
ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్,బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకురాలు కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన వినోదాత్మక వ్లాగ్‌లకూ పేరొందారు. ఇక మాజీ టెన్నిస్ ప్లేయర్ హైదరాబాదీ సానియా మీర్జా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా సన్నిహితులైన వీరిద్దరూ ఇటీవలే ఫరాఖాన్ ఇంటిలో కలిశారు. ఆమెతో పాటు ఆమె సోదరి అనమ్ మీర్జా కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సానియా మీర్జా ఫరాతో కలిసి కిచెన్‌లో సందడి చేశారు. ఆమెతో పాటు వంట సెషన్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సానియా క్లాసిక్ హైదరాబాదీ–శైలి చికెన్ 65 వంటకాన్ని తయారు చేశారు, అదనపు సాస్‌లతో తన స్వంత సృజనాత్మక ట్విస్ట్‌ను ఫరా దానికి జోడించింది. ఇలా కిచెన్ లో వంటలో దినుసులు కలపడంతో పాటు హాస్యం పంచడంలో కూడా ఇద్దరు స్నేహితులు పోటీ పడడంతో ఈ ఎపిసోడ్ అంతా నవ్వులు, సరదాలతో నిండిపోయింది. సానియా ప్రతిభ టెన్నిస్ కోర్ట్‌కు మించి విస్తరించిందో లేదో చూడండి అంటూ ఫరా తన యూట్యూబ్ ఛానెల్‌లో తమ కిచెన్‌లో షూట్ చేసిన వీడియోను పంచుకుంది.
తద్వారా వీక్షకులకు నిజమైన హైదరాబాదీ చికెన్ 65 రెసిపీని నేర్చుకునే అవకాశాన్ని కూడా వీరు అందించారు, ఇది ఏ సందర్భానికైనా సరిపోయే క్రిస్పీ ఫ్లేవర్‌ఫుల్ డిష్ గా వర్ణించారు. ఇదంతా ఒకెత్తయితే... ఈ సందర్భంగా ఫరా చూపిన హాస్య చతురత వీక్షుకులకు నవ్వుల్ని పంచింది. హాస్య స్వభావానికి పేరొందిన ఫరా... సానియా కుమారుడిని ముద్దు పెట్టమని ఉల్లాసంగా అడిగే విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. తన ఇంట్లో ఫుట్‌బాల్ ఆడుకుంటున్న ఆ కుర్రాడి నుంచి బంతిని తీసుకున్న ఫరా, ఇజాన్ తన బంతిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ‘‘నీ నుంచి కొన్ని బ్రౌనీ పాయింట్లు సంపాదించడానికి నేను మీకు బంతిని తిరిగి ఇవ్వవలసి ఉంది‘ అని చెప్పారు. బంతిని ఇవ్వాలంటే ఓ షరతు కూడా విధించారు. అదేమిటంటే... ‘‘మొదట నన్ను నువ్వు ముద్దు పెట్టుకోవాలి, అదెలాగో నీకు తెలుసు. కమాన్... ముద్దివ్వండి ఉదిత్ జీలా ’’ అంటూ ఆ బాలుడ్ని అడగడం నవ్వుల్తో ముంచెత్తింది. ఈ వీడియోను చూసిన నెటిజనులు కూడా ఫరా హాస్య చతురతను కొనియాడుతున్నారు.
ఇటీవల ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ ముద్దు ఉదంతం నెట్టింట సంచలనం సృష్టించింది. ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న ఉదిత్ నారాయణ్... తన పాటలతో అభిమానుల్ని ఉర్రూతలూగించారు. అదే జోరులో ఆయన టిప్ టిప్ బర్సా పానీ పాట పాడుతూండగా పలువురు అభిమానులు ఆయన వేదికకు బాగా దగ్గరగా వచ్చేశారు. అలా పాట పాడుతూనే వేదిక మీద నుంచే ఒక అభిమానికి ఉదిత్ దగ్గరగా జరిగినప్పుడు ఆ యువతి ఆయనకు బుగ్గ మీద ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఆయన ఏకంగా ఆమె పెదాల మీదే ముద్దు పెట్టేశారు. దీంతో ఈ ఉదంతం నెట్టింట ఉదిత్‌పై తీవ్ర విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తడానికి దారి తీసింది. ఈ నేపధ్యంలోనే ఫరా... సానియా మీర్జా కుమారుడితో ‘‘నాకు ముద్దివ్వు ఉదిత్ జీ అవ్వు.. అంటూ అనడం నెటిజన్లను ఆకర్షించింది.
Comments
Please login to add a commentAdd a comment