస్తామని పేర్కొంది. శ్రేయస్ రెడ్డి తండ్రి త్వరలోనే అమెరికా రానున్నారని తెలిపింది. -
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి
వాషింగ్టన్: అమెరికాలోని సిన్సినాటిలో భారతీయ విద్యార్థి ఒకరు చనిపోయారు. అతడి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఇండియానా రాష్ట్రంలోని పర్డూ యూనివర్సిటీలో చదువుకుంటున్న నీల్ ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. ఇతడు మృతి చెందినట్లు పోలీసులు సోమవారం ధ్రువీకరించారు. వారం రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన ఇది రెండోది కావడం గమనార్హం. మూడు రోజుల క్రితం ఎంబీఏ చదువుకుంటున్న వివేక్ సైనీ(25) అనే భారతీయ విద్యార్థిని జూలియన్ ఫాక్నర్ అనే డ్రగ్స్ బానిస సుత్తితో కొట్టి దారుణంగా పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. -
అమెరికాలో భారత విద్యార్థుల వరుస మరణాలు
అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థులు వరుసగా మృతి చెందుతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే మూడో విద్యార్థి మృతి చెందడం కలవరానికి గురిచేస్తోంది. తాజాగా అమెరికాలోని సిన్సినాటిలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు. ఆయన గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియలేదు. వివేక్ సైనీ ఇటీవలే వివేక్ సైనీ(25 ) అనే భారత విద్యార్థిని నిరాశ్రయుడై ఓ వ్యక్తి దుకాణంలో కొట్టి చంపాడు. సైనీ ఇటీవలే అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఓ దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో దాడికి కొన్ని రోజుల ముందు నుంచి మాదకద్రవ్యాలకు బానిసైన జూలియన్ ఫాల్క్‌నర్ అనే నిరాశ్రయునికి సైనీ సహాయం చేశాడు. అయినప్పటికీ సైనీని ఫాల్క్‌నర్ హత్య చేశాడు. నీల్ ఆచార్య ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య గత వారం రోజుల క్రితం శవమై కనిపించాడు. జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజ్ ఆఫ్ పర్డ్యూ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు ఆచార్య. కాగా గత ఆదివారం ఆచార్య కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరుసటి రోజే ఆచార్య చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. ఆదిత్య అద్లాఖా గత ఏడాది నవంబర్‌లో ఆదిత్య అద్లాఖా(26)అనే భారతీయ విద్యార్థిని దారుణంగా హత్యకు గురయ్యాడు. సిన్సినాటి యూనివర్శిటీలో ఆదిత్య అద్లాఖా పీహెచ్డీ విద్యార్థి. ఒహియోలోని కారులో ఆయన్ని దుండగులు కాల్చి చంపారు. మరో కేసులో ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న అకుల్ ధావన్(18) అనే భారత సంతతి విద్యార్థి కూడా మృతి చెందాడు. ఇదీ చదవండి: Jordan Attack: అంతటి అమెరికా సైన్యమే పొరబడింది! ఫలితంగా ముగ్గురు మృతి -
అమెరికాలో బాలలపైకి దుండగుడి కాల్పులు
సిన్సినాటి: అమెరికాలోని సిన్సినాటిలో ఓ సాయు ధుడు జరిపిన తుపాకీ కాల్పుల్లో 11 ఏళ్ల బాలుడు, ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు బాలలు గాయపడ్డారు. కారులో వచ్చిన దుండగుడు యథేచ్ఛగా 22 రౌండ్లు కాల్చినట్లు పోలీసు అధికారి టెర్రీ తెలిపారు. ఆ వెంటనే దుండగుడు ఘటనా స్థలి నుంచి మాయమ య్యాడన్నా రు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయిందన్నారు. బుల్లె ట్లు తగిలి 53 ఏళ్ల మహిళ, 11 ఏళ్ల బాలుడు ఘట నాస్థలిలోనే ప్రాణాలు కోల్పోగా, 12, 13, 15 ఏళ్ల ముగ్గురు బాలురు, 15 ఏళ్ల బాలిక గాయపడ్డారని తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆమె వివరించారు. -
అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడు మృతి
న్యూయార్క్: అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో నలుగురు ఆక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో ఒకరు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్విరాజ్(25)గా గుర్తించారు. ఈ ఘటన సిన్సినాటిలోని వాల్నట్ స్ట్రీట్‌లోని బ్యాంక్‌లో చోటుచేసుకుంది. మృతి చెందిన పృథ్వీరాజ్ బ్యాంక్ ఉద్యోగిగా తెలిసింది. కాల్పులుకు పాల్పడిన ఒమర్ పెరాజ్‌ను పోలీసులు మట్టుపెట్టారు. స్పందించిన విదేశాంగ కార్యాలయం అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన వారిలో గుంటూరుకు చెందిన పృథ్వీరాజ్ అని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే న్యూయార్క్ పోలీసులను సంప్రదించామని, పృథ్వీరాజ్ మృతదేహాన్ని భారత్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు. ఘటనా స్థలం.. కాల్పులు జరిపిన దుండగుడు(ఇన్సెట్లో) -
జీసీటీఏ ఆధ్వర్యంలో ఉచిత సెమినార్
సిన్సినాటి(ఒహియో, అమెరికా) : సామాజిక అవగాహన ప్రచారంలో భాగంగా గ్రేటర్ సిన్సినాటి తెలంగాణ అసోసియేషన్ (జీసీటీఏ) ఉచితంగా సెమినార్‌ను ఏర్పాటు చేసింది. అటార్నీ పాల్ రివల్సన్ ఆధ్వర్యంలో విల్, ఎస్టేట్ అండ్ ట్రస్ట్ ప్లానింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జీసీటీఏ ఓ ప్రకటనలో తెలిపింది. కమ్యునిటీకి చెందిన సీనియర్ సిటిజన్ సత్య మాజేటి కూడా ఈ అంశంపై తన అనుభవాలను పంచుకోనున్నారు. రవీస్ హైదరాబాద్ హౌస్, 9536 సిన్సినాటి కోలంబస్ రోడ్లో ఏప్రిల్ 29న మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఈవెంట్ కో ఆర్డినేటర్లు సీతారాం బోయిన పల్లి, గణేష్ కోటలు తెలిపారు. -
అంబులెన్స్ తో ఉడాయించిన మహిళ
సిన్సినాటి: ఇంటికి వెళ్లేందుకు బయలుదేరిన మహిళ.. చివరి బస్సు కూడా వెళ్లిపోవడంతో అంబులెన్స్ తో ఉడాయించిన ఘటన అమెరికాలోని ఒహియ రాష్ట్రంలో చోటు చేసుకుంది. స్ప్రింగ్ఫీల్డ్ టౌన్షిప్ పాంతానికి చెందిన లిసా కార్(43) అనే మహిళ ఈ పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. సిన్సినాటి సబర్బన్ లోని ఇంటికి వెళ్లేందుకు బస్సు లేకపోవడంతో ఆమె అంబులెన్స్ ఎత్తుకుపోయిందని హమిల్టన్ మున్సిపల్ కోర్టుకు సమర్పించిన నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. అంబులెన్స్ ను ఆస్పత్రి ముందు నిలిపి రోగితో పాటు డ్రైవర్ లోనికి వెళ్లినప్పుడు ఆమె ఈ పని చేసింది. ఆమెపై దొంగతనం, పోలీసులకు ఫిర్యాదు చేయడంలో విఫలమయిందనే ఆరోపణలతో అభియోగాలు నమోదు చేశారు. లిసా కార్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశముంది. రాత్రిపూట ఇంటికి వెళ్లేందుకు ఆఖరి బస్సు కూడా వెళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియక అంబులెన్స్ ఎత్తుకుపోయానని నిందితురాలు చెప్పింది. -
సానియా జోడికి ఏడో సీడింగ్
సిన్సినాటి(యూఎస్ఏ): సిన్సినాటిలో జరుగనున్న వెస్ట్రన్-సౌత్రన్ ఓపెన్ సిరీస్‌లో బరిలోకి దిగే సానియా మీర్జా(భారత్)-బార్బోరా స్ట్రికోవా(చెక్ రిపబ్లిక్)జోడికి ఏడో సీడింగ్ లభించింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన డ్రాలో సానియా-బార్బోరాల జోడి ఏడో సీడ్‌గా పోరుకు సిద్ధమవుతుండగా, మార్టినా హింగిస్-కోకో వాండెవేగ్కు నాల్గో సీడింగ్ లభించింది. మహిళల డబుల్స్ లో స్విట్జర్లాండ్ క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో విడిపోయిన అనంతరం బార్బోరాతో సానియా మీర్జా జత కట్టిన సంగతి తెలిసిందే. ఈ జోడీ తమ తొలి మ్యాచ్‌లో దారిజా జురాక్(క్రోయేషియా)- రొడినోవా(ఆస్ట్రేలియా)తో తలపడనుంది. కాగా, పురుషుల విభాగంలో బరిలోకి దిగే రోహన్ బోపన్న(భారత్)-ఫ్లోరిన్ మెర్జియా(రొమేనియా) జంటకు కూడా ఏడో సీడింగ్ లభించింది. -
మళ్లీ కనిపించనున్న గొరిల్లా
సిన్సినట్టి: గతవారం ఓ బాలుడిని రక్షించడం కోసం గొరిల్లాను చంపిన జూ అధికారులు తిరిగి ఆ గొరిల్లా ఉన్న చోటును ప్రారంభిస్తున్నారు. అయితే, ఈసారి ఆ ఎన్ క్లోజర్ వద్ద పెద్ద మొత్తంలో కంచెను ఏర్పాటుచేశారు. చిన్నపిల్లలు సైతం ఎక్కేందుకు వీలుకానంత విధంగా గట్టి రక్షణ చర్యలు తీసుకున్నారు. గత మే 28న సిన్సినట్టిలోని జంతు ప్రదర్శన శాలలో ఓ మూడేళ్ల బాలుడు ఓ గొరిల్లా ఎన్ క్లోజర్లో పడిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆ బాలుడిని రక్షించే క్రమంలో పదిహేడేళ్ల గొరిల్లాను చంపేశారు. అనంతరం ఆ ఎన్ క్లోజర్ ను మూసేశారు. వేరే గొరిల్లా అందులో ఉన్నప్పటికీ రక్షణ చర్యల్లో భాగంగా దానిని మూసేశారు. తిరిగి ఆ చర్యలు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు. గొరిల్లాను హత్య చేయడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. కొంతమంది జంతు ప్రేమికులు ఆ బాలుడి వల్ల గొరిల్లాను చంపాల్సి వచ్చిందని, బాలుడి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని వారు కోర్టులో పిటిషన్ కూడా వేయగా అందుకు నిరాకరించిన కోర్టు ఆ ఎన్ క్లోజర్ వద్ద గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని మాత్రం సూచించింది.