అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడు మృతి | A Man From Andhra Pradesh Among 3 Killed In US Bank Shooting | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 7 2018 10:11 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

A Man From Andhra Pradesh Among 3 Killed In US Bank Shooting - Sakshi

ఘటనా స్థలంలో పోలీసులు, పృథ్విరాజ్‌(ఇన్‌సెట్‌లో)

న్యూయార్క్‌: అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. ఓ దుండగుడు  విచక్షణారహితంగా  కాల్పులు జరపడంతో నలుగురు ఆక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో ఒకరు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్విరాజ్‌(25)గా గుర్తించారు. ఈ ఘటన సిన్సినాటిలోని వాల్‌నట్‌ స్ట్రీట్‌లోని బ్యాంక్‌లో చోటుచేసుకుంది. మృతి చెందిన పృథ్వీరాజ్‌ బ్యాంక్‌ ఉద్యోగిగా తెలిసింది. కాల్పులుకు పాల్పడిన ఒమర్‌ పెరాజ్‌ను పోలీసులు మట్టుపెట్టారు. 

స్పందించిన విదేశాంగ కార్యాలయం
అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన వారిలో గుంటూరుకు చెందిన పృథ్వీరాజ్‌ అని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే న్యూయార్క్‌ పోలీసులను సంప్రదించామని, పృథ్వీరాజ్‌ మృతదేహాన్ని భారత్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు.  


ఘటనా స్థలం.. కాల్పులు జరిపిన దుండగుడు(ఇన్‌సెట్‌లో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement