
సాక్షి, హైదరాబాద్: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా జీవిత చరిత్ర సినిమాగా రానుంది. ఈ మేరకు ఒప్పందంపై సంతకం చేశానని ఆమె ప్రకటించింది. బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా దీనిని రూపొందిస్తారు. ‘కొంత కాలంగా బయోపిక్‌పై చర్చలు నడుస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ముందుకెళ్లడంపై దృష్టిపెట్టాం. ఇందుకు నేనిచ్చే ఇన్‌పుట్సే కీలకం. దర్శకుడు, నటీనటుల వివరాలు త్వరలో తెలుస్తాయి’ అని సానియా పేర్కొంది. అథ్లెట్ మిల్కా సింగ్, బాక్సర్ మేరీకోమ్, క్రికెటర్ ధోనిల బయోపిక్‌ల సరసన సానియా బయోపిక్ నిలవనుంది.
Comments
Please login to add a commentAdd a comment