Open title
-
సానియా జంటకు సిన్సినాటి ఓపెన్ టైటిల్
సిన్సినాటి: కొత్త భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టైటిల్‌ను సాధించింది. సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీలో ఈ ఇండో-చెక్ ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో సానియా-స్ట్రికోవా ద్వయం 7-5, 6-4తో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)-కోకో వాండెవెగె (అమెరికా) జోడీపై విజయం సాధించింది. సానియా కెరీర్లో ఇది 38వ డబుల్స్ టైటిల్ కాగా, ఈ ఏడాది ఆరోది. ఈ విజయంతో సానియా డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఒంటరిగా అగ్రస్థానానికి చేరుకుంది. ఈ టోర్నీకి ముందు సానియా, ఆమె మాజీ భాగస్వామి హింగిస్ సంయుక్తంగా టాప్ ర్యాంక్‌లో ఉన్నారు. -
సోమ్‌దేవ్ ‘ఫైనల్’ రికార్డు
వినెట్కా (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కొత్త రికార్డు సృష్టించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టూర్ సర్క్యూట్లో సుదీర్ఘ ఫైనల్ ఆడి గెలిచిన క్రీడాకారుడిగా సోమ్‌దేవ్ గుర్తింపు పొందాడు. వినెట్కాలో జరిగిన నీల్సన్ ప్రో టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఏడో సీడ్ సోమ్‌దేవ్ 7-5, 4-6, 7-6 (7/5)తో డానియల్ ఎన్గుయెన్ (అమెరికా)పై గెలిచి విజేతగా నిలిచాడు. 3 గంటల 31 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్... ఏటీపీ చాలెంజర్ సర్క్యూట్లో సుదీర్ఘ సమయంపాటు జరిగిన ఫైనల్‌గా గుర్తింపు పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ ఓపెన్ టైటిల్ గెలిచాక 13 టోర్నమెంట్లలో పాల్గొన్న సోమ్‌దేవ్ రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేదు. కెరీర్లో ఐదో టైటిల్‌ను సొంతం చేసుకున్న అతను తాజా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విజయంతో సోమ్‌దేవ్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 25 స్థానాలు ఎగబాకి 148వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. -
హిట్.. హిట్.. ముర్రే
మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ సొంతం ⇒ ‘క్లే కింగ్’ నాదల్‌పై ఘనవిజయం ⇒ రెండు వారాల్లో రెండో టైటిల్ మాడ్రిడ్: క్లే కోర్టులపై తొలి టైటిల్ సాధించేందుకు పదేళ్లపాటు నిరీక్షించిన బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఊహించనివిధంగా వారం తిరిగేలోపు రెండో టైటిల్ సాధించి ఆశ్చర్యపరిచాడు. ‘క్లే కోర్టు’లపై తిరుగులేని రాఫెల్ నాదల్‌ను చిత్తుగా ఓడించి నెగ్గడం ఇక్కడ విశేషం. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ సింగిల్స్ ఫైనల్లో ముర్రే 6-3, 6-2తో రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై నెగ్గి విజేతగా నిలిచాడు. గతవారం మ్యూనిచ్ ఓపెన్‌లోనూ ముర్రే చాంపియన్‌గా నిలిచి తన కెరీర్లో తొలిసారి క్లే కోర్టులపై టైటిల్ సాధించాడు. ఏప్రిల్ 11న తన చిన్ననాటి స్నేహితురాలు కిమ్ సియర్స్‌ను వివాహం చేసుకున్నాక ముర్రే ఆడిన రెండు టోర్నీల్లోనూ టైటిల్స్ నెగ్గ డం విశేషం. విజేతగా నిలిచిన ముర్రేకు 7,99,450 యూరోల (రూ. 5 కోట్ల 69 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పదేళ్ల తర్వాత ‘ఐదు’ బయటకు నాదల్ మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో ఓడిపోయిన రాఫెల్ నాదల్ ర్యాంకింగ్స్‌లోనూ పడిపోయాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఈ స్పెయిన్ స్టార్ నాలుగు స్థానాలు దిగజారి ఏడో స్థానానికి పడిపోయాడు. 2005 తర్వాత నాదల్ టాప్-5 ర్యాంకుల్లో లేకపోవడం ఇదే తొలిసారి. జొకోవిచ్ (సెర్బియా), ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఆండీ ముర్రే తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ విజేత సైనా