సానియా జోడికి ఏడో సీడింగ్ | Sania and Strycova get 7th seeding at Cincinnati | Sakshi
Sakshi News home page

సానియా జోడికి ఏడో సీడింగ్

Published Tue, Aug 16 2016 1:38 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

సానియా జోడికి ఏడో సీడింగ్

సానియా జోడికి ఏడో సీడింగ్

సిన్సినాటి(యూఎస్ఏ): సిన్సినాటిలో జరుగనున్న వెస్ట్రన్-సౌత్రన్ ఓపెన్ సిరీస్లో బరిలోకి దిగే సానియా మీర్జా(భారత్)-బార్బోరా స్ట్రికోవా(చెక్ రిపబ్లిక్)జోడికి ఏడో సీడింగ్ లభించింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన డ్రాలో సానియా-బార్బోరాల జోడి ఏడో సీడ్గా పోరుకు సిద్ధమవుతుండగా,  మార్టినా హింగిస్-కోకో వాండెవేగ్కు నాల్గో సీడింగ్ లభించింది.

మహిళల డబుల్స్ లో స్విట్జర్లాండ్ క్రీడాకారిణి మార్టినా హింగిస్తో విడిపోయిన అనంతరం బార్బోరాతో సానియా మీర్జా జత కట్టిన సంగతి తెలిసిందే. ఈ జోడీ తమ తొలి మ్యాచ్లో దారిజా జురాక్(క్రోయేషియా)- రొడినోవా(ఆస్ట్రేలియా)తో తలపడనుంది.  కాగా, పురుషుల విభాగంలో బరిలోకి దిగే రోహన్ బోపన్న(భారత్)-ఫ్లోరిన్ మెర్జియా(రొమేనియా) జంటకు కూడా ఏడో సీడింగ్ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement