Indian tennis star
-
Sania-Shoaib Malik: టీవీ షో కోసం విడాకుల డ్రామా.. జనాల్ని ఫూల్స్ చేశారా..?
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. తమ దాంపత్య జీవితానికి పుల్‌స్టాప్ పెట్టనున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. పాక్ మోడల్ అయేషా ఒమర్‌తో షోయబ్ సీక్రెట్ రిలేషన్ మెయిన్టైన్ చేస్తున్న విషయం సానియాకు తెలిసిపోవడమే, వారి పెళ్లి పెటాకులు కావడానికి కారణమైందని నెట్టింట రకరకాల కథనాలు ప్రచారమయ్యాయి. View this post on Instagram A post shared by UrduFlix (@urduflixofficial) ఇటీవలి కాలంలో సానియా ఇన్‌స్టాలో పెట్టిన కొన్ని పోస్ట్‌లు, షోయబ్ మేనేజర్ విడాకుల విషయాన్ని దృవీకరించాడని వచ్చిన వార్తలు, మీర్జా-మాలిక్ వివాహ బంధానికి తెరపడినట్లు జరిగిన ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. విడాకుల విషయమై మీర్జా-మాలిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఈ వార్తల్లో నిజం లేకపోలేదేమోనని ఇప్పుడిప్పుడే వారిరువురి ఫ్యాన్స్ ఓ కన్ఫర్మేషన్కు వస్తున్నారు. View this post on Instagram A post shared by Ayesha Omar (@ayesha.m.omar) అయితే, ఇంతలోనే మీర్జా-మాలిక్ గురించిన ఓ వార్త అభిమానులను కన్ఫ్యూజింగ్ స్టేట్లోకి నెట్టేసింది. మీర్జా-మాలిక్ ఇద్దరూ కలిసి ఓ టీవీ షో చేస్తున్నారని ఊర్దూఫ్లిక్స్ అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రకటించింది. ఈ షో.. 'ది మీర్జా మాలిక్ షో' గా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఊర్దూఫ్లిక్స్ తమ అధికారిక ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వార్త తెలిసి అభిమానులు తలలు గోక్కుంటున్నారు. అసలు వీరి విడాకులు వార్త నిజమేనా లేక షో ప్రమోషన్లో భాగంగా జనాలను ఫూల్స్ చేశారా అన్న డైలమాలో ఉన్నారు. కొందరేమో.. ఈ షో వారిద్దరికీ చెడక ముందే ప్లాన్ చేసిందని, మీర్జా-మాలిక్‌ల వివాహ బంధానికి పుల్‌స్టాప్ పడిన వార్త నిజమేనని అనుకుంటున్నారు. కాగా, 2010లో ప్రేమ వివాహం చేసుకున్న సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంపతులకు 2018లో ఇజాన్ మీర్జా అనే బిడ్డ పుట్టాడు. ఇద్దరు తమతమ కెరీర్లతో బిజీగా ఉండటంతో సానియా ఇండియాలో, షోయబ్ పాక్‌లో ఉంటున్నారు. చదవండి: Sania Mirza: సానియా మీర్జాతో విభేదాలు!? నటితో షోయబ్ మాలిక్ ఫొటోలు వైరల్ -
సానియా బయోపిక్
సాక్షి, హైదరాబాద్: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా జీవిత చరిత్ర సినిమాగా రానుంది. ఈ మేరకు ఒప్పందంపై సంతకం చేశానని ఆమె ప్రకటించింది. బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా దీనిని రూపొందిస్తారు. ‘కొంత కాలంగా బయోపిక్‌పై చర్చలు నడుస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ముందుకెళ్లడంపై దృష్టిపెట్టాం. ఇందుకు నేనిచ్చే ఇన్‌పుట్సే కీలకం. దర్శకుడు, నటీనటుల వివరాలు త్వరలో తెలుస్తాయి’ అని సానియా పేర్కొంది. అథ్లెట్ మిల్కా సింగ్, బాక్సర్ మేరీకోమ్, క్రికెటర్ ధోనిల బయోపిక్‌ల సరసన సానియా బయోపిక్ నిలవనుంది. -
పేస్ పునరాగమనం
న్యూఢిల్లీ: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌కు డేవిస్ కప్ జట్టులో చోటు దక్కింది. ఏప్రిల్ 6, 7 తేదీల్లో చైనాతో జరిగే పోరు కోసం అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐ టీఏ) ఆదివారం జట్టును ప్రకటించింది. ఇందులో 44 ఏళ్ల పేస్‌తో పాటు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్, సుమిత్ నాగల్, రోహన్ బోపన్నలు ఉన్నారు. దివిజ్ శరణ్ రిజర్వ్ సభ్యుడిగా ఉంటాడు. గత ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరుకు పేస్‌ను పక్కన పెట్టారు. అయితే ఇటీవలే దుబాయ్ ఓపెన్‌లో పేస్ రన్నరప్‌గా నిలిచి డబుల్స్ ర్యాంకుల్లో మళ్లీ టాప్–50లో చోటు దక్కించుకున్నాడు. ‘రోహన్ బోపన్నకు పేస్‌తో జతకట్టడం ఇష్టం లేదు. అవసరమైతే అతను చైనాతో జరిగే మ్యాచ్ నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి సెలక్షన్ కమిటీ చైర్మన్‌కు లేఖ రాశారు. అయితే భూపతి లేఖను, బోపన్న విజ్ఞప్తిని సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. ‘బోపన్న ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్నాడు. అలాంటి వ్యక్తి సొంత విషయాల కోసం దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి వెనుకాడితే ఏఐటీఏ ఆ ఆటగాడిని ప్రోత్సహిం చదు. ఏడాదిలో రెండు లేదా మూడుసార్లు దేశం కోసం ఆడే అవకాశం లభిస్తుంది. అన్ని విషయాలను పక్కనబెట్టి రెండువారాల పాటు దేశం కోసం కలిసి ఆడలేరా? కెప్టెన్ భూపతి అభిప్రాయం ప్రకారం వారిద్దరి మధ్య (పేస్, బోపన్న) సఖ్యత లేదు. ఈ విషయంలో బోపన్నను ఒప్పించే బాధ్యత పేస్‌దే. అతను మాత్రమే ఈ పని చేయగలడు’ అని ఏఐటీఏ అధికారి వివరించారు. మరో మ్యాచ్ గెలిస్తే పేస్ డేవిస్‌కప్‌లో అత్యధిక డబుల్స్ మ్యాచ్‌లు నెగ్గిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. భారత జట్టులోకి తిరిగి రావడం ఆనందంగా ఉంది. కొంత కాలంగా బాగా శ్రమిస్తూ ర్యాంక్ మెరుగు పరుచుకున్నా. బోపన్నతో కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నా. ఓ ఆటగాడిగా బోపన్న ప్రతిభను గౌరవి స్తాను. మేమిద్దరం కలిసి మంచి ప్రదర్శన చేస్తాం. -
ప్రెసిడెంట్స్ కప్ టోర్నీలో సాకేత్ శుభారంభం
గాయం కారణంగా ఆరు నెలలపాటు ఆటకు దూరంగా ఉన్న భారత టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని పునరాగమనంలో సత్తా చాటుకున్నాడు. కజకిస్తాన్‌లోని అస్తానాలో జరుగుతున్న ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఈ హైదరాబాద్ ప్లేయర్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో సాకేత్ 6–3, 7–6 (7/4)తో గ్రిగోరి లొమాకిన్ (కజకిస్తాన్)పై గెలిచాడు. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. -
అన్ని రంగాల్లో దూసుకెళ్లాలి
చెన్నై : పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లాలని టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ స్టార్ కోయంబత్తూరులో ప్రత్యక్షమయ్యారు. వర్ణం ఫౌండేషన్ నేతృత్వంలో మై ఇండియా, వంద శాతం ఓటింగ్ నినాదంతో మారథాన్‌ను కోయంబత్తూరులో నిర్వహించారు. కోయంబత్తూరు కొడిసియా మైదానం నుంచి సాగిన ఈ మారథాన్‌కు వేలాది మంది తరలి వచ్చారు. విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం సమయంలో హఠాత్తుగా అక్కడ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ప్రత్యక్షం కావడంతో అక్కడి జన సందోహం ఆమెను చూడడానికి ఎగబడ్డారు. విజేతలకు బహుమతులు అందజేసినానంతరం మహిళల్ని ఉద్దేశించి సానియా ప్రసంగించారు. మహిళలకు వ్యాయామం తప్పని సరిగా సూచించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మహిళ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు దూసుకెళ్లాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రేలియా, యూఎస్, వింబుల్డన్ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. డబుల్స్ ఆడేటప్పుడు సహ క్రీడాకారిణిని స్నేహితురాలిగా భావించి, సంపూర్ణ సహకారం అందించిన పక్షంలో విజయం వరించడం ఖాయం అని వ్యాఖ్యానించారు. సంవత్సరంలో ముప్పై వారాలు టెన్నిస్ ఆడుతున్నామని పేర్కొంటూ, యూఎస్ ఓపెన్‌కు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. క్రికెట్‌కు ఇస్తున్నట్టుగా ఇతర క్రీడలకు ప్రాధాన్యత పెరుగుతున్నదని వివరిస్తూ, దేశానికి చెందిన క్రీడాకారులతో డబుల్స్ ఆడడం అన్నది కాలం నిర్ణయిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ శాతం మహిళలు క్రీడా రంగంలో రాణించాలని, ఆ దిశగా తన పయనం సాగుతుండడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. -
సోమ్‌దేవ్ ఓటమి
బ్యాంకాక్ : ఏటీపీ బ్యాంకాక్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ వర్మన్ పరాజయం పాలయ్యాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో సీడ్ సోమ్‌దేవ్ 6-0, 5-7, 3-6 తేడాతో తైపీ ఆటగాడు టి చెన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్లో పూర్తి ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ మిగతా రెండు సెట్లను ప్రత్యర్థికి సమర్పించుకున్నాడు. దీంతో ఈ ఈవెంట్లో భారత్ పోరాటం ముగిసినట్టయ్యింది. డబుల్స్ తొలి రౌండ్లోనే సోమ్‌దేవ్, జిమ్మీ వాంగ్ (తైపీ) జోడి వెనుదిరిగింది. -
ఫైనల్లో సానియా-హింగిస్ జంట
లండన్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్లో తొలిసారి మహిళల డబుల్స్ విభాగంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేందుకు మరో విజయం దూరంలో నిలిచింది. వింబుల్డన్‌లో సానియా తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-1, 6-2తో రాకెల్ కాప్స్ జోన్స్-అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా) జంటపై కేవలం 56 నిమిషాల్లో గెలిచింది. శనివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ ఎలీనా వెస్నినా-ఎకతెరీనా మకరోవా (రష్యా) జోడీతో సానియా జంట తలపడుతుంది. సానియా గెలిచిన మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో వచ్చాయి. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో పేస్-హింగిస్ జోడీ 6-3, 6-4తో మైక్ బ్రయాన్-బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) జంటపై గెలిచింది. -
సానియా, పేస్ జోడీల ఓటమి
ఎగాన్ అంతర్జాతీయ టోర్నీ ఈస్ట్బౌర్నీ (యూకే): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడికి... ఎగాన్ అంతర్జాతీయ టోర్నీలో చుక్కెదురైంది. మహిళల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో మూడోసీడ్ సానియా-బ్లాక్ 1-6, 6-3, 7-10తో అన్‌సీడ్ హో చింగ్ చాన్-యంగ్ జాన్ చాన్ (తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూశారు. తొలిసెట్లో వెనుకబడిన సానియా ద్వయం రెండో సెట్లో ఆకట్టుకుంది. కానీ నిర్ణయాత్మక మూడో సెట్లో మళ్లీ తడబడటంతో ఓటమి తప్పలేదు. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో రెండోసీడ్ లియాండర్ పేస్-ఐజాముల్ ఖురేషి (పాకిస్థాన్) 3-6, 4-6తో ట్రీట్ హుయే (ఫిలిప్పిన్స్)-డొమినిక్ ఇంగ్లాంట్ (బ్రిటన్)ల చేతిలో ఓటమిపాలయ్యారు