డేవిస్ కప్ లో సోమ్ దేవ్ విజయం | It was one of the best serving days of my career: Somdev | Sakshi
Sakshi News home page

డేవిస్ కప్ లో సోమ్ దేవ్ విజయం

Sep 18 2015 7:25 PM | Updated on Sep 3 2017 9:35 AM

డేవిస్ కప్ ప్రపంచ కప్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో భారత కెప్టెన్ సోమ్ దేవ్ దేవ్ బర్మన్ విజయం సాధించాడు.

న్యూఢిల్లీ: డేవిస్ కప్ ప్రపంచ కప్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో భారత కెప్టెన్  సోమ్ దేవ్ దేవ్ బర్మన్ ఘనవిజయం సాధించాడు. ఈ రోజ జరిగిన మ్యాచ్ లో సోమ్ దేవ్ 7-6, 6-4, 6-3 తేడాతో చెక్ రిపబ్లిక్ ఆటగాడు జిరీ వెస్లీని ఓడించాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్ లో యూకీ బాంబ్రీ ఓటమి చెందడంతో భారత్ కాస్త ఆందోళనకు గురైంది. కాగా, అనంతరం జరిగిన మ్యాచ్ లో సోమ్ దేవ్ దేవ్ బర్మన్ తన దైన శైలిలో రెచ్చిపోయాడు. ప్రపంచ 40 వ ర్యాంక్ ఆటగాడు వెస్లీని వరుస సెట్లలో మట్టికరిపించి స్కోరును 1-1 గా సమం చేశాడు.

 

ఈ మ్యాచ్ లో ఘన విజయం  సాధించడం పట్ల  సోమ్ దేవ్ హర్షం వ్యక్తం చేశాడు.  'నేను అత్యుత్తమ సర్వీసులతో ఆకట్టుకున్నా. నా కెరీయర్ లో చేసిన ఉత్తమ సర్వీసుల్లో ఇది కూడా ఒకటి. నా ఆటతీరుకు నిబంధనలు కూడా బాగా అనుకూలించాయి. తొలుత కాస్త అలసటకు గురైనా.. తరువాత బాగా ఆడి మ్యాచ్ ను గెలుచుకున్నా. నా విజయంలో 75 శాతం పాయింట్లు సర్వీసుల ద్వారానే రావడం నిజంగా సంతోషంగా ఉంది' అని సోమ్ దేవ్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement