Sania Mirza and Shoaib Malik to host a talk show together - Sakshi
Sakshi News home page

Sania-Shoaib Malik: టీవీ షో కోసం విడాకుల డ్రామా.. జనాల్ని ఫూల్స్‌ చేశారా..?

Published Mon, Nov 14 2022 4:22 PM | Last Updated on Tue, Nov 15 2022 10:46 AM

Sania Mirza, Shoaib Malik To Host Talk Show Together - Sakshi

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌.. తమ దాంపత్య జీవితానికి పుల్‌స్టాప్‌ పెట్టనున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. పాక్‌ మోడల్‌ అయేషా ఒమర్‌తో షోయబ్‌ సీక్రెట్‌ రిలేషన్‌ మెయిన్‌టైన్‌ చేస్తున్న విషయం సానియాకు తెలిసిపోవడమే, వారి పెళ్లి పెటాకులు కావడానికి కారణమైందని నెట్టింట రకరకాల కథనాలు ప్రచారమయ్యాయి.

ఇటీవలి కాలంలో సానియా ఇన్‌స్టాలో పెట్టిన కొన్ని పోస్ట్‌లు, షోయబ్‌ మేనేజర్‌ విడాకుల విషయాన్ని దృవీకరించాడని వచ్చిన వార్తలు, మీర్జా-మాలిక్‌ వివాహ బంధానికి తెరపడినట్లు జరిగిన ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. విడాకుల విషయమై మీర్జా-మాలిక్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేకపోవడంతో ఈ వార్తల్లో నిజం లేకపోలేదేమోనని ఇప్పుడిప్పుడే వారిరువురి ఫ్యాన్స్‌ ఓ కన్ఫర్మేషన్‌కు వస్తున్నారు.

అయితే, ఇంతలోనే మీర్జా-మాలిక్‌ గురించిన ఓ వార్త అభిమానులను కన్ఫ్యూజింగ్‌ స్టేట్‌లోకి నెట్టేసింది. మీర్జా-మాలిక్‌ ఇద్దరూ కలిసి ఓ టీవీ షో చేస్తున్నారని ఊర్దూఫ్లిక్స్ అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రకటించింది. ఈ షో.. 'ది మీర్జా మాలిక్‌ షో' గా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఊర్దూఫ్లిక్స్ తమ అధికారిక ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఈ వార్త తెలిసి అభిమానులు తలలు గోక్కుంటున్నారు. అసలు వీరి విడాకులు వార్త నిజమేనా లేక షో ప్రమోషన్‌లో భాగంగా జనాలను ఫూల్స్‌ చేశారా అన్న డైలమాలో ఉన్నారు.

కొందరేమో.. ఈ షో వారిద్దరికీ చెడక ముందే ప్లాన్‌ చేసిందని, మీర్జా-మాలిక్‌ల వివాహ బంధానికి పుల్‌స్టాప్‌ పడిన వార్త నిజమేనని అనుకుంటున్నారు. కాగా, 2010లో ప్రేమ వివాహం చేసుకున్న సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌ దంపతులకు 2018లో ఇజాన్ మీర్జా అనే బిడ్డ పుట్టాడు. ఇద్దరు తమతమ కెరీర్‌లతో బిజీగా ఉండటంతో సానియా ఇండియాలో, షోయబ్‌ పాక్‌లో ఉంటున్నారు. 
చదవండి: Sania Mirza: సానియా మీర్జాతో విభేదాలు!? నటితో షోయబ్‌ మాలిక్‌ ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement