సానియా, పేస్ జోడీల ఓటమి | Sania -Paes loss the match | Sakshi
Sakshi News home page

సానియా, పేస్ జోడీల ఓటమి

Published Sat, Jun 21 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

Sania -Paes  loss the match

ఎగాన్ అంతర్జాతీయ టోర్నీ
 
 ఈస్ట్‌బౌర్నీ (యూకే): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడికి... ఎగాన్ అంతర్జాతీయ టోర్నీలో చుక్కెదురైంది. మహిళల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో మూడోసీడ్ సానియా-బ్లాక్ 1-6, 6-3, 7-10తో అన్‌సీడ్ హో చింగ్ చాన్-యంగ్ జాన్ చాన్ (తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూశారు. తొలిసెట్‌లో వెనుకబడిన సానియా ద్వయం రెండో సెట్‌లో ఆకట్టుకుంది. కానీ నిర్ణయాత్మక మూడో సెట్‌లో మళ్లీ తడబడటంతో ఓటమి తప్పలేదు. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో రెండోసీడ్ లియాండర్ పేస్-ఐజాముల్ ఖురేషి (పాకిస్థాన్) 3-6, 4-6తో ట్రీట్ హుయే (ఫిలిప్పిన్స్)-డొమినిక్ ఇంగ్లాంట్ (బ్రిటన్)ల చేతిలో ఓటమిపాలయ్యారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement