ఓ వ్యక్తి కరుడుగట్టిన నేరస్తుడి మాదిరిగా దారుణమైన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అంటరానివాడిలా ఒక ప్రత్యేక భద్రతతో కూడిన సెల్‌లో ఉన్నారు. అతడికి ఆహారం సైతం ఓ రంధ్రం గుండా పంపిస్తారు జైలు అధికారులు. కానీ అతడి నేరాల చరిత్ర వింటే..నేరస్తుడా లేదా నిరపరాధిల పాలిట రక్షకుడా అన్న ఫీలింగ్ వస్తుంది. లేక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో చట్టాన్ని చేతిల్లోకి తీసుకుని దుర్మార్గులని దునుమాడిన మహోన్నత వ్యక్తి ఏమో..! అనే భావన కలుగుతుంది. పైగా బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం ఒంటిరిగా నిర్భంధంలో ఉన్న ఖైదీగా నిలిచిపోయాడు. అతడెవరంటే..
బ్రిటన్‌లో అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నాడు రాబర్ట్ మాడ్స్లీ. ప్రస్తుతం అతడు వేక్‌ఫీల్డ్ జైలులో ఉన్నాడు.అతని జైలు గది 18 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉండి, 17 ఉక్కు తలుపుల వెనుక ఉంటుంది.ఈ గది కాల్పులు తట్టుకునేంత దృఢంగా ఉంటుంది.“ఇన్‌సైడ్ వేక్‌ఫీల్డ్ ప్రిజన్” అనే పుస్తకంలో జోనాథన్ లెవి, ఎమ్మా ఫ్రెంచ్‌లు రాసినట్లుగా, మాడ్స్లీ జైలు గదిలోని టేబుల్, కుర్చీలు కార్డ్‌బోర్డ్‌తో తయారు చేశారు.టాయిలెట్, సింక్ నేలకు బిగించబడి ఉంటుంది. అతనికి అందించే భోజనం కూడా ఒక చిన్న రంధ్రం గుండా పంపిస్తారు. నిజానికి మాడ్సీ 21 ఏళ్ల వయసు నుంచి జైలు జీవితం గడుపుతున్నాడు. అతడి నేరాలు గురించి తెలుసుకుని విస్తుపోతారు. ఎందుకంటే అతడు ఖైదీనా నిరపరాధుల పాలిట దైవమా..!అనిపిస్తుంది.
చేసిన నేరాలు..
1974లో, చిన్న పిల్లలపై లైంగిక దాడి చేసిన 30 సంవత్సరాల వ్యక్తి జాన్ ఫారెల్‌ని అతను చంపేశాడు.ఆ తర్వాత 1977లో, అతను మరో ఖైదీతో కలిసి, చిన్నపిల్లలపై లైంగిక దాడి నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్న డేవిడ్ ఫ్రాన్సిస్( David Francis )ని చంపేశాడు.వేక్‌ఫీల్డ్ జైలులో కూడా మాడ్స్లీ నేరాలు కొనసాగాయి.1978 జులై 29న, తన భార్యను హత్య చేసిన ఖైదీ సల్నీ డార్‌వడ్‌ని హతమార్చాడు.అంతేకాకుండా, ఏడేళ్ల బాలికపై అత్యాచార చేసిన బిల్ రాబర్ట్స్‌ను కూడా చంపేశాడు.
ఈ హత్యల కారణంగా, అధికారులు మాడ్స్లీని ఇతర ఖైదీలతో కలిపి ఉంచడం చాలా ప్రమాదకరమని భావించారు.ఫలితంగా, 1983లో అతని కోసం ప్రత్యేక అద్దాల గదిని నిర్మించారు. అప్పటి నుంచి, అతను అదే గదిలో ఉన్నాడు. తన జైలు జీవితాన్ని మాడ్స్లీ ఒకసారి నరకంలో బంధించడం లాగా ఉందని వర్ణించాడు. ప్రస్తుతం అతని వయసు 71 సంవత్సరాలు. ఇప్పటికీ అదే జైలులో ఉండడం వల్ల, అతన్ని నేరస్తుడిగా చూడాలా లేక నిరపరాధుల రక్షకుడిగా భావించాలా అనే సందేహం బ్రిటన్ ప్రజల్లో కలుగుతుంటుంది. కనీసం ఇప్పుడైనా మాడ్స్లీ క్షమాభిక్ష పెట్టి స్వేచ్ఛగా జీవించేలా చేస్తే బాగుండనని కొందరూ భావిస్తుండటం విశేషం.
(చదవండి: ఆ ఫోబియాకు పుస్తకాలతో చెక్‌పెట్టి..స్ఫూర్తిగా నిలిచిన ట్రాన్స్‌విమెన్!)
Comments
Please login to add a commentAdd a comment