భారత్‌ అన్నీ గెలిచింది! | India Won All Matches In Junior Davis Cup Against Indonesia | Sakshi
Sakshi News home page

3-0 తేడాతో ఇండోనేసియాపై భారత్‌ గెలుపు

Published Wed, Apr 10 2019 8:43 AM | Last Updated on Wed, Apr 10 2019 8:43 AM

India Won All Matches In Junior Davis Cup Against Indonesia - Sakshi

బ్యాంకాక్‌ : జూనియర్‌ డేవిస్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నీలో మొదట న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన భారత్‌ వెంటనే కోలుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 3–0తో ఇండోనేసియాపై క్లీన్‌స్వీప్‌ చేసింది. అజయ్‌ మలిక్‌ సింగిల్స్, డబుల్స్‌ మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. ఆసియా ఓసియానియా ఫైనల్‌ క్వాలిఫయింగ్‌ పోరులో మొదట సింగిల్స్‌ ఆడిన అజయ్‌ 6–4, 6–2తో మో గునవన్‌ త్రిస్మువంతరను కంగుతినిపించాడు. రెండో సింగిల్స్‌లో సుశాంత్‌ దబస్‌ 6–0, 6–0తో నౌవల్డొ జతి అగత్రపై గెలిచి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. నామమాత్రమైన డబుల్స్‌లో అజయ్‌–దివేశ్‌ గెహ్లాట్‌ జోడీ 6–7 (6/8), 6–2, 10–4తో నౌవల్డొ అగత్ర–లక్కీ కెండ్ర కుర్నివాన్‌ జంటపై గెలిచింది. తదుపరి మ్యాచ్‌లో భారత్‌... ఆసియా ఓసియానియా గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో తలపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement