అంబులెన్స్ తో ఉడాయించిన మహిళ | Ohio Woman Steals Ambulance To reach Home After She Misses Bus | Sakshi
Sakshi News home page

అంబులెన్స్ తో ఉడాయించిన మహిళ

Published Sat, Aug 20 2016 10:05 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

అంబులెన్స్ తో ఉడాయించిన మహిళ

అంబులెన్స్ తో ఉడాయించిన మహిళ

సిన్సినాటి: ఇంటికి వెళ్లేందుకు బయలుదేరిన మహిళ.. చివరి బస్సు కూడా వెళ్లిపోవడంతో అంబులెన్స్ తో ఉడాయించిన ఘటన అమెరికాలోని ఒహియ రాష్ట్రంలో చోటు చేసుకుంది. స్ప్రింగ్​ఫీల్డ్ టౌన్షిప్ పాంతానికి చెందిన లిసా కార్(43) అనే మహిళ ఈ పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. సిన్సినాటి సబర్బన్ లోని ఇంటికి వెళ్లేందుకు బస్సు లేకపోవడంతో ఆమె అంబులెన్స్ ఎత్తుకుపోయిందని హమిల్టన్ మున్సిపల్ కోర్టుకు సమర్పించిన నివేదికలో పోలీసులు పేర్కొన్నారు.

అంబులెన్స్ ను ఆస్పత్రి ముందు నిలిపి రోగితో పాటు డ్రైవర్ లోనికి వెళ్లినప్పుడు ఆమె ఈ పని చేసింది. ఆమెపై దొంగతనం, పోలీసులకు ఫిర్యాదు చేయడంలో విఫలమయిందనే ఆరోపణలతో అభియోగాలు నమోదు చేశారు. లిసా కార్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశముంది. రాత్రిపూట ఇంటికి వెళ్లేందుకు ఆఖరి బస్సు కూడా వెళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియక అంబులెన్స్ ఎత్తుకుపోయానని నిందితురాలు చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement