ఢిల్లీ: ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో(Prabowo Subianto) శనివారం భారత్‌కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ (PM Modi) ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో సమావేశం అయ్యారు. రాజకీయ భద్రత, రక్షణ, వాణిజ్య సహకారం, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో నాలుగో వ్యక్తి.
భారత్, ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. సముద్ర భద్రత, సైబర్ భద్రత, ఉగ్రవాద నిరోధం, తీవ్రవాద నిర్మూలన రంగాలలో సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. సమావేశం అనంతరం ఇరుదేశాల నేతలు మీడియాతో మాట్లాడారు.
భారత్‌కు ఇండోనేషియా కీలక భాగస్వామి అన్న మోదీ.. 10 సభ్య దేశాలు కలిగిన ఆసియాన్‌తో పాటు ఇండో పసిఫిక్ కూటమిలో ఇండోనేషియాకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ఇండోనేషియా కూడా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు సుబియాంటో అన్నారు. ఫిన్‌టెక్, ఏఐ, ఐవోటీ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: Republic Day 2025: 942 మందికి శౌర్య పురస్కారాలు
Comments
Please login to add a commentAdd a comment