బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో G20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకరర్‌పై ప్రశంసలు కురిపించారు. భారత్, ఇండోనేషియా మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ దృశ్యం చోటుచేసుకుంది.
ఇండోనేషియా క్షుడు జైశంకర్ తనను తాను పరిచేయం చేసుకున్నారు. ఈ క్రమంలో సుబియాంటో కరచాలనం చేస్తూ ‘నువ్వు నాకు తెలుసు, నువ్వు చాలా ఫేమస్’ అంటూ పేర్కొన్నారు. దీంతో అక్కడున్న మోదీ వారి వైపు చూస్తూ చిరునవ్వులు చిందించారు.
మరోవైపు ఇండోనేషియా అధ్యక్షుడితో జరిగిన భేటీలో ప్రధాని మోదీ వాణిజ్యం, వాణిజ్యం, ఆరోగ్యం, భద్రత వంటి రంగాల్లో సహకారంపై చర్చించారు. ఇండోనేషియా అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో ఎన్నికైన తర్వాత ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి.
"I know you, you are very famous", Indonesia Prez Prabowo tells EAM Dr S Jaishankar after the latter introduces himself.
Location : Ahead of PM Modi, Indonesia Prez Prabowo bilateral at Brazil G20 summit
Vdo Source: Indonesia Govt pic.twitter.com/fqXb3ZeA86— Sidhant Sibal (@sidhant) November 19, 2024
కాగా మంగళవారం జరిగిన జీ 20 సదస్సులో భాగంగా చైనా విదేశాంగమంత్రి మంత్రి వాంగ్ యితో జైశంకర్ చర్చలు జరిపారు. భారత్, చైనా మధ్య నేరుగా విమానాలు నడపాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. కైలాష్ మానస్ సరోవర్ యాత్రను కూడా..తిరిగి ప్రారంభించాలని ఇరుదేశాల ప్రతిపాదించాయి. తూర్పు లద్దాఖ్‌లోని డెమ్‌చోక్ సెక్టార్‌లో భారత బలగాల పెట్రోలింగ్ ప్రారంభం తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన మొదటి ఉన్నత స్థాయి సమావేశం.
Comments
Please login to add a commentAdd a comment