Lalitpur
-
బాలుడి ముక్కు కొరికేసిన పొలిటికల్ లీడర్.. అంత కోపం దేనికో?
లక్నో: నలుగురికి మంచి చెడులు చెప్పాల్సిన నాయకులే ఒక్కోసారి వారు చేసే పనులతో నవ్వులపాలవుతుంటారు. ఓ రాజకీయ నాయకుడు కోపంతో తమ ఇంట్లో పని చేసే 16 ఏళ్ల బాలుడి ముక్కును కొరికేశాడు. తీవ్ర రక్త స్రావంతో ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌లో సోమవారం వెలుగులోకి వచ్చింది. అభయ్ నామ్‌దేవ్ అనే బాలుడు.. సచిన్ సాహూ అనే రాజకీయ నాయకుడి ఇంట్లో సహాయకుడిగా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం బాలుడు చిన్న తప్పు చేశాడని కోపంతో రగిలిపోయిన సాహూ అతడి ముక్కు కొరికేశాడు. తీవ్ర రక్తస్రావమైన బాలుడిని శనివారం రాత్రి స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఝాన్సీ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవటం వల్ల చర్యలు తీసుకోలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఎస్పీ నేత కారును ఢీకొట్టి.. 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు డ్రైవర్.. వీడియో వైరల్ -
యూపీలో దారుణం.. అత్యాచార బాధితురాలిపై పోలీస్ లైంగిక దాడి
ఓవైపు సమాజం, టెక్నాలజీ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే మరోవైపు మహిళలకు రక్షణ సన్నగిల్లుతోంది. మైనర్ బాలికల నుంచి యువతులు, గర్భవతి మహిళలను కూడా కామాంధులు వదిలిపెట్టడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా అత్యాచార బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడి గౌరవమైన పోలీస్ వృత్తికి కళంకం తీసుకువచ్చాడు ఓ ప్రబుద్ధుడు. తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు తెలియజేసి న్యాయం కావాలని కోరిన బాధితురాలిపై పోలీస్ స్టేషన్లోనే ఓ పోలీస్ లైంగికదాడికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. 13 ఏళ్ల అత్యాచార బాధితురాలిపై లలిత్పూర్ జిల్లా పాలి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అఘాత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో స్టేషన్ ఇంఛార్జ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. కేసు వివరాలను లలిత్పూర్ ఎస్పీ నిఖిల్ పతక్ వివరిరంచారు. పాలికి చెందిన నలుగురు యువకులు బలికను మభ్యపెట్టి ఏప్రిల్ 22న బోపాల్ తీసుకెళ్లి మూడు రోజుల పాటు సాముహిక అత్యాచారం చేశారు. అనంతరం బాలికను స్వగ్రామానికి తీసుకొచ్చి పాలి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ తిలక్ధారి సరోజ్‌కు అప్పగించి పరారయ్యారు. చదవండి: భార్యను వదిలి మరో మహిళతో వెళ్లిపోయి.. స్టేషన్ అధికారి బాలిక నుంచి సమాచారం సేకరించి తన బంధువుల మహిళతో కలిపి చైల్డ్ లైన్ సెంటర్‌కు పంపాడు. రెండు రోజుల తర్వాత బాలికను స్టేట్మెంట్ రికార్డు చేయాలనే పేరుతో స్టేషన్‌కు పిలిపించి వేరే గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మళ్లీ బాలికను చైల్డ్‌లైన్ సెంటర్‌కు పంపించాడు. తరువాత కౌన్సెలింగ్ సెషన్లో బాలిక తనకు జరిగిన విషయం చెప్పడంతో చైల్డ్‌లైన్ సిబ్బంది ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పాలి స్టేసన్ ఇంఛార్జ్ సహా ఆరుగురు నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాలు వెల్లడిస్తున్న లలిత్పూర్ ఎస్పీ బాలిక అత్తను కూడా నిందుతురాలిగా చేర్చారు. స్టేషన్ ఇంఛార్జ్ తిలక్‌ధారిని సస్పెండ్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డిఐజి స్థాయి అధికారి కూడా ఈ విషయంపై 24 గంటల్లో నివేదికను కోరారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. చదవండి: వ్యభిచార గృహంపై దాడి: ముగ్గురి అరెస్ట్ -
యూపీలో బాలికపై ఐదేళ్ల పాటు అత్యాచారం..
లలిత్పూర్: ఉత్తరప్రదేశ్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో లలిత్పూర్ జిల్లా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు తిలక్ యాదవ్, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) దీపక్ అహిర్వార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. తనపై ఐదేళ్లపాటు అత్యాచారం చేశారంటూ బాధితురాలు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సహా మొత్తం 25 మందిపై ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 12న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో బాలిక తండ్రి, మామ కూడా ఉన్నారు. శుక్రవారం మీర్జాపూర్లో తిలక్ యాదవ్, దీపక్ అహిర్వార్‌తో పాటు మహేంద్ర దూబే అనే ఇంజనీర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారం కేసులో తమ పార్టీ నేత అరెస్టు కావడంతో సమాజ్‌వాదీ పార్టీ లలిత్పూర్ జిల్లా పార్టీ యూనిట్‌ను రద్దు చేసింది. -
సీఎంగారూ నీళ్లు ఇలా వృథా చేస్తారా?
ఆ ప్రాంతం కరువుతో అల్లాడిపోతున్నది. తాగడానికి కూడా గుక్కెడు నీళ్లు లేక జనం నానా అవస్థలు పడుతున్నారు. కరువు తాండవిస్తున్న అలాంటి ప్రాంతంలో సమీక్ష నిర్వహించడానికి ముఖ్యమంత్రి వస్తున్నారనేగానే.. ఆయన హెలిప్యాడ్ కోసం అధికారులు వేలలీటర్ల నీటిని వృథా చేసేశారు. ట్యాంకర్ల కొద్ది నీటి ఉపయోగించి హెలిప్యాడ్ సిద్ధం చేశారు. కరువు పీడిత ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో సీఎం అఖిలేశ్ యాదవ్ పర్యటన సందర్భంగా ఇలా నీటిని దుబరా చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న బుందేల్‌ఖండ్ లోని లలిత్‌పూర్‌లో ప్రజలకు కరువు సహాయం ఏమేరకు అందుతున్నదో సమీక్షించడానికి సీఎం అఖిలేశ్ పర్యటన సందర్భంగా ఈ హెలిప్యాడ్‌ను అధికారులు ఏర్పాటుచేశారు. ఈ వివాదంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. గుక్కెడు నీళ్లు లేక ప్రజలు చస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడింది. సీఎం అఖిలేశ్ తీరు చాలా అసంబద్ధంగా ఉందని, నీటిని ఇలా వృథా చేయడంపై సీఎం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత రితా బహుగుణ డిమాండ్ చేశారు. హెలిప్యాడ్ కోసం నీటి వృథా అంశంపై సీఎం క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. అధికార ఎస్పీ మాత్రం ఆ అవసరం లేదంటోంది. హెలిప్యాడ్ సిద్ధం చేసే బాధ్యత సెక్యూరిటీ అధికారులదని, దానిపై సీఎం ఎలా క్షమాపణ చెప్తారని ప్రతిపక్షాలను ప్రశ్నిస్తోంది. కరువు పీడిత లాతూరులో మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ ఖడ్సే పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ కోసం 10వేల లీటర్ల నీటిని వృథా చేయడం ఇప్పటికే దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. -
కెన్యా కాల్పుల్లో భారతీయ బాలుడు మృతి
కెన్యా రాజధాని నైరోబీలో వెస్ట్గేట్ మాల్‌పై తీవ్రవాదుల దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు పరాంశ్జైన్ మరణించాడని అతడి బంధువులు మంగళవారం లక్నోలో వెల్లడించారు. ఆ ఘటనలో పరాంశ్ తల్లి ముక్తా, సోదరి పూర్వీలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఆ ఘటన తమ కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మనోజ్ కుటుంబంతో పాటు షాపింగ్‌మాల్‌కు వెళ్లిన బ్యాంక్ ఉద్యోగి మరణించిందని, వారి కారు డ్రైవర్ ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదని చెప్పారు. పరాంశ్ జైన్ తండ్రి మనోజ్ కుమార్ జైన్ నైరోబీలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. బుందేల్‌ఖండ్‌లోని లలిత్‌పూర్‌కు చెందిన వారి కుటుంబం కొన్ని సంవత్సరాల క్రితం ఇండోర్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ నుంచి నైరోబీలోని బరోడా శాఖకు బదిలీపై వెళ్లారని చెప్పారు. గత రెండునెలల క్రితమే మనోజ్ కుమార్‌కు పదోన్నతి లభించిందన్నారు.