strycova
-
ఫైనల్లో సానియా జోడి
మియామి ఓపెన్ మహిళల డబుల్స్ టోర్నమెంట్లో సానియా మీర్జా-బార్బోరా స్టికోవా ద్వయం ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జోడి 6-7(8) 6-1, (10-4) తేడాతో మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)-చెన్ యంగ్ జన్(తైవాన్) జంటపై గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది.తొలి సెట్ ను కోల్పోయిన సానియా ద్వయం.. రెండో సెట్‌ను సునాయాసంగా దక్కించుకుంది. ఆ తరువాత నిర్ణయాత్మక మూడో సెట్ సూపర్ టై బ్రేక్ కు దారితీసింది. అందులో సానియా జోడి పైచేయి సాధించి ఫైనల్ రౌండ్ కు చేరింది. ఇది 2017లో సానియా జోడికి రెండో ఫైనల్. అంతకుముందు సానియా-స్ట్రికోవా సిడ్నీ ఇంటర్నేషనల్ టోర్నీలో ఫైనల్ రౌండ్ కు చేరారు. అక్కడ ఈ జోడి రన్నరప్ గా సరిపెట్టుకుంది. -
రన్నరప్ గా సానియా జోడి
బీజింగ్:గత నెల్లో పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్ ను సాధించిన సానియా మీర్జా-బార్బరా స్ట్రికోవా జోడి.. వూహాన్ ఓపెన్ తుది పోరులో ఓటమి పాలైంది. చైనాలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్ పోరులో సానియా మీర్జా-బార్బరా స్ట్రికోవా జోడి పరాజయం చవిచూసింది. మహిళల డబుల్స్ లో భాగంగా శనివారం జరిగిన పోరులో సానియా ద్వయం 1-6, 4-6 తేడాతో మాటెక్ స్టాండ్స్-సఫోరోవా జంటపై ఓటమి పాలై రన్నరప్ గా సరిపెట్టుకుంది. తొలి సెట్ ను ఏమాత్రం ప్రతిఘటన లేకుండా కోల్పోయిన సానియా జోడి.. రెండో సెట్ లో మాత్రం పోరాడి ఓడింది. ఆది నుంచి సానియా జంట ఆధిక్యం సాధించిన సఫోరోవా జోడి అదే ఊపును కడవరకూ కొనసాగించి వూహాన్ ఓపెన్ ను సొంతం చేసుకుంది. -
క్వార్టర్స్ చేరిన సానియా జోడీ
⇒ సానియా-స్ట్రైకోవా జోడీ మూడో రౌండ్లో విజయం యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ లో సానియా జోడీ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. మహిళల టెన్నిస్ డబుల్స్ లో సానియా మిర్జా(భారత్)-స్ట్రైకోవా(చెక్ రిపబ్లిక్) జోడీ క్వార్టర్స్ చేరింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువజామున జరిగిన మహిళల టెన్నిస్ డబుల్స్ మూడో రౌండ్లో భాగంగా జరిగిన మ్యాచ్ లో సానియా-స్ట్రైకోవా జోడీ 6-4, 7-5తో నికోల్ గిబ్స్(అమెరికా)-హిబినో(జపాన్) ద్వయంపై విజయం సాధించింది. తొలి సెట్ ను సులువుగా కైవసం చేసుకున్న సానియా జోడీకి రెండో సెట్లో ప్రత్యర్థి జోడీ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. మెరుగైన ఆటతీరు ప్రదర్శించి రెండో సెట్ కూడా కైవసం చేసుకోవడంతో సానియా జోడీనే విజయం వరించింది. క్వార్టర్ ఫైనల్లో గార్సికా-మ్లెడనోవిక్ జోడీతో సానియా-స్ట్రైకోవా ద్వయం తలపడనుంది. -
సానియా జంటకు సిన్సినాటి ఓపెన్ టైటిల్
సిన్సినాటి: కొత్త భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టైటిల్‌ను సాధించింది. సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీలో ఈ ఇండో-చెక్ ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో సానియా-స్ట్రికోవా ద్వయం 7-5, 6-4తో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)-కోకో వాండెవెగె (అమెరికా) జోడీపై విజయం సాధించింది. సానియా కెరీర్లో ఇది 38వ డబుల్స్ టైటిల్ కాగా, ఈ ఏడాది ఆరోది. ఈ విజయంతో సానియా డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఒంటరిగా అగ్రస్థానానికి చేరుకుంది. ఈ టోర్నీకి ముందు సానియా, ఆమె మాజీ భాగస్వామి హింగిస్ సంయుక్తంగా టాప్ ర్యాంక్‌లో ఉన్నారు. -
సానియా జోడికి ఏడో సీడింగ్
సిన్సినాటి(యూఎస్ఏ): సిన్సినాటిలో జరుగనున్న వెస్ట్రన్-సౌత్రన్ ఓపెన్ సిరీస్‌లో బరిలోకి దిగే సానియా మీర్జా(భారత్)-బార్బోరా స్ట్రికోవా(చెక్ రిపబ్లిక్)జోడికి ఏడో సీడింగ్ లభించింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన డ్రాలో సానియా-బార్బోరాల జోడి ఏడో సీడ్‌గా పోరుకు సిద్ధమవుతుండగా, మార్టినా హింగిస్-కోకో వాండెవేగ్కు నాల్గో సీడింగ్ లభించింది. మహిళల డబుల్స్ లో స్విట్జర్లాండ్ క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో విడిపోయిన అనంతరం బార్బోరాతో సానియా మీర్జా జత కట్టిన సంగతి తెలిసిందే. ఈ జోడీ తమ తొలి మ్యాచ్‌లో దారిజా జురాక్(క్రోయేషియా)- రొడినోవా(ఆస్ట్రేలియా)తో తలపడనుంది. కాగా, పురుషుల విభాగంలో బరిలోకి దిగే రోహన్ బోపన్న(భారత్)-ఫ్లోరిన్ మెర్జియా(రొమేనియా) జంటకు కూడా ఏడో సీడింగ్ లభించింది.