women doubles
-
అశ్విని జోడీకి టైటిల్
నాంటెస్ (ఫ్రాన్స్): భారత సీనియర్ షట్లర్ అశ్విని పొన్నప్ప నాంటెస్ అంతర్జాతీయ చాలెంజ్ టోర్నీ మహిళల డబుల్స్‌లో విజేతగా నిలిచింది. అశి్వని–తనీషా క్రాస్టో జంట ఫైనల్లో 21–15, 21–14తో హంగ్ ఎన్ జు–లిన్ యు పే (చైనీస్ తైపీ) జోడీపై అలవోక విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో భారత ద్వయం 0–4తో వెనుకబడింది. తర్వాత అశి్వని–తనీషా ద్వయం వరుసగా పాయింట్లు సాధించి 10–10 వద్ద తొలి గేమ్‌ను సమం చేసి ఆ తర్వాత అదే జోరుతో గేమ్‌ను గెలుచుకుంది. అనంతరం రెండో గేమ్‌లో 3–3 వద్ద ఉండగా... భారత జోడీ వరుసగా 7 పాయింట్లు గెలిచి ఆధిపత్యాన్ని కొనసాగించింది. చివరకు 31 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా–సాయి ప్రతీక్ జంటకు అదృష్టం కలిసిరాలేదు. క్వాలిఫయర్స్‌గా బరిలోకి దిగి ఫైనల్ చేరిన ఈ జంట పరాజయాన్ని ఎదుర్కొంది. ఫైనల్లో తనీషా–సాయిప్రతీక్ జోడీ 21–14, 14–21, 17–21తో మాడ్స్ వెస్టెర్గార్డ్–క్రిస్టిన్ బస్చ్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్స్ చేరిన సానియా జోడీ
⇒ సానియా-స్ట్రైకోవా జోడీ మూడో రౌండ్లో విజయం యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ లో సానియా జోడీ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. మహిళల టెన్నిస్ డబుల్స్ లో సానియా మిర్జా(భారత్)-స్ట్రైకోవా(చెక్ రిపబ్లిక్) జోడీ క్వార్టర్స్ చేరింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువజామున జరిగిన మహిళల టెన్నిస్ డబుల్స్ మూడో రౌండ్లో భాగంగా జరిగిన మ్యాచ్ లో సానియా-స్ట్రైకోవా జోడీ 6-4, 7-5తో నికోల్ గిబ్స్(అమెరికా)-హిబినో(జపాన్) ద్వయంపై విజయం సాధించింది. తొలి సెట్ ను సులువుగా కైవసం చేసుకున్న సానియా జోడీకి రెండో సెట్లో ప్రత్యర్థి జోడీ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. మెరుగైన ఆటతీరు ప్రదర్శించి రెండో సెట్ కూడా కైవసం చేసుకోవడంతో సానియా జోడీనే విజయం వరించింది. క్వార్టర్ ఫైనల్లో గార్సికా-మ్లెడనోవిక్ జోడీతో సానియా-స్ట్రైకోవా ద్వయం తలపడనుంది. -
జ్వాల జంట పరాజయం
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి జంట గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప నిరాశ పరిచింది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో తొలి రౌండ్లోనే పరాజయం ఎదుర్కొంది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో జ్వాల-అశ్విని పొన్నప్ప 16-21, 18-21తో ఆరో సీడ్ ఒయు డాంగ్‌ని-జియోహాన్ యు (చైనా) చేతిలో ఓడిపోయారు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో తెలుగు అమ్మాయి సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె ద్వయం కూడా ఓటమి పాలైంది. చాంగ్ యె నా-యు హె వన్ (దక్షిణ కొరియా) ద్వయం 21-13, 21-13తో సిక్కి-ప్రద్న్యా జంటపై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో తెలుగు అమ్మాయి సీహెచ్ పూర్ణిమ-సృ్మతి నాగర్కోటి జంట 11-21, 10-21తో కుహూ గార్గ్-నింగ్సి బ్లాక్ హజారికా (భారత్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో హైదరాబాద్‌కు చెందిన సంతోష్ రావూరి-కోనా తరుణ్ 21-14, 21-14తో ఉత్కర్ష్ అరోరా-అభినవ్ ప్రకాశ్ (భారత్)లపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఇతర మ్యాచ్‌ల్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి 15-21, 11-21తో హిరోయుకి ఎండో-కెనిచి హయకావా (జపాన్)ల చేతిలో; మల్గారి అర్జున్ కుమార్ రెడ్డి-హేమనాగేంద్ర బాబు 18-21, 18-21తో క్రిస్నాంత డ్యానీ-త్రియాచార్ట్ చాయుట్ (సింగపూర్)ల చేతిలో ఓటమి చవిచూశారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-కోనా తరుణ్ 15-21, 21-17, 22-24తో త్రియాచార్ట్ చాయుట్-షింతా ములియా (సింగపూర్) చేతిలో, మనీషా-మనూ అత్రి 5-21, 16-21తో జోచిమ్ నీల్సన్-క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్) చేతిలో; హేమనాగేంద్ర బాబు-పూర్వీషా రామ్ 13-21, 16-21తో ప్రవీణ్ జోర్డాన్-డెబ్బీ సుసాంతో (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు.