క్వార్టర్స్ చేరిన సానియా జోడీ | Sania and Strycova enter into US Open Women Doubles quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్ చేరిన సానియా జోడీ

Published Tue, Sep 6 2016 6:20 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

క్వార్టర్స్ చేరిన సానియా జోడీ

క్వార్టర్స్ చేరిన సానియా జోడీ

సానియా-స్ట్రైకోవా జోడీ మూడో రౌండ్లో విజయం
యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ లో సానియా జోడీ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. మహిళల టెన్నిస్ డబుల్స్ లో సానియా మిర్జా(భారత్)-స్ట్రైకోవా(చెక్ రిపబ్లిక్) జోడీ క్వార్టర్స్ చేరింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువజామున జరిగిన మహిళల టెన్నిస్ డబుల్స్ మూడో రౌండ్లో భాగంగా జరిగిన మ్యాచ్ లో సానియా-స్ట్రైకోవా జోడీ 6-4, 7-5తో నికోల్ గిబ్స్(అమెరికా)-హిబినో(జపాన్) ద్వయంపై విజయం సాధించింది.

తొలి సెట్ ను సులువుగా కైవసం చేసుకున్న సానియా జోడీకి రెండో సెట్లో ప్రత్యర్థి జోడీ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. మెరుగైన ఆటతీరు ప్రదర్శించి రెండో సెట్ కూడా కైవసం చేసుకోవడంతో సానియా జోడీనే విజయం వరించింది. క్వార్టర్ ఫైనల్లో గార్సికా-మ్లెడనోవిక్ జోడీతో సానియా-స్ట్రైకోవా ద్వయం తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement