Wuhan Open
-
లాక్డౌన్ ఎఫెక్ట్: చిరు వ్యాపారుల నిరసన
బీజింగ్: కరోనా వైరస్ మహమ్మారి జన్మస్థలం వూహాన్లో లాక్డౌన్ ఎత్తివేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి చిన్న చిన్న దుకాణాల యజమానులు వారి అద్దె తగ్గించాలని కోరుతూ వుహాన్‌లోని అతిపెద్ద గ్రాండ్ ఓషన్ డిపార్టుమెంటు షాపింగ్ మాల్స్ ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ క్రమంలో సామాజిక దూరం పాటిస్తూనే మొహనికి మాస్క్‌లు ధరించి ప్లకార్డులు పట్టుకుని స్టోర్ ఎదుట మోకాళ్లపై దీక్ష చేపట్టారు. కాగా దీక్షకు ముందు రోజు వారంతా ‘సంవత్సరం అద్దె మినహాయింపు ఇవ్వాలని లేదా తమ లీజు ఒప్పందాన్ని తిరిగి ఇవ్వమని’ చైనీస్ సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేశారు. (వూహాన్లో లాక్డౌన్ ఎత్తివేత) ఇక షాపింగ్ మాల్లో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకున్న మహిళా మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ కారణంగా వ్యాపారం జరగలేదు. కాబట్టి షాపింగ్ మాల్ యజమానులు అద్దె మినహాయింపు ఇవ్వాలన్నారు. ఎందుకంటే నిరసనలో పాల్గొన్న 99 శాతం మంది నిరసనకారులు చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించేవారే. ఇక లాక్డౌన్ కారణంగా ఎటువంటి వ్యాపారాలు జరగలేదు. వూహాన్‌లోనే కాదు పోరుగు ప్రాంతాల వ్యాపారులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. వారంత కూడా నిరసనలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని పేర్కొంది. (నెట్వర్క్ కోసం చెట్లు ఎక్కుతూ అంపైర్ పాట్లు!) అలాగే మరో నిరసనకారుడు మాట్లాడుతూ.. ‘మేము నిరసన చేపట్టినప్పటీ నుంచి ఇంతవరకూ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం అన్నాడు. పైగా పోలీసులు మాపై దాడి కూడా చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా గతేడాది డిసెంబర్లో వుహాన్ నగరంలో బయటపడిన ఈ ప్రాణాంతక వైరస్ ప్రస్తుతం ప్రపంచమంతా కోరలు చాస్తుంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటీ వరకు 1,615, 587 కరోనా కేసులు నమోదు కాగా, 96, 794 మంది మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. -
రన్నరప్ గా సానియా జోడి
బీజింగ్:గత నెల్లో పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్ ను సాధించిన సానియా మీర్జా-బార్బరా స్ట్రికోవా జోడి.. వూహాన్ ఓపెన్ తుది పోరులో ఓటమి పాలైంది. చైనాలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్ పోరులో సానియా మీర్జా-బార్బరా స్ట్రికోవా జోడి పరాజయం చవిచూసింది. మహిళల డబుల్స్ లో భాగంగా శనివారం జరిగిన పోరులో సానియా ద్వయం 1-6, 4-6 తేడాతో మాటెక్ స్టాండ్స్-సఫోరోవా జంటపై ఓటమి పాలై రన్నరప్ గా సరిపెట్టుకుంది. తొలి సెట్ ను ఏమాత్రం ప్రతిఘటన లేకుండా కోల్పోయిన సానియా జోడి.. రెండో సెట్ లో మాత్రం పోరాడి ఓడింది. ఆది నుంచి సానియా జంట ఆధిక్యం సాధించిన సఫోరోవా జోడి అదే ఊపును కడవరకూ కొనసాగించి వూహాన్ ఓపెన్ ను సొంతం చేసుకుంది. -
మరో టైటిల్ పోరుకు సానియా జంట
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొమ్మిదో డబుల్స్ టైటిల్ సాధించేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో విజయం దూరంలో నిలిచింది. చైనాలో జరుగుతున్న వుహాన్ ఓపెన్‌లో సానియా మీర్జా తన చెక్ రిపబ్లిక్ భాగస్వామి బార్బరా స్ట్రికోవాతో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ సానియా-స్ట్రికోవా ద్వయం 6-4, 3-6, 10-7తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. గంటా 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తొలి సెట్‌ను నెగ్గినా రెండో సెట్లో తడబడింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకొని విజయాన్ని ఖాయం చేసుకంది. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-స్ట్రికోవా 6-3, 7-6 (7/5)తో తిమియా బాబోస్ (హంగేరి)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్)లపై విజయం సాధించారు. ఫైనల్లో బెథానీ మాటెక్ సాండ్స (అమెరికా)-లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్)లతో సానియా-స్ట్రికోవా తలపడతారు.