Steals Ambulance
-
షాకింగ్.. ఆస్పత్రి నుంచి అంబులెన్స్ దొంగిలించిన బాలుడు
తిరువనంతపురం: కేరళ త్రిస్సూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. 13 ఏళ్ల బాలుడు ఆస్పత్రి నుంచి అంబులెన్స్ దొంగిలించాడు. అనంతరం దాన్ని 8 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. చివరకు ఎలాగోలా పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకుని ఆపారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఏం జరిగిందంటే..? పదో తరగతి చదువుతున్న ఈ బాలుడు జ్వరం రావడంతో త్రిస్సూర్ జనరల్ హాస్పిటల్లో చేరాడు. వారం రోజులుగా ఇక్కడే చికిత్స పొందుతున్నాడు. ఇతని తండ్రి కూడా ఈ ఆస్పత్రిలోనే పని చేస్తున్నాడు. అయితే మంగళవారం ఆస్పత్రి బయట అంబులెన్స్ ఆగి ఉంది. డ్రైవర్ నీళ్ల కోసం వెళ్తూ తాళం వేయలేదు. ఇది గమనించిన బాలుడు క్షణాల్లో అంబులెన్సులోకి వెళ్లి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. అనంతరం దాన్ని స్టార్ట్ చేసి ఎంచక్కా డ్రైవ్ చేసుకుంటూ 8 కిలోమీటర్లు ప్రయాణించాడు. అంబులెన్స్ డ్రైవర్ సీట్లో బాలుడ్ని చూసిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు రంగంలోకి అంబులెన్సును వెంబడించి ఎలాగోలా ఆపారు. మరోవైపు అంబులెన్స్ డ్రైవర్ తన వాహనాన్ని ఎవరో దొంగిలించారని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టాడు. చదవండి: శ్రద్ధ వాకర్ తరహా ఘటన..తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కుమారుడు -
అంబులెన్స్ తో ఉడాయించిన మహిళ
సిన్సినాటి: ఇంటికి వెళ్లేందుకు బయలుదేరిన మహిళ.. చివరి బస్సు కూడా వెళ్లిపోవడంతో అంబులెన్స్ తో ఉడాయించిన ఘటన అమెరికాలోని ఒహియ రాష్ట్రంలో చోటు చేసుకుంది. స్ప్రింగ్ఫీల్డ్ టౌన్షిప్ పాంతానికి చెందిన లిసా కార్(43) అనే మహిళ ఈ పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. సిన్సినాటి సబర్బన్ లోని ఇంటికి వెళ్లేందుకు బస్సు లేకపోవడంతో ఆమె అంబులెన్స్ ఎత్తుకుపోయిందని హమిల్టన్ మున్సిపల్ కోర్టుకు సమర్పించిన నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. అంబులెన్స్ ను ఆస్పత్రి ముందు నిలిపి రోగితో పాటు డ్రైవర్ లోనికి వెళ్లినప్పుడు ఆమె ఈ పని చేసింది. ఆమెపై దొంగతనం, పోలీసులకు ఫిర్యాదు చేయడంలో విఫలమయిందనే ఆరోపణలతో అభియోగాలు నమోదు చేశారు. లిసా కార్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశముంది. రాత్రిపూట ఇంటికి వెళ్లేందుకు ఆఖరి బస్సు కూడా వెళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియక అంబులెన్స్ ఎత్తుకుపోయానని నిందితురాలు చెప్పింది.