sho
-
సార్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్!
సాక్షి, సిటీబ్యూరో: ‘సార్...ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. మా ప్రతిభ ఏంటో నిరూపిస్తాం’ అంటున్నారు పలువురు ఇన్స్పెక్టర్లు. ఈ క్రమంలోనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) పోస్టింగ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కార్పొరేట్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎలాగైతే రెజ్యూమ్‌లు సమర్పిస్తారో.. అచ్చం అలాగే పలువురు ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులు ఎస్హెచ్ఓ బాధ్యతల కోసం రాతపూర్వక దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అవినాశ్ మహంతి సైబరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే ఠాణాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలపై నిగ్గు తేలుస్తూ ఇప్పటికే పలువురు అధికారులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కమిషనరేట్‌లోని ప్రతిభావంతులలో ఆశలు చిగురించాయి. సమర్ధత, నిబద్ధతలకే ప్రాధాన్యం.. గతంలో ఇన్స్పెక్టర్లు ఎస్హెచ్ఓ పోస్టు పొందాలంటే మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను ఉన్నతాధికారులకు సమర్పిస్తే తప్ప.. పోస్టింగ్ వచ్చేంది కాదు. హై ప్రొఫైల్ పీఎస్ అయితే డిమాండ్ మారీ ఎక్కువగా ఉండేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అవినీతి అధికారులపై వేటు వేస్తున్నారు. సిఫారసు లేఖలతో వస్తే పోస్టింగ్ సంగతి దేవుడెరుగు.. కార్నర్ అయ్యే పరిస్థితి వచ్చింది. కొత్త పోలీసు బాస్‌ల రాకతో ప్రతిభ, సమర్ధత, విశ్వసనీయత, నిబద్ధతలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ పోస్టింగ్ ఇస్తున్నారు. ఇటీవల శివారు ప్రాంతాల్లోని ఠాణాలకే కాకుండా ప్రధాన నగరంలో డిమాండ్ ఉన్న స్టేషన్లకు సైతం కొత్త వారిని ఎస్‌హెచ్‌ఓలుగా నియమించడమే ఇందుకు ఉదాహరణ. ఈ ఠాణాలకు తొలిసారిగా ఎస్హెచ్ఓలు.. ఇన్స్పెక్టర్గా పదోన్నతి లభించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ కనీసం ఒక్కసారి కూడా ఎస్హెచ్ఓగా పోస్టింగ్ పొందని వారు చాలా మందే ఉన్నారు. పీఎస్‌లో రెండవ ప్రాధాన్య పోస్టు అయిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గానో, క్రైమ్ వింగ్, స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), ఐటీ ఇతరత్రా విభాగాలలో ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజా పరిస్థితులలో వీరందరిలో ఆశలు చిగురించాయి. ఇప్పటివరకు 40–50 మంది ఇన్స్పెక్టర్లు ఎస్హెచ్ఓ పోస్టింగ్ కోసం రాతపూర్వక దరఖాస్తులు సమర్పించినట్లు తెలిసింది. ఇప్పటికే మాదాపూర్, మెకిలా, కేపీహెచ్‌బీ, సనత్‌నగర్, దుండిగల్, శంషాబాద్, జీడిమెట్ల ఠాణాలకు ఎస్హెచ్ఓ పోస్టింగ్ పొందిన ఇన్స్పెక్టర్లు తొలిసారి ఎస్‌హెచ్‌ఓలుగా నియమితులైనవాళ్లే. అలాగే ఆర్జీఐఏ, ఇతర కొన్ని పీఎస్‌లలో రెండవ సారి ఎస్‌హెచ్‌ఓలుగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు నియమితులయ్యారు. త్వరలోనే గచ్చిబౌలి , రాయదుర్గం, నార్సింగి వంటి హైప్రొఫైల్ ఠాణాలకు సైతం కొత్త అధికారులు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. -
యూపీలో దారుణం.. అత్యాచార బాధితురాలిపై పోలీస్ లైంగిక దాడి
ఓవైపు సమాజం, టెక్నాలజీ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే మరోవైపు మహిళలకు రక్షణ సన్నగిల్లుతోంది. మైనర్ బాలికల నుంచి యువతులు, గర్భవతి మహిళలను కూడా కామాంధులు వదిలిపెట్టడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా అత్యాచార బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడి గౌరవమైన పోలీస్ వృత్తికి కళంకం తీసుకువచ్చాడు ఓ ప్రబుద్ధుడు. తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు తెలియజేసి న్యాయం కావాలని కోరిన బాధితురాలిపై పోలీస్ స్టేషన్లోనే ఓ పోలీస్ లైంగికదాడికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. 13 ఏళ్ల అత్యాచార బాధితురాలిపై లలిత్పూర్ జిల్లా పాలి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అఘాత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో స్టేషన్ ఇంఛార్జ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. కేసు వివరాలను లలిత్పూర్ ఎస్పీ నిఖిల్ పతక్ వివరిరంచారు. పాలికి చెందిన నలుగురు యువకులు బలికను మభ్యపెట్టి ఏప్రిల్ 22న బోపాల్ తీసుకెళ్లి మూడు రోజుల పాటు సాముహిక అత్యాచారం చేశారు. అనంతరం బాలికను స్వగ్రామానికి తీసుకొచ్చి పాలి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ తిలక్ధారి సరోజ్‌కు అప్పగించి పరారయ్యారు. చదవండి: భార్యను వదిలి మరో మహిళతో వెళ్లిపోయి.. స్టేషన్ అధికారి బాలిక నుంచి సమాచారం సేకరించి తన బంధువుల మహిళతో కలిపి చైల్డ్ లైన్ సెంటర్‌కు పంపాడు. రెండు రోజుల తర్వాత బాలికను స్టేట్మెంట్ రికార్డు చేయాలనే పేరుతో స్టేషన్‌కు పిలిపించి వేరే గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మళ్లీ బాలికను చైల్డ్‌లైన్ సెంటర్‌కు పంపించాడు. తరువాత కౌన్సెలింగ్ సెషన్లో బాలిక తనకు జరిగిన విషయం చెప్పడంతో చైల్డ్‌లైన్ సిబ్బంది ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పాలి స్టేసన్ ఇంఛార్జ్ సహా ఆరుగురు నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాలు వెల్లడిస్తున్న లలిత్పూర్ ఎస్పీ బాలిక అత్తను కూడా నిందుతురాలిగా చేర్చారు. స్టేషన్ ఇంఛార్జ్ తిలక్‌ధారిని సస్పెండ్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డిఐజి స్థాయి అధికారి కూడా ఈ విషయంపై 24 గంటల్లో నివేదికను కోరారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. చదవండి: వ్యభిచార గృహంపై దాడి: ముగ్గురి అరెస్ట్ -
హైదరాబాద్‌లో తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్.. రాష్ట్రంలో ముగ్గురే!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని శాంతిభద్రతల విభాగం ఠాణాకు తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా ఇన్స్పెక్టర్ కె.మధులత నియమితులయ్యారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని లాలాగూడ పోలీసుస్టేషన్లో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. హోం మంత్రి మహమూద్ అలీ, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కీలక విభాగాల్లో విధులు.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన మధులత 2002లో ఎస్సైగా పోలీసు విభాగంలో అడుగుపెట్టారు. సిద్దిపేట వన్ టౌన్ ఠాణాకు ప్రొబేషనరీ ఎస్సైగా పని చేశారు. అనంతరం సిద్దిపేట రెండో టౌన్, జోగిపేట, ములుగు, సిద్దిపేట రూరల్ శాంతిభద్రల విభాగం ఠాణాలకు ఎస్హెచ్ఓగా పని చేశారు. ఆపై సైబరాబాద్ (ఉమ్మడి) వచ్చిన మధులత నాచారం పోలీసుస్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. 2012లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. సరూర్‌నగర్ మహిళ పోలీసుస్టేషన్లో పాటు ఐటీ కారిడార్ ఉమెన్ పోలీసుస్టేషన్లకు ఇన్స్పెక్టర్గా సేవలు అందించారు. అనంతరం సీఐడీలో రెండున్నరేళ్లు, నగరానికి వచ్చిన తర్వాత దక్షిణ మండలం ఉమెన్ పోలీసుస్టేషన్, స్పెషల్ బ్రాంచ్‌ల్లో పని చేశారు. సైబరాబాద్‌లో అభయ సహా పలు కీలక కేసుల దర్యాప్తులోనూ మధులత కీలకంగా వ్యవహరించారు. అన్ని స్టేషన్లలోనూ ఉండాలి మహిళలు తమ శక్తి ఏమిటో గుర్తించుకోవాలి. వారిపై ఎంతో నమ్మకం ఉంచి హోంమంత్రి, నగర పోలీసు కమిషనర్ మధులతకు ఈ అవకాశమిచ్చారు. ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగి అన్ని పోలీసుస్టేషన్లలో మహిళ ఎస్హెచ్ఓలు ఉండే రోజు వస్తుందని ఎదురు చూద్దాం. – చందన దీప్తి, నార్త్‌జోన్ డీసీపీ పోలీసు శాఖకు మంచి పేరు తేవాలి తొలిసారిగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో శాంతిభద్రతల విభాగం ఠాణాకు మహిళ అధికారిని నియమించాం. మధులత తన పనితీరుతో పోలీసు శాఖకు మంచి పేరు తేవాలి. మరింత మంది మహిళలు పోలీసు విభాగంలోకి రావాలి. – మహమూద్ అలీ, హోమ్ మంత్రి రాష్ట్రంలో ముగ్గురే.. 174 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ కమిషనరేట్‌లో తొలిసారిగా మహిళను స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా నియమించాం. రాష్ట్రంలో 700 పోలీసుస్టేషన్లు ఉండగా ముగ్గురు మాత్రమే మహిళ ఎస్హెచ్ఓ ఉన్నారు. ఇన్స్పెక్టర్ మధులత తన విధులు సమర్థంగా నిర్వహించి రాబోయే మహిళ ఎస్సైలు, ఇన్స్పెక్టర్లకు మార్గదర్శకంగా నిలవాలి. – సీవీ ఆనంద్, కొత్వాల్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఈ బాధ్యతలు సద్వినియోగం చేసుకుని సీపీ నమ్మకాన్ని నిలబెడతా. పురుష అధికారులకు దీటుగా పని చేస్తూ 24/7 అందుబాటులో ఉంటా. మిగిలిన మహిళా అధికారులు, సిబ్బందికి ఆదర్శంగా ఉండేలా పనిచేసి శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటా. – మధులత, లాలాగూడ ఇన్స్పెక్టర్ -
సహాయం కోసం పోలీస్ స్టేషన్‌కెళ్తే.. కాటేశాడు
గుర్గావ్: సహాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళను లైంగికంగా వేధించడమే కాకుండా, వీడియో తీసి బెదిరిస్తున్న పోలీస్ అధికారిని శనివారం గురుగావ్‌లో అరెస్ట్ చేశారు. ఈ సంఘటన చూస్తే కంచే చేను మేసిందన్న సామెత గుర్తుకు వస్తుంది. వివరాలు.. జింద్ జిల్లాలోని ఉద్దానాలో నివసించే మహిళకు 2017లో వివాహమైంది. అనంతరం కొన్ని నెలలకు వైవాహిక బంధంలో విభేదాలు రావడంతో భర్తపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేసన్‌కు వచ్చింది. అదే స్టేషనలో స్టేషన్ హౌన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న దల్బీర్ సింగ్‌తో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో ఇద్దరిది ఒకే జిల్లా కావడంతో కేసు విషయంలో దల్బీర్ సింగ్ బాధితురాలితో తరుచూ మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు గుర్గావ్కి వెళ్లడం కోసం బస్టాండ్‌లో ఎదురు చూస్తున్న బాధితురాలిని తాను డ్రాప్ చేస్తానని నమ్మబలికి కారులో ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారం చేశాడు. మరుసటి రోజుకి తేరుకున్న బాధితురాలు దల్బీర్‌ను నిలదీయడంతో ఆమెను తన క్వార్టర్స్‌కి పిలిపించుకొని సముదాయిస్తూ, మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చాడు. దీంతో అపస్మారక స్థితికి వెళ్లిన ఆమెపై మరోమారు అత్యాచారం చేసి వీడియో తీసాడు. ఆ తర్వాత వీడియో బహిర్గతం చేస్తానని బ్లాక్ మెయిల్‌కి దిగి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో కుమిలి పోయిన బాధితురాలు జరిగిన దారుణాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిస్సహాయురాలై చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన ఒక పోలీసు ఆమెను కాపాడి జరిగిందంతా తెలుసుకుని దల్బీర్‌కు వ్యతిరేకంగా శుక్రవారం ఫిర్యాదు చేయించాడు. దీంతో అంతర్గత విచారణకు ఆదేశించిన పోలీసు ఉన్నతాధికారులు నేరం రుజువవడంతో దల్బీర్‌ను అరెస్ట్ చేశారు. కాగా దల్బీర్ సింగ్ వచ్చే ఏడాది రిటైర్ కానుండడం గమనార్హం. -
సాధ్వీ దీవెనలు.. పోలీసు అధికారిపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : సాధ్వీతో హీలింగ్ చేయించుకుంటూ, దీవెనలు పొందుతున్న ఫొటో వైరల్ కావడంతో పోలీసు అధికారిని బదిలీ చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జనక్‌పురి పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఇందర్ పాల్... సాధ్వీగా పేరొందిన నమితా ఆచార్యను స్టేషన్‌కు పిలిపించారు. ఇందర్‌పాల్ తలపై నమిత ఆచార్య చేయి ఉంచగా.. అతడు సేద తీరుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో కాస్తా వైరల్‌గా మారడంతో.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన పోలీసులే ఇలా ఏకంగా పోలీస్ స్టేషన్లోనే యూనిఫాంలో ఇలా చేయడమేమిటని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఉన్నతాధికారులు.. ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇందర్ పాల్‌ను ఆదేశిచండంతో పాటు విజిలెన్స్ ఎంక్వైరీని కూడా ఏర్పాటు చేశారు. అతడిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తనకు తాను దేవీమాతగా చెప్పుకునే నమితా ఆచార్య ఇదివరకు కూడా పలువురు ప్రభుత్వాధికారుల కార్యాలయాలకు వెళ్లి మరీ హీలింగ్ చేసేవారు. వారిలో ఎక్కువగా ఐపీఎస్ అధికారులే ఉండటం గమనార్హం. -
‘ఇక్కడ లంచాలు కామన్.. 3 లక్షలు ఉంటే చాలు’
మీరట్, ఉత్తరప్రదేశ్ : ప్రభుత్వం, ఉన్నతాధికారుల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తించాడంటూ స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌ను(ఎస్హెచ్ఓ)ను సస్పెండ్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. పరశురామ్ అనే వ్యక్తి బదిలీలో భాగంగా నోయిడాలోని దిబాయ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా నియమితుడయ్యాడు. అయితే ఇలా కోరుకున్న చోట పోస్టింగ్ పొందేందుకు తాను ఉన్నతాధికారులకు లంచం ఇచ్చానంటూ పరశురామ్ చేసిన వాట్సాప్ చాట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ గుర్తు తెలియని వ్యక్తితో చాట్ చేసిన పరశురామ్..‘ భయ్యా ఇది యోగి ప్రభుత్వం. ఇక్కడ లంచాలు ఇవ్వడం, తీసుకోవడం కామన్. నేను కూడా నా ట్రాన్స్ఫర్ కోసం ఏడీజీకి 50 వేల రూపాయలు ఇచ్చానంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా బులంద్‌షహర్ ఎస్ఎస్పీ గురించి చెబుతూ... ‘డబ్బులెవరైనా నేరుగా తీసుకుంటారా చెప్పు. ఆయన కూడా అంతే. నా ట్రాన్స్ఫర్ కోసం ఆయనకు 3 లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సి వచ్చిందంటూ’ పరశురామ్ అవతలి వ్యక్తికి మెసేజ్ పంపించాడు. అవన్నీ అవాస్తవాలు.. పరశురామ్ చాట్ వైరల్ కావడంతో తమపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఉన్నతాధికారులు స్పందించారు. బులంద్‌షహర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ... కేవలం తమ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే పరశురామ్ ఇలా వ్యవహరించాడని తెలిపారు. అధికారులను కేవలం ఒక రేంజ్ నుంచి మరొక రేంజ్‌కు బదిలీ చేసే అధికారం మాత్రమే తనకు ఉంటుందని పేర్కొన్న ఆయన.. పరశురామ్‌ను బదిలీ చేసింది ఐజీ అని తెలిపారు. కాగా పరశురామ్‌ను సస్పెండ్ చేయడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. -
నోర్మూయండీ.. ఆవేశంగా లేచిన రాధేమా!
సంభాల్: వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త రాధేమా(52) (అలియాస్ సుఖ్విందర్ కౌర్) సహనం కోల్పోయింది. విలేకరులు అడిగిన ప్రశ్నలతో ఆమె ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయింది. కల్కిమహోత్సవ్‌లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఆమెను మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరిచేశారు. దీంతో ఆమె సహనం కోల్పోయిన తన సీట్లోంచి లేచారు. నాపై ఎలాంటి ఆరోపణలు లేవు. అలాంటి ప్రశ్నలు నన్నెందుకు అడుగుతున్నారు? అంటూ విరుచుకుపడ్డారు. పక్కనే ఉన్న శిష్యగణం ఆమెను శాంతపరిచి తిరిగి సీట్లో కూర్చోబెట్టాల్సి వచ్చింది. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ పోలీస్‌స్టేషన్‌కు ఇటీవల వచ్చిన రాధేమా స్టేషన్ అధికారి సీట్లో కూర్చోవటం పెను వివాదానికి దారి తీసిన విషయం విదితమే. అలాగే, తన శిష్యగణంలో ఒకరి కోడలిపై వరకట్నం వేధింపుల కేసులోనూ రాధేమా ప్రమేయం ఉందంటూ బాధితురాలి కుటుంబీకులు కేసు పెట్టారు. ఈ అంశాలపైనే విలేకరులు ఆమెను ప్రశ్నించగా మీరేమైనా పూలు కడిగిన ముత్యాలా? అలాంటి ప్రశ్నలను నన్నెందుకు అడుగుతున్నారు? నోళ్లు ముయ్యండంటూ వారికి రాధేమా ఎదురు తిరిగింది. కూర్చోలోంచి లేచి వెళ్లే ప్రయత్నం చేయగా ఆమె అనుచరులు శాంతపరిచారు. దీంతో కార్యక్రమం సజావుగా సాగిపోయింది. -
కూర్చీ ఖాళీగా ఉందని కూర్చున్నా..
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఓ పోలీసు స్టేషన్ హౌస్ అధికారి(ఎస్హెచ్ఓ) కుర్చీలో సాధ్వా రాధేమా కూర్చున్న సంఘటన వివాదస్పదమైన సంగతి తెలిసిందే. రాధేమా ఆయన కుర్చీలో కూర్చోవడంతో నిజంగా ఆయన పదవి నుంచే సస్పెండ్ అయిపోయారు. ఈ సంఘటనపై రాధేమా స్పందించారు. బాత్రూం వాడుకోవడానికి తాను పోలీస్ స్టేషన్లోకి వెళ్లానని, అక్కడ ఓ కూర్చీ ఖాళీగా ఉంటే దానిలో కూర్చున్నానని, అది ఎస్హెచ్ఓ సీటని తనకి తెలియదని రాధేమా చెప్పారు. తన కూర్చీలో నుంచి లేవాల్సిందిగా ఎస్హెచ్ఓ తనను అభ్యర్థించినట్టు పేర్కొన్నారు. తాను వెంటనే ఆ కూర్చీలో నుంచి లేచానని చెప్పారు. ఆ సమయంలో తీసిన ఫోటో ఇలా చర్చనీయాంశమైందని తెలిపారు. ఎస్హెచ్ఓకు తానెవరో కూడా తెలియనది, ఢిల్లీ పోలీసును అగౌరవపరిచే ఉద్దేశ్యం తనకు లేదని సమర్థించుకున్నారు. రిపోర్టుల ప్రకారం స్థానిక వివేక్ విహార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రాధేమా, స్టేషన్ హౌస్ అధికారి కూర్చీలో కూర్చున్నారు. ఆమె పక్కనే ఎస్హెచ్ఓ సంజయ్ శర్మ మెడలో ఎర్రటి శాలువాతో చేతులు కట్టుకుని నిలబడి ఉన్న ఫోటో వెలుగులోకి వచ్చింది. -
పోలీస్ అధికారి కుర్చీలో రాధే మా!
న్యూఢిల్లీ: వివాదాస్పద సాధ్వీ రాధే మా మళ్లీ వార్తల్లోకెక్కారు. ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె స్టేషన్ హౌస్ అధికారి (ఎస్హెచ్ఓ) సీట్లో కూర్చున్నారు. ఆమె పక్కనే ఎస్హెచ్ఓ సంజయ్ శర్మ మెడలో ఎర్రటి శాలువాతో చేతులు కట్టుకొని నిలబడి ఉన్న ఫొటో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్థానిక వివేక్ విహార్ పోలీస్ స్టేషన్లో ఇది చోటుచేసుకుంది. దీనిపై స్టేషన్ అధికారి సంజయ్ శర్మను ప్రశ్నించగా.. రాధే మా రామ్‌లీలా మైదానానికి వెళ్లే మార్గంలో తమ స్టేషన్ ముందు ఆగి, స్టేషన్లో ఉన్న టాయిలెట్‌ను ఉపయోగించుకున్న తర్వాత ఆమె తన కుర్చీలో కూర్చున్నారని తెలిపారు. తన సీటు నుంచి లేవాలని రాధే మాను చేతులు జోడించి అభ్యర్థించానని, ఆ సమయంలోనే ఫొటో తీశారని ఎస్హెచ్ఓ చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే రామ్‌లీలా మైదానంలోని జీటీబీ పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులు భక్తి పాటలకు డ్యాన్స్ చేస్తూ ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో రాధే మాతో పాటు ఐదుగురు పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటనలు సెప్టెంబర్ 28, 29 తేదీల్లో జరిగాయి. ఈ వీడియోను రాధే మా ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరిని ప్రస్తుతం విధుల నుంచి తప్పించి హోల్డ్‌లో ఉంచామని ఉన్నతాధికారులు తెలిపారు. -
కానిస్టేబుల్స్ వర్సెస్ ఎస్‌హెచ్‌వో
24 గంటలు డ్యూటీలు వేస్తున్నారని కానిస్టేబుళ్ల మండిపాటు పనిచేయమంటే ఆరోపణలు చేస్తున్నారంటున్న ఎస్‌హెచ్‌వో తెరవెనక మామూళ్ల వ్యవహారమే కీలకమని సమాచారం మెడికల్ లీవ్‌లో 9 మంది కానిస్టేబుళ్లు కొత్తపేట స్టేషన్లో తారస్థాయిలో వివాదం వివాదం నేపథ్యంలోనే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం సాక్షి, గుంటూరు : గుంటూరు అర్బన్ జిల్లాలోని కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో పని రగడ తారస్థాయికి చేరింది. కానిస్టేబుళ్ళు, సీఐల మధ్య గత 20 రోజులుగా అంతర్గతంగా సాగుతున్న రగడ నేపథ్యంలో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పని పేరుతో సీఐ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ సదరు కానిస్టేబుల్ సీఐతో వాదనకు దిగి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో అర్బన్ పోలీసు అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. వీరి మధ్య మామూళ్లకు సంబంధించి భేదాభిప్రాయాలు ఉన్నాయని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. తొలుత వాగ్వివాదం.. ఆపై ఆత్మహత్యాయత్నం... గురువారం ఉదయం కొత్తపేటలో పనిచేసే కానిస్టేబుల్ వెంకటేష్ సీఐతో తొలుత వాగ్వివాదానికి దిగాడు. డ్యూటీల పేరుతో తనను అసభ్య పదజాలంతో తిట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీఐని తీవ్రస్థాయిలో అరిచి వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ప్రైవేటు వైద్యశాలలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై అర్బన్ ఎస్పీ త్రిపాఠీ.. అదనపు ఎస్పీ భాస్కరరావును విచారణ అధికారిగా నియమించారు. కమర్షియల్ స్టేషన్... ఈ పోలీస్‌స్టేషన్ అత్యధిక ఆదాయ వనరులున్నదిగా పేరుంది. సినిమా హాల్ మొదలుకుని బార్ల వరకు అన్నీ ఈ స్టేషన్ పరిధిలోనే ఎక్కువగా ఉండటంతో దీనిని కమర్షియల్ స్టేషన్‌గా పోలీసులు పిలుస్తుంటారు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం వరకు వీఆర్‌లో ఉన్న శ్రీకాంత్‌బాబు స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఎస్‌హెచ్‌వో, కానిస్టేబుల్ మధ్య చిన్న చిన్న విషయాల్లో మొదలైన రగడ రోజురోజుకూ పెరిగి మామూళ్ల వ్యవహారం వరకు వచ్చినట్లు తెలిసింది. సీఐ మామూళ్లన్నీ తానే తీసుకుంటున్నాడనేది కానిస్టేబుళ్ల ఆరోపణ. పైగా పనిపేరుతో నిత్యం వేధిస్తున్నాడని చెబుతున్నారు. ఉదయం 8.30 గంటలకు డ్యూటీకి వచ్చిన కానిస్టేబుల్‌ను డ్యూటీ ముగిశాక కూడా పంపించకుండా మరుసటి రోజు 8.30 వరకు చేయాలని తీవ్ర పదజాలంతో హెచ్చరిస్తున్నాడనేది కానిస్టేబుళ్ల అభియోగం. ఆయన పనిపేరుతో దూషించడం వల్ల 9 మంది కానిస్టేబుళ్ళు సెలవులో వెళ్ళిపోయారని, ఓ ఎస్ఐ కూడా వెళ్ళిపోయారని చెబుతున్నారు. పని సక్రమంగా చేయమంటే.. ఆరోపణలు చేస్తున్నారు : సీఐ ఈ ఆరోపణలపై సీఐ శ్రీకాంత్‌బాబు మాట్లాడుతూ పని సక్రమంగా చేయమని చెప్పిన దానికి ఇదంతా చేస్తున్నారని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన వెంకటేష్‌కి ఖైదీ నంబర్ 150 సినిమా విడుదల రోజు హాల్ వద్ద డ్యూటీ వేస్తే చేయకుండా మఫ్టీలో తిరుగుతున్నాడని, తాను గుర్తించి ప్రశ్నిస్తే ఇలా చేశాడని తెలిపారు. మామూళ్ల వ్యవహారం తనకేమీ తెలియదని, వచ్చి 20 రోజులే అయిందని చెప్పారు. -
అత్యాచారం కేసులో బాలుడి అరెస్టు
నిజామాబాద్ రూరల్ : బాలికపై అత్యాచారం చేసిన కేసులో బాలుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. వినాయక విగ్రహాలు తయారు చేసి విక్రయించేందుకు గుజరాత్ నుంచి కొన్ని కుటుంబాలు వలస వచ్చాయి. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు ప్రాంతంలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని, విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఓ కుటుంబానికి చెందిన ఏడేళ్ల బాలికపై, అదే ప్రాంతానికి చెందిన బాలుడు (15) శుక్రవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
రేపుల రాజ్యం యూపీ!
ఉత్తరప్రదేశ్ రేపుల రాజ్యంగా మారుతోంది. మరో రెండు ఘోరమైన అత్యాచారాలు వెలుగు చూశాయి. రెండు కేసుల్లోనూ రక్షకులే భక్షకులయ్యారు. తొలి సంఘటన మైనర్ బాలికల రేపు, హత్యల ఘటనతో మే 28 నుంచి అట్టుడుకుతున్న బదాయూలోనే జరిగింది. ఒక మైనర్ బాలికను దుండగులు అపహరించి, నెలరోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశారు. ఆమెది ఇస్లామ్ పూర్. తనను మొదట ఎమ్మెల్యే డ్రైవర్, ఆ తరువాత బబ్రాల్ ఎమ్మెల్యే, సమాజ్ వాదీ పార్టీ నేత రామ్ ఖిలాడీ యాదవ్ లు అత్యాచారం చేశారని ఆ బాలిక ఆరోపిస్తోంది. నెల రోజులుగా అమ్మాయి కనిపించకపోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఫలితంగా అమ్మాయిని దుండగులు విడిచిపెట్టారు. ఇక రెండో సంఘటనలో, పోలీస్ నిర్బంధంలో ఉన్న తన భర్తను కలిసేందుకు వెళ్లిన ఒక మహిళను స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా, పలువురు కానిస్టేబుళ్లు బలాత్కరించారు. ఈ సంఘటన హమీర్ పూర్ జిల్లా లోని సుమేర్ పూర్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఎస్ హెచ్ ఓ అరెస్టయ్యారు. కానిస్టేబుళ్లు కాలికి బుద్ధి చెప్పారు. యూపీలో ప్రతి రోజూ కనీసం పది రేపు కేసులు నమోదవుతున్నాయి. మొత్తం మీద యువ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కి రేపులు పెద్ద తలనొప్పిగా మారాయి. -
ఎస్హెచ్ఓను సస్పెండ్ చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్ఓ)ను సస్పెండ్ చేయాలని విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా డిమాండ్ చేశారు. తొమ్మిదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం కేసులో త్వరగా నివేదిక ఇచ్చి, నిందితులపై చర్యలు తీసుకోకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఉత్తర ఢిల్లీలోని బరాహిందూ ప్రాంతంలో ఈ నెల 2న సాయంత్రం ఓ దుర్మార్గుడు తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేస్తే నిందితులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. బాధితురాలు చిన్నారి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పోలీసులు నిందితులపై ఎలాంటి చర్యలు చేపట్టడంలేదన్నారు. దీనికి కారణం కాంగ్రెస్ నాయకుల ఫైరవీలేనని ఆరోపించారు. వెంటనే కేంద్ర హోంశాఖ స్పందించి నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని కోరారు.