సోమ్‌దేవ్ ‘ఫైనల్’ రికార్డు | Somdev Devvarman wins ATP Challenger event in US | Sakshi

సోమ్‌దేవ్ ‘ఫైనల్’ రికార్డు

Published Tue, Jul 14 2015 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM

సోమ్‌దేవ్ ‘ఫైనల్’ రికార్డు

సోమ్‌దేవ్ ‘ఫైనల్’ రికార్డు

భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కొత్త రికార్డు సృష్టించాడు.

వినెట్కా (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కొత్త రికార్డు సృష్టించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టూర్ సర్క్యూట్‌లో సుదీర్ఘ ఫైనల్ ఆడి గెలిచిన క్రీడాకారుడిగా సోమ్‌దేవ్ గుర్తింపు పొందాడు. వినెట్కాలో జరిగిన నీల్సన్ ప్రో టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఏడో సీడ్ సోమ్‌దేవ్ 7-5, 4-6, 7-6 (7/5)తో డానియల్ ఎన్గుయెన్ (అమెరికా)పై గెలిచి విజేతగా నిలిచాడు. 3 గంటల 31 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్... ఏటీపీ చాలెంజర్ సర్క్యూట్‌లో సుదీర్ఘ సమయంపాటు జరిగిన ఫైనల్‌గా గుర్తింపు పొందింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ ఓపెన్ టైటిల్ గెలిచాక 13 టోర్నమెంట్లలో పాల్గొన్న సోమ్‌దేవ్ రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేదు. కెరీర్‌లో ఐదో టైటిల్‌ను సొంతం చేసుకున్న అతను తాజా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విజయంతో సోమ్‌దేవ్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 25 స్థానాలు ఎగబాకి 148వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement