రన్నరప్ గా సానియా జోడి | sania mirza pair defeated in the final of Wuhan Open | Sakshi
Sakshi News home page

రన్నరప్ గా సానియా జోడి

Published Sat, Oct 1 2016 12:08 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

రన్నరప్ గా సానియా జోడి

రన్నరప్ గా సానియా జోడి

బీజింగ్:గత నెల్లో పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్‌ ను సాధించిన సానియా మీర్జా-బార్బరా స్ట్రికోవా జోడి.. వూహాన్ ఓపెన్ తుది పోరులో ఓటమి పాలైంది. చైనాలో జరిగిన  ఈ టోర్నీ ఫైనల్ పోరులో సానియా మీర్జా-బార్బరా స్ట్రికోవా జోడి  పరాజయం చవిచూసింది. మహిళల డబుల్స్ లో భాగంగా శనివారం జరిగిన పోరులో సానియా ద్వయం 1-6, 4-6 తేడాతో మాటెక్ స్టాండ్స్-సఫోరోవా జంటపై ఓటమి పాలై రన్నరప్ గా సరిపెట్టుకుంది.

 

తొలి సెట్ ను ఏమాత్రం ప్రతిఘటన లేకుండా కోల్పోయిన సానియా జోడి.. రెండో సెట్ లో మాత్రం పోరాడి ఓడింది. ఆది నుంచి సానియా జంట ఆధిక్యం సాధించిన సఫోరోవా జోడి అదే ఊపును కడవరకూ కొనసాగించి వూహాన్ ఓపెన్ ను సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement