రేప్ కేసులో భారత విద్యార్థి అరెస్ట్ | Indian student accused of rape in New York state university | Sakshi
Sakshi News home page

రేప్ కేసులో భారత విద్యార్థి అరెస్ట్

Published Tue, Feb 24 2015 7:59 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Indian student accused of rape in New York state university

న్యూయార్క్:అమెరికాలో అత్యాచారం కేసుకు సంబంధించి ఓ భారతీయ విద్యార్థిని అరెస్ట్ చేశారు.  ఒస్వేగోలోని న్యూయార్ స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్న ఢిల్లీకి చెందిన అభయ్ పాంట్ అనే విద్యార్థి , మరో స్థానిక విద్యార్థితో కలిసి ఓ యువతి గదిలోకి ప్రవేశించి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.  దీనిపై ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అభయ్ ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

 

గతవారం వేకువజాము ప్రాంతంలో పక్క గదిలో ఉంటున్న యువతి ఇంట్లోకి ప్రవేశించిన వారు ఆమెను లైంగికంగా వేధించినట్లు పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ జులీ బ్లిసెర్ట్ తెలిపారు. అతన్ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్ కు తరలించినట్లు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement