ఫైనల్లో సానియా జోడి | Sania Mirza-Barbora Strycova sail into women's doubles final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సానియా జోడి

Published Sat, Apr 1 2017 12:36 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

ఫైనల్లో సానియా జోడి

ఫైనల్లో సానియా జోడి

మియామి ఓపెన్ మహిళల డబుల్స్ టోర్నమెంట్లో సానియా మీర్జా-బార్బోరా స్టికోవా ద్వయం ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జోడి 6-7(8) 6-1, (10-4) తేడాతో మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)-చెన్ యంగ్ జన్(తైవాన్) జంటపై గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది.తొలి సెట్ ను కోల్పోయిన సానియా ద్వయం.. రెండో సెట్ను సునాయాసంగా దక్కించుకుంది. ఆ తరువాత నిర్ణయాత్మక మూడో సెట్ సూపర్ టై బ్రేక్ కు దారితీసింది. అందులో సానియా జోడి పైచేయి సాధించి ఫైనల్ రౌండ్ కు చేరింది.

ఇది  2017లో  సానియా జోడికి రెండో ఫైనల్. అంతకుముందు సానియా-స్ట్రికోవా సిడ్నీ ఇంటర్నేషనల్ టోర్నీలో ఫైనల్ రౌండ్ కు చేరారు. అక్కడ ఈ జోడి రన్నరప్ గా సరిపెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement