సానియా జంటకు సిన్సినాటి ఓపెన్ టైటిల్ | Sania Mirza becomes sole world No 1 in women's doubles rankings after Cincinnati title | Sakshi
Sakshi News home page

సానియా జంటకు సిన్సినాటి ఓపెన్ టైటిల్

Published Tue, Aug 23 2016 2:27 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

సానియా జంటకు సిన్సినాటి ఓపెన్ టైటిల్

సానియా జంటకు సిన్సినాటి ఓపెన్ టైటిల్

సిన్సినాటి: కొత్త భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టైటిల్‌ను సాధించింది. సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీలో ఈ ఇండో-చెక్ ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో సానియా-స్ట్రికోవా ద్వయం 7-5, 6-4తో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)-కోకో వాండెవెగె (అమెరికా) జోడీపై విజయం సాధించింది. సానియా కెరీర్‌లో ఇది 38వ డబుల్స్ టైటిల్ కాగా, ఈ ఏడాది ఆరోది. ఈ విజయంతో సానియా డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఒంటరిగా అగ్రస్థానానికి చేరుకుంది. ఈ టోర్నీకి ముందు సానియా, ఆమె మాజీ భాగస్వామి హింగిస్ సంయుక్తంగా టాప్ ర్యాంక్‌లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement