ఓవైపు సమాజం, టెక్నాలజీ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే మరోవైపు మహిళలకు రక్షణ సన్నగిల్లుతోంది. మైనర్ బాలికల నుంచి యువతులు, గర్భవతి మహిళలను కూడా కామాంధులు వదిలిపెట్టడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా అత్యాచార బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడి గౌరవమైన పోలీస్ వృత్తికి కళంకం తీసుకువచ్చాడు ఓ ప్రబుద్ధుడు. తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు తెలియజేసి న్యాయం కావాలని కోరిన బాధితురాలిపై పోలీస్ స్టేషన్‌లోనే ఓ పోలీస్ లైంగికదాడికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది.
13 ఏళ్ల అత్యాచార బాధితురాలిపై లలిత్‌పూర్ జిల్లా పాలి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అఘాత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో స్టేషన్ ఇంఛార్జ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. కేసు వివరాలను లలిత్‌పూర్ ఎస్పీ నిఖిల్ పతక్ వివరిరంచారు. పాలికి చెందిన నలుగురు యువకులు బలికను మభ్యపెట్టి ఏప్రిల్ 22న బోపాల్ తీసుకెళ్లి మూడు రోజుల పాటు సాముహిక అత్యాచారం చేశారు. అనంతరం బాలికను స్వగ్రామానికి తీసుకొచ్చి పాలి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ తిలక్‌ధారి సరోజ్‌కు అప్పగించి పరారయ్యారు.
చదవండి: భార్యను వదిలి మరో మహిళతో వెళ్లిపోయి..
స్టేషన్ అధికారి బాలిక నుంచి సమాచారం సేకరించి తన బంధువుల మహిళతో కలిపి చైల్డ్ లైన్ సెంటర్‌కు పంపాడు. రెండు రోజుల తర్వాత బాలికను స్టేట్‌మెంట్ రికార్డు చేయాలనే పేరుతో స్టేషన్‌కు పిలిపించి వేరే గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మళ్లీ బాలికను చైల్డ్‌లైన్ సెంటర్‌కు పంపించాడు. తరువాత కౌన్సెలింగ్ సెషన్‌లో బాలిక తనకు జరిగిన విషయం చెప్పడంతో చైల్డ్‌లైన్ సిబ్బంది ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పాలి స్టేసన్ ఇంఛార్జ్ సహా ఆరుగురు నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వివరాలు వెల్లడిస్తున్న లలిత్‌పూర్ ఎస్పీ
బాలిక అత్తను కూడా నిందుతురాలిగా చేర్చారు. స్టేషన్ ఇంఛార్జ్ తిలక్‌ధారిని సస్పెండ్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డిఐజి స్థాయి అధికారి కూడా ఈ విషయంపై 24 గంటల్లో నివేదికను కోరారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.
చదవండి: వ్యభిచార గృహంపై దాడి: ముగ్గురి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment